సెప్టెంబర్ లో చంద్ర గ్రహణం: ఈ రాశులకు కష్ట కాలమే..!
ఈ చంద్రగ్రహణం కూడా ఇదే భాద్రపద మాసంలో వస్తుండటం గమనార్హం. ఏడాది భాద్రపద మాసం ఆగస్టు 24 మొదలై, సెప్టెంబర్ 21 వరకు కొనసాగుతుంది. కాగా, సెప్టెంబర్ 7 వ తేదీ ఆదివారం ఈ గ్రహణం ఏర్పడనుంది.

చంద్ర గ్రహణం
ఈ ఏడాది మార్చిలో ఓ చంద్ర గ్రహణం ఏర్పడింది. సెప్టెంబర్ లో రెండో చంద్ర గ్రహణం ఏర్పడనుంది. భాద్రపద మాసం హిందూ పంచాంగంలో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఈ చంద్రగ్రహణం కూడా ఇదే భాద్రపద మాసంలో వస్తుండటం గమనార్హం. ఏడాది భాద్రపద మాసం ఆగస్టు 24 మొదలై, సెప్టెంబర్ 21 వరకు కొనసాగుతుంది. కాగా, సెప్టెంబర్ 7 వ తేదీ ఆదివారం ఈ గ్రహణం ఏర్పడనుంది. రాత్రి 9:56 గంటలకు ఈ చంద్రగ్రహణ స్పర్శ కాలం ప్రారంభమౌతుంది. మరి, ఈ చంద్ర గ్రహణం.. ఏ రాశులపై ఎలాంటి ప్రభావం చూపించనుందో తెలుసుకుందాం...
గ్రహణ కాలం...
నిమీలన కాలం – రాత్రి 10:59
మధ్యకాలం – రాత్రి 11:41
ఉన్మీలన కాలం – అర్థరాత్రి 12:22
మోక్ష కాలం – రాత్రి 1:26
పుణ్యకాలం – రాత్రి 3:30 వరకు కొనసాగుతుంది
మొత్తం మీద, ఈ గ్రహణం రాత్రి 9:56 గంటలకు మొదలై, ఉదయం 3:30 గంటలకు ముగుస్తుంది. భారతదేశం మొత్తం ఈ గ్రహణాన్ని వీక్షించవచ్చు.
ఆచారాలు, ఆచరణలు...
హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, గ్రహణ సమయంలో ఆహారం తినకూడదని సూచిస్తారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎటువంటి పనులు చేయకుండా ప్రశాంతంగా ఉండాలని నమ్మకం. ఆలయాలను మూసివేయాలని శాస్త్రాల్లో కూడా చెబుతుంటారు. మరుసటి రోజు దేవాలయాలు, ఇళ్లలో సంప్రోక్షణ చేసి పూజలు నిర్వహిస్తారు.
రాశులపై ప్రభావం
జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఈ చంద్రగ్రహణం రాశుల వారీగా వేర్వేరు ఫలితాలను ఇస్తుంది.
మేషం – ధనలాభం
వృషభం – బాధలు
మిథునం – ఆందోళన
కర్కాటకం – సౌఖ్యం
సింహం – స్త్రీ కారణంగా ఇబ్బందులు
కన్యా – అధిక కష్టాలు
తులా – పరువు నష్టం
వృశ్చికం – సుఖం
ధనుస్సు – ధన లాభం
మకరం – అనవసర ఖర్చులు
కుంభం – తీవ్రమైన సమస్యలు
మీనం – హానికర ఫలితాలు
ముఖ్యంగా కుంభం, మీనం, తుల, వృషభ, మిథున, సింహ, కన్యా, మకర రాశుల వారు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఈ సమయంలో శివనామస్మరణ, మహా మృత్యుంజయ మంత్ర జపం, నవగ్రహ స్తోత్రాల పఠనం శాంతి కలిగిస్తాయని నమ్ముతారు.
గమనిక
ఈ వివరాలు జ్యోతిషశాస్త్రం, పంచాంగాలు, సంప్రదాయ విశ్వాసాల ఆధారంగా ఇవ్వబడినవి. శాస్త్రీయ ధృవీకరణ అవసరం లేదు.