Zodiac signs: ఈ రాశులకు లక్ష్మీ కటాక్షం.. రాబోయే రోజుల్లో వీరు పట్టిందల్లా బంగారమే
రాబోయే నెల రోజుల పాటు మేషం, వృషభం, మిథునం, సింహం, తుల, మకరం రాశుల వారికి భాగ్యస్థాన ప్రభావంతో అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది.

భాగ్య స్థానం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఓ వ్యక్తి జీవితం పై తీవ్ర ప్రభావం చూపే స్థానం ఒకటి ఉంది..అదే రాశి చక్రంలోని తొమ్మిదో స్థానం. ఈ తొమ్మిదో స్థానం అంటేనే భాగ్య స్థానం.ఈ స్థానానికి ఎంతో విశిష్టత ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. ఎవరైనా వ్యక్తి జాతకంలో ఇది బలంగా ఉంటే... జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలు ఇట్టే తగ్గిపోతాయి. అదృష్టం అండగా నిలిచి, ప్రగతి మార్గం అందిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ఆరు రాశుల వారికి ... భాగ్య స్థానం
ప్రస్తుతం గ్రహాల సంచారం ఆధారంగా చూస్తే, రాబోయే రోజుల్లో ఆరు రాశుల వారికి ఈ భాగ్య స్థానం బలంగా ఉండడం వల్ల వారి జీవితాల్లో ముఖ్యమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు పండితులు వివరిస్తున్నారు. వచ్చే నెలరోజుల పాటు ఈ ప్రభావం కొనసాగనుంది. మేషం, వృషభం, మిథునం, సింహం, తుల, మకరం రాశుల వారికి ఇది ప్రత్యేకంగా వరంగా మారనుంది.
మేష రాశి
మేష రాశి వారికి ప్రస్తుతం గురుగ్రహం లాభకరమైన స్థానంలో ఉండటం వల్ల అదృష్టం అన్నివైపులా చేరే అవకాశాలు ఎక్కువ. కొత్త ఉద్యోగ అవకాశాలు, విదేశీ అవకాశాలు అనేక మార్గాల్లో కనిపించనున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభాలు పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యాల వాతావరణం ఏర్పడే సూచనలు ఉన్నాయి. గతంలో ఎదురైన ఆర్థిక సమస్యలు కొంతవరకూ పరిష్కారమవుతాయి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి శని లాభస్థానంలో ఉండటం వల్ల జీతాలు, ప్రమోషన్లు, వ్యాపార విస్తరణ వంటి అంశాల్లో మంచి ఫలితాలు కనిపించనున్నాయి. పెట్టుబడులకు లాభాలు రావచ్చు. కుటుంబంలో పెంపుదల, సంతానయోగం వంటి శుభ పరిణామాలు జరగొచ్చు. విదేశీ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.
మిథున రాశి
మిథున రాశి వారి జీవితంలో తాజా గ్రహ ప్రభావం వల్ల ఆదాయ వృద్ధికి దోహదపడుతుంది. గతంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందులకు మార్గం దొరుకుతుంది. పెద్దల ఆశీర్వాదం, తండ్రి తరఫు నుంచి ఆస్తి లాభదాయకంగా ఉండనుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశం వస్తుంది. మానసికంగా ప్రశాంతత, ఆరోగ్యంగా జీవించే అవకాశాలున్నాయి.
సింహ రాశి
సింహ రాశి వారికి ప్రస్తుతం కుజుడు అనుకూలంగా ఉండటం వల్ల మంచి కాలం ఎదురవ్వనుంది. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగాలలో అభివృద్ధి బాటలో సాగనున్నారు. విదేశీ ప్రయాణాలు, ఆస్తి లావాదేవీలు లాభసాధకంగా ఉంటాయి. సొంతింటి కల నెరవేరే సూచనలు కూడా కనపడుతున్నాయి. రోజువారీ ఆదాయం పెరుగుతుంది.
తుల రాశి
తుల రాశి వారు ప్రస్తుతం గురుగ్రహం ప్రభావంతో జీవితాన్ని నిలకడగా సాగించగలుగుతున్నారు. పెట్టుబడులు, షేర్ల ద్వారా లాభాలు సాధ్యమవుతాయి. వ్యాపార లావాదేవీలు జోరుగా కొనసాగుతాయి. కోర్టు కేసులు వంటి సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఇంట్లో పెళ్లిళ్లు, శుభకార్యాల వాతావరణం నెలకొంటుంది.
మకర రాశి
మకర రాశి వారికి శని దృష్టితో పాటు బుధుడు అనుకూలంగా ఉండటం వల్ల అనేక అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు, వేతన వృద్ధి, పెళ్లికి సంబంధించి సానుకూల పరిణామాలు చోటు చేసుకోవచ్చు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు రావడం వల్ల భవిష్యత్తు పట్ల ఆశలు పెరుగుతాయి. పెట్టుబడులు లాభిస్తాయి, వాయిదా పడిన డబ్బు చేతికి వస్తుంది.
భాగ్యస్థాన ప్రభావం
ఈ భాగ్యస్థాన ప్రభావం మరో నెలరోజుల పాటు కొనసాగే అవకాశముంది. జీవితాన్ని మెరుగుపర్చే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగం, వృత్తి, ఆర్థికం, కుటుంబం ఇలా అన్ని రంగాలలో కూడా అంచనాలకు మించి ఫలితాలు అందించే ఛాన్స్ ఉన్నదని గ్రహాల స్థితి సూచిస్తోంది.
అదృష్ట కాలం
ఈ ఆరు రాశుల వారికి ఇప్పటి నుంచి వచ్చే నాలుగు వారాల పాటు కాలం అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నందున, వారు కొత్త పనులు మొదలు పెట్టాలన్న, పాత సమస్యలకు పరిష్కారం వెతకాలా అనే దిశగా ఆలోచించవచ్చు. ఎప్పుడూ లేనంత అదృష్టం ఈ కాలంలో వారిని అనుసరిస్తుందని గ్రహల ప్రభావం ద్వారా అర్థమవుతోంది.