ఫిబ్రవరి 12, బుధవారం మాఘ పౌర్ణమి. ఈ రోజున 5 చోట్ల దీపాలు పెడితే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఆ 5 చోట్లు ఏమిటంటే..
Telugu
తులసి మొక్క
మాఘ పౌర్ణమి సాయంత్రం తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం పెట్టి ప్రదక్షిణ చేయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో చెడు శక్తులు తొలగిపోతాయి. ధనం పెరుగుతుంది.
Telugu
ముఖద్వారం ఇరువైపులా
మాఘ పౌర్ణమి సాయంత్రం ఇంటి ముఖద్వారానికి ఇరువైపులా దీపాలు పెట్టి లక్ష్మీదేవిని ఇంట్లోకి రమ్మని ప్రార్థించండి. ఇంట్లో సంతోషం, ధనం నిలిచి ఉంటుంది.
Telugu
రావి చెట్టు కింద
రావి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం. మాఘ పౌర్ణమి సాయంత్రం రావి చెట్టు కింద దీపం పెట్టి ప్రార్థిస్తే మీ జీవితంలో ఆనందం నిలిచి ఉంటుంది. సడన్ గా డబ్బు మీ దగ్గరకు చేరుతుంది.
Telugu
ఇంటి పై అంతస్తులో
మాఘ పౌర్ణమి సాయంత్రం ఇంటి పై అంతస్తులో కూడా దీపం పెట్టండి. అక్కడ ఎప్పుడూ చీకటిగా ఉంటుంది. అక్కడ దీపం పెట్టడం వల్ల చెడు శక్తులు తొలగిపోయి, ధనప్రాప్తి కలుగుతుంది.
Telugu
తాగునీరు ఉంచే చోట
ఇంట్లో తాగునీరు ఉంచే చోటు పితృదేవతలు ఉంటారట. మాఘ పౌర్ణమి నాడు అక్కడ కూడా దీపం పెట్టండి. దీనివల్ల పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ధనం పెరుగుతుంది.