MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Spiritual
  • మహారాష్ట్రలోని తుల్జాపూర్‌లో ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలు ఇవే!

మహారాష్ట్రలోని తుల్జాపూర్‌లో ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలు ఇవే!

మహారాష్ట్రలోని (Maharashtra) ఉస్మానాబాద్ జిల్లాలో తుల్జాపూర్ (Tuljapur) ఉంది. తుల్జాపూర్ ఒక పవిత్ర పర్యాటక ప్రాంతం. తుల్జాపూర్ సహ్యాద్రి పర్వతశ్రేణులలోని యమునాచల కొండలలో ప్రశాంత నిశ్శబ్ద నగరంగా ఉంది. ఈ ప్రాంతంలో అనేక సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. ఇప్పుడు మనంతుల్జాపూర్ ప్రత్యేకత గురించి   తెలుసుకుందాం.. 

2 Min read
Author : Navya G
Published : Jan 13 2022, 03:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈ నగరం సోలాపూర్ (Solapur) నుండి ఔరంగాబాద్ (Aurangabad) వెళ్లే రహదారిపై ఉంది. ఈ ప్రాంతాన్ని చించాపూర్ అని కూడా పిలిచేవారు. ఈ ప్రాంతంలో చింత చెట్లు ఎక్కువగా ఉండటంతో చించాపూర్ అని పిలిచేవారు. ఈ ప్రదేశంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాల సందర్శన పర్యాటకులకు తప్పక నచ్చుతుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

తుల్జాపూర్ లో ప్రధాన ఆకర్షణగా తుల్జా భవాని దేవాలయం ఉంది. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ప్రతియేటా యాత్రికులు (Pilgrims) పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ ప్రాంతంలో ప్రధాన ఆకర్షణగా తుల్జా భవాని దేవాలయం ఉండటంతో ఈ ప్రదేశం పేరును చించాపూర్ (Chinchapur) నుండి తుల్జాపూర్ గా మార్చారు.
 

37

తుల్జాపూర్ లో ప్రధాన ఆకర్షణగా తుల్జా భవాని దేవాలయం, ఘట శిలా దేవాలయం,  విష్ణు తీర్థం, కల్లోల తీర్థం, పాపనాశి తీర్థాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలు ఒక్కొక్కటి ఒక్కో విశిష్టతను (Uniqueness) కలిగి పర్యాటకులను ఆకట్టుకునేలా (Impressive) ఉంటాయి. తుల్జాపూర్ కి వెళ్ళినప్పుడు ఈ ప్రదేశాలను తప్పక సందర్శించండి.
 

47

తుల్జా భవాని దేవాలయం: భారత దేశంలోని 51 శక్తి పీఠాలలో చిన్న గ్రామమైన తుల్జాపూర్ లో తుల్జా భవాని దేవాలయం (Tulja Bhavani Temple) ఉంది. 12వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో దుర్గాదేవి తుల్జా భవాని అవతారంలో దర్శనమిస్తుంది. ఒక మీటరు కంటే ఎక్కువ పొడవు ఉన్న ఈ ప్రతిమను గ్రానైట్ తో చెక్కారు. మహిషాసురుడిని సంహరించడానికి దేవత ఇక్కడ వెలిసిందని భక్తుల నమ్మకం (Believe).
 

57

విష్ణు తీర్థం: తుల్జాపూర్ లో ప్రధాన ఆకర్షణగా విష్ణు తీర్థం (Vishnu Theertham) ఉంది. తుల్జా భవాని దేవాలయానికి ఈశాన్య దిక్కున (Northeast) మూడు ద్వారముల విష్ణు తీర్థము ఇది.  గంగా, యమునా, సరస్వతి కలిసే ప్రదేశంగా నమ్మే ఈ ప్రాంతం కల్లోల తీర్థం వంటిది. ఈ తీర్థంలో స్నానం ఆచరించిన అన్ని పాపాలు తొలగిపోయి పాప విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.
 

67

కల్లోల తీర్థము: బ్రహ్మదేవుని కోరిక మేరకు గంగ, యమున, సరస్వతి నదుల జలాలు వచ్చి ఈ చెరువులో కలిసాయని అని పురాణకథనం. ఈ మూడు నదీజలాలు వచ్చి కలిసినప్పుడు తీవ్రమైన ప్రతిధ్వని ఏర్పడిందని అందుకే ఈ చెరువుకు కల్లోల తీర్థముగా (Kallola Theertham) పేరు వచ్చిందని కథనం. ఈ చెరువు చుట్టూ అన్నివైపులా గోడలు కలిగి ఉంది. ఈ చెరువులో స్నానమాచరించిన పాపాలు (Sins) తొలగిపోయి పునీతులవుతారు అని భక్తుల నమ్మకం.
 

77

పాపనాశి తీర్థం: ప్రసిద్ధి చెందిన ప్రధాన చెరువులలో పాపనాశి తీర్థం (Papanashi Theertham) ఒకటి. పాప నాశి అనగా పాపాలను నాశనం (Destruction) చేసే జలం అని అర్థం. ఈ తీర్థం రాతితో కప్పబడి నిర్మించబడినది. ఈ చెరువులో స్నానమాచరించిన సర్వపాపాలు తొలగిపోయి పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved