MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Spiritual
  • Toli Ekadashi 2025: తొలి ఏకాదశి రోజున పొరపాటున కూడా అస్సలు చేయకూడని పనులు ఇవే..!

Toli Ekadashi 2025: తొలి ఏకాదశి రోజున పొరపాటున కూడా అస్సలు చేయకూడని పనులు ఇవే..!

ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధి ఏకాదశిని తొలి ఏకాదశిగా భావిస్తారు. ఈ ఏడాది 2025లో తొలి ఏకాదశి జులై 6వ తేదీ ఆదివారం రోజు వస్తోంది.

2 Min read
Author : ramya Sridhar
| Updated : Jul 04 2025, 05:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఏకాదశి రోజున ఏం చేయాలి?
Image Credit : Getty

ఏకాదశి రోజున ఏం చేయాలి?

హిందూ సంప్రదాయం ప్రకారం ఏకాదశి ని చాలా పవిత్రమైన, విశిష్టమైన రోజుగా పరిగణిస్తారు. వాటిలో తొలి ఏకాదశికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధి ఏకాదశిని తొలి ఏకాదశిగా భావిస్తారు. ఈ ఏడాది 2025లో తొలి ఏకాదశి జులై 6వ తేదీ ఆదివారం రోజు వస్తోంది. ఈ పర్వదినంతో పాటు చాతుర్మాస్య వ్రతం కూడా ఆ రోజు నుంచే మొదలౌతుంది. ఇది నాలుగు నెలల పాటు కొనసాగుతుంది.

ఈ నాలుగు నెలల్లో శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉంటారని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఇది భక్తులందరికీ ఆధ్యాత్మికంగా అత్యంత శుభకార్యాల సమయంగా పరిగణిస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
తొలి ఏకాదశి రోజున ఎలాంటి నియమాలు పాటించాలి..?
Image Credit : Getty

తొలి ఏకాదశి రోజున ఎలాంటి నియమాలు పాటించాలి..?

తొలి ఏకాదశి రోజున ఉపవాసం చేయడం ద్వారా పుణ్యం లభించడమే కాకుండా, పాపాలు కూడా తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.ఈ రోజున సాధ్యమైనంత వరకూ నిరాహారంగా ఉపవాసం చేయాలి. ఉపవాసం చేయడం కష్టంగా ఉంటే, పాలు, పండ్లు తీసుకోవచ్చు. కానీ అన్నం, ఉప్పు, ధాన్య పదార్థాలను నివారించాలి.

ఈ రోజున మద్యపానం, మాంసాహారం పూర్తిగా దూరం పెట్టాలి.

34
ఏకాదశి రోజు చేయకూడని పనులు
Image Credit : Getty

ఏకాదశి రోజు చేయకూడని పనులు

ఈ పవిత్ర రోజున కొన్ని పనులు చేయడం దోషకారకంగా భావిస్తారు. ముఖ్యంగా..

తులసి దళాలను తీయకూడదు – తులసి దేవీ శ్రీమహావిష్ణువుకు ప్రియమైనదిగా భావిస్తారు. ఏకాదశి రోజున ఆమె విశ్రాంతి తీసుకుంటుందనేది విశ్వాసం, కాబట్టి ఈ రోజు తులసి దళాలను పూజలో ఉపయోగించరాదు.

చీపుర్లను ఇంటి బయట పడేయకూడదు – ఇది సంపద వెలుపలికి వెళ్లే సంకేతంగా భావిస్తారు.

గోర్లు కత్తిరించకూడదు, కటింగ్, షేవింగ్ వంటివి చేయరాదు – ఇవి అశుభ ఫలితాలను ఇస్తాయని నమ్మకం.

పగటిపూట నిద్రపోకూడదు – ఈరోజు ధ్యానంలో గడపాలి. నిద్రపోవడం పుణ్య ఫలాన్ని తగ్గిస్తుంది.

ఇతరులపై నిందలు వేయడం, కోపంగా మాట్లాడటం, గొడవలు చేయడం వంటివి నివారించాలి. వీటివల్ల మన చుట్టూ ఉన్న పాజిటివ్ ఎనర్జీ తగ్గుతుందని భావిస్తారు.

44
ఏకాదశికి ప్రత్యేక పూజలు
Image Credit : Getty

ఏకాదశికి ప్రత్యేక పూజలు

ఈ రోజు విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీ సత్యనారాయణ వ్రతం, విష్ణు అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వల్ల మన ఇంటికి శుభం కలుగుతుంది. వీలుంటే ఆలయంలో లేదా ఇంట్లో శ్రీ మహావిష్ణువుకు పూజలు చేయాలి. పసుపు, కుంకుమ, తులసి, నైవేద్యం సమర్పిస్తూ భక్తిశ్రద్ధలతో ప్రార్థించాలి.

ఫైనల్ గా…

తొలి ఏకాదశి అంటే కేవలం ఉపవాసం మాత్రమే కాదు, అది మన ఆత్మను శుద్ధి చేసుకునే ఒక అవకాశంగా భావించాలి. శరీరానికి విశ్రాంతి, మనసుకు ప్రశాంతత కలిగించే ఈ పవిత్ర దినాన్ని శ్రద్ధతో జరుపుకుంటే, మన జీవితంలో శాంతి, సమృద్ధి నెలకొంటాయి. ఈ ఏకాదశిని ఆధ్యాత్మిక పునరుజ్జీవన దినంగా భావించి, మనల్ని మనం రీచార్జ్ చేసుకోగలిగితే, అదే నిజమైన పూజ అని చెప్పొచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Recommended image2
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image3
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Related Stories
Recommended image1
Spiritual: ఇంట్లో రోజూ కర్పూరం వెలిగిస్తే ఏమవుతుందో తెలుసా?
Recommended image2
Spiritual: ఇంట్లో ఈ నాలుగు ఉంటే..లక్ష్మీదేవి అనుగ్రహం లభించినట్లే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved