సాధారణంగా వర్షం పడితే మనసు పులకరిస్తుంది. అయితే పెళ్లి సమయంలో వర్షం పడితే, అది వధూవరులకు అదృష్టంగా భావిస్తారు.
వర్షం అనేది స్వచ్ఛత, ఆశీర్వాదం, ఐక్యత, శ్రేయస్సుకు ప్రతీక. అందుకే పెళ్లి సమయంలో వర్షం పడటం మంచి శకునంగా చెబుతారు.
పెళ్లి రోజున వర్షం కురిస్తే, ఆ జంట కలిసిమెలిసి సంతోషంగా జీవించడానికి సరిపడా అపారమైన సంపదను పొందుతారని నమ్ముతారు.
పెళ్లి సమయంలో వర్షం పడి తగ్గితే, అది కొత్త జీవితానికి నాంది. దీనివల్ల వధూవరులు తమ జీవితంలో స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు.
పెళ్లి రోజున వర్షం పడితే, ఆ కొత్త జంట తమ జీవితంలో అద్భుతమైన ఎదుగుదలను చూస్తారని పండితులు చెబుతున్నారు.
పెళ్లి సమయంలో వర్షం పడటం చాలా మంచి సంకేతం. కాబట్టి ఇకపై శుభకార్యాలు జరుగుతున్నప్పుడు వర్షం పడితే అస్సలు కంగారు పడకండి.
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Kedarnath Trip : కేవలం రూ.5 వేలలో కేదార్‌నాథ్ యాత్ర.. పూర్తి ప్లాన్ ఇదే
Lucky Wallpapers: మీ మొబైల్‌లో ఈ వాల్‌పేపర్ ఉంటే అదృష్టం మీ వెంటే!