MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • Home
  • Life
  • Spiritual
  • Spiritual: గుడి వైపు వెనక భాగాన్ని ముట్టుకోకూడదు.. కారణమేమిటో తెలుసా!

Spiritual: గుడి వైపు వెనక భాగాన్ని ముట్టుకోకూడదు.. కారణమేమిటో తెలుసా!

 Spiritual : సాధారణంగా గుడికి వెళ్లిన  ప్రతి ఒక్కరూ ప్రదక్షిణలు చేస్తారు. ఆ సమయంలో గుడి వెనుక భాగాన్ని కూడా ముట్టుకొని  దండం పెట్టుకుంటారు. కానీ అలా చేయటం మంచిది కాదు అంటున్నారు వేద పండితులు. ఎందుకు కాదో ఇప్పుడు తెలుసుకుందాం.
 

Navya G | Published : Oct 28 2023, 06:52 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

 మనం తరచుగా గుడికి వెళ్తూనే ఉంటాం, చుట్టూ ప్రదక్షిణలో చేస్తూ మనసులో ఉన్న కోరికలు కోరుకుంటూ ఉంటాం. అయితే అటువంటి సమయాలలో మనం కొన్ని తప్పులు తెలియకుండానే చేస్తాం. అందులో ఒకటి గుడి వెనక భాగాన్ని తాకి దండం పెట్టుకోవడం. అలా చేయటం పెద్ద పొరపాటు అంటున్నారు వేద పండితులు.
 

26
Asianet Image

కొన్ని పురాణాల  ప్రకారం గుడిలోని వెనుక భాగంలో రాక్షసులు ఎక్కువగా ఉంటారు. అందుకే మనం ఆ వైపున తాకితే రాక్షసులను నిద్రలేపినట్లు అవుతుంది. రాక్షసుల ప్రతికూల ప్రభావాలు అన్నీ మన  మీద పడతాయట. దేవాలయంలోని వెనుక భాగాన్ని తాగి మనసులో ఉన్న కోరికలు కోరుకుంటే అవి నెరవేరవు.
 

36
Asianet Image

సరి కదా ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వెనకవైపు తలవాల్చి  మొక్కుకోవడమే కాదు కనీసం చేయి కూడా తగిలించకూడదు. అలాగే గుడిలో దేవుడికి వీపు కనిపించేలాగా వెనక్కి తిరిగి కూర్చోకూడదు.

46
Asianet Image

అలాగే దేవుడి దర్శనం తర్వాత గుడి నుంచి బయటికి వచ్చే సమయంలో గంట కొట్టకూడదు. అదే సమయంలో గుడికి ఎంతో పవిత్రంగా నియమనిష్టలతో వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనసుని  ప్రశాంతంగా ఉంచుకోవాలి.
 

56
Asianet Image

భగవంతుని దర్శన భాగ్యం అయినందుకు భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మనసులోని కోరికలు కోరుకోవటంతో పాటు పునర్దర్శన ప్రాప్తి కలగాలని కూడా కోరుకోవాలి. దేవుడిని ప్రార్థించే సమయంలో స్వామివారి ఎదుట ఎప్పుడూ నిలబడరాదు.

66
Asianet Image

అలాగే ప్రసాదం తిన్న తర్వాత ఆ ఎంగిలి చేత్తో దేవుడికి దండం పెట్టకూడదు. అలాగే దేవాలయానికి వెళ్ళాక కాళ్లు కడుక్కున్న తరువాతే అంతరాలయంలోకి ప్రవేశించాలి. ఇలాంటి చిన్న చిన్న నియమనిష్టలు పాటిస్తే భగవంతుని అనుగ్రహాన్ని సులువుగా పొందవచ్చు.

Navya G
About the Author
Navya G
ఆధ్యాత్మిక విషయాలు
 
Recommended Stories
Top Stories