Maha shivaratri: మహాశివరాత్రి నాడు ఏ రాశి వారు ఎలా పూజ చేయాలో తెలుసా?
శివునికి ప్రత్యేకమైన రోజు మహాశివరాత్రి. ఆ రోజున చాలామంది నిష్ఠగా శివున్ని ఆరాధిస్తారు. ఉపవాసం ఉంటారు. జాగారం చేస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శివరాత్రినాడు రాశిని బట్టి కొన్ని పనులు చేయడం ద్వారా శివయ్య మెప్పు పొందవచ్చట. చాలా మంచి జరుగుతుందట. మరి ఏ రాశి వారు ఏం చేస్తే మంచిదో ఇక్కడ తెలుసుకోండి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
శివుడికి ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి. ఆ రోజు శివ పూజ చేస్తే రెట్టింపు ఫలితాలు వస్తాయని అంటారు పెద్దలు. మామూలుగానే శివరాత్రినాడు అందరూ నిష్ఠగా పూజలు చేస్తారు. ఉపవాసం ఉంటారు. జాగారం చేస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ రోజు రాశుల వారిగా కొన్ని పనులు చేస్తే చాలా మంచి జరుగుతుందట. మరి ఏ రాశుల వారు ఏం చేస్తే మంచిదో ఇక్కడ తెలుసుకుందాం.
మేషం:
మహాశివరాత్రి రోజున మేష రాశి వాళ్లు శివుడికి తేనె సమర్పించాలి. తేనె స్వచ్ఛంగా ఉండాలి. చెరకు రసంతో శివలింగానికి అభిషేకం చేయాలి.
వృషభం:
ఈ రాశి వాళ్లు పచ్చి ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేయాలి. పాయసం నైవేద్యంగా పెట్టాలి. దీని వల్ల సంపద కలుగుతుందట.
మిథునం:
మిథున రాశి వారు బిల్వ పత్రాలు కలిపిన నీటితో శివుడికి అభిషేకం చేయాలి. పేదలకు అన్నదానం చేయాలి. దీని వల్ల సమస్యలు తీరుతాయట.
కర్కాటకం:
కర్కాటక రాశివారు వెన్నతో శివలింగానికి అభిషేకం చేయాలి. స్వీట్లు నైవేద్యంగా పెట్టాలి. దీని వల్ల ఒత్తిడి తగ్గి, శాంతి వస్తుంది.
కన్య:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యరాశి వారు పాలతో శివలింగానికి అభిషేకం చేయాలి. జామ, పైనాపిల్ లాంటి పచ్చని పండ్లు సమర్పించాలి.
తుల:
బెల్లం లేదా పంచదార మిఠాయిని శివుడికి సమర్పించాలి. గుడికి పంచదార దానం చేయాలి. దీని వల్ల అన్ని పనుల్లో విజయం వస్తుంది.
వృశ్చికం:
ఈ రాశి వాళ్లు కుంకుమపువ్వు కలిపిన నీటితో శివలింగానికి అభిషేకం చేయాలి. ఆపిల్ పండును సమర్పించాలి. ఎర్రటి వస్త్రాన్ని బ్రాహ్మణుడికి దానం చేయాలి. దీని వల్ల అదృష్టం కలిసి వస్తుంది.
ధనుస్సు:
గోపి చందనం కలిపిన నీటితో శివలింగానికి అభిషేకం చేయాలి. కుంకుమపువ్వు కలిపిన స్వీట్లు నైవేద్యంగా పెట్టాలి. దీని వల్ల కోరికలన్నీ నెరవేరుతాయి.
మకరం:
నల్ల నువ్వులు కలిపిన నీటితో శివుడికి అభిషేకం చేయాలి. డ్రై ఫ్రూట్స్ సమర్పించాలి. దీని వల్ల అన్ని సమస్యలు తీరుతాయి.
కుంభం:
ఈ రాశి వాళ్లు శివుడికి నీలం రంగు పువ్వులు సమర్పించాలి. చాక్లెట్ బర్ఫీ నైవేద్యంగా పెట్టాలి. పేదలకు దానం చేయాలి. శివుడి దయ ఉంటుంది.
మీనం:
ఈ రాశి వాళ్లు శివుడికి పసుపు పండ్లు సమర్పించాలి. ఆకలితో ఉన్నవాళ్లకు అన్నం పెట్టాలి. దక్షిణ ఇవ్వాలి. అన్ని కోరికలు నెరవేరుతాయి.