MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Spiritual
  • ఆ వేలితో బొట్టు పెట్టుకుంటున్నారా అయితే ఏం జరుగుతుందో తెలుసా..?

ఆ వేలితో బొట్టు పెట్టుకుంటున్నారా అయితే ఏం జరుగుతుందో తెలుసా..?

ముఖ సౌందర్యాన్ని పెంచే బొట్టులో (Bindi) చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అందమైన చంద్రబింబంలాంటి ముఖ కోసం మనం పెట్టుకునే బొట్టు మరింత అందాన్ని ఇస్తుంది. అయితే ముఖానికి అందాన్ని అందించడంతో పాటు ఆరోగ్యానికి (Healthy) కూడా అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది అని మీకు తెలుసా? ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా ఏ వేలుతో బొట్టు పెట్టుకుంటే మంచిదో.. ఎరుపురంగు తిలకాన్ని ఎందుకు ఉపయోగిస్తారో తెలుసుకుందాం.. 

2 Min read
Author : Navya G
Published : Jan 18 2022, 05:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

హిందూ సాంప్రదాయ (Hindu Traditional) ప్రకారం మనం పెట్టుకునే బొట్టుకు ఒక ప్రత్యేకత అంటూ ఉంది. మహిళలు బొట్టును ఐదోతనానికి చిహ్నంగా భావిస్తారు. అందుకే పెళ్లి అయిన ముత్తైదువులు ఎల్లవేళలా బొట్టును పెట్టుకుంటారు. బొట్టు పెట్టుకోవడానికి వీలులేని మహిళలు శుభ కార్యాలు చేయడానికి అర్హులుకారని (Ineligible) భావిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం బొట్టు ఏ వేలితో పెట్టుకుంటే మంచి జరుగుతుందో కూడా చెప్పడం జరిగింది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

బొట్టు గౌరవసూచకం: బొట్టు గౌరవసూచకంగా (Honor) గుర్తింపు. ఎవరైనా ముత్తయిదువులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్లకు బొట్టు పెట్టి గౌరవించడం మన హిందూ సంప్రదాయం. అదే విధంగా ఏదైనా శుభకార్యాలకు ఆహ్వానించే సమయంలో వారికి మర్యాదపూర్వకంగా (Polite) బొట్టుపెట్టి పిలవడం జరుగుతుంది. ఇది మన పెద్దల నుంచి వస్తున్న ఆనవాయితీ.
 

37

బొట్టు పెట్టుకునే సమయంలో ఏం స్మరించాలి:  మహిళలు బొట్టు పెట్టుకునే సమయంలో సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని జగన్మాతను స్మరించుకుంటూ (Remembering) నుదుటన బొట్టు పెట్టుకుంటే వారు సుమంగళిగా ఉంటారు. అంతా శుభమే (Good luck) జరుగుతుంది.
 

47

ఏ వేలితో ఏం ప్రయోజనం: బొట్టు ఒక్కొక్కరు ఒక్కో వేలితో బొట్టు పెట్టుకుంటారు. అయితే ఉంగరం వేలితో బొట్టు పెట్టుకుంటే శాంతి (Peace) కలుగుతుందని, మధ్య వేలితో పెట్టుకుంటే ఆయువు పెరుగుతుందని, చూపుడు వేలితో బొట్టు పెట్టుకుంటే ముక్తి (Salvation) కలుగుతుందని, బొటన వేలితో బొట్టు పెట్టుకుంటే పుష్టి కలుగుతుందని హిందూ సాంప్రదాయం ప్రకారం పురాణాలు చెబుతున్నాయి.
 

57

బొట్టు నుదుటనే ఎందుకు పెట్టుకోవాలి: నుదటి  భాగాన్ని బ్రహ్మ స్థానంగా భావిస్తారు. నుదుటన బొట్టు పెట్టుకుంటే బ్రహ్మను పూజించినట్లు అవుతుందని భావించి కనుబొమ్మల మధ్య భాగంలో బొట్టు పెట్టుకుంటారు. నుదటి భాగం జ్ఞాపకశక్తికి (Memory), ఆలోచనా శక్తికి (The power of thought) స్థానము కాబట్టి కనుబొమ్మల మధ్య తిలకము పెడతారు.
 

67

ఎరుపు రంగు ఎందుకు పెట్టుకోవాలి: చతుర్ముఖ బ్రహ్మ రంగు ఎరుపు (Red). కనుక బ్రహ్మ స్థానం అయిన నుదుటిపై ఎరుపు రంగు బొట్టు పెట్టుకోవడానికి ప్రాధాన్యత (Priority) ఇస్తారు. అందుకే బొట్టు అంటే ఎరుపు రంగుకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఎరుపు రంగు మనుషుల ఆత్మజ్యోతి స్వరూపమని బాధిస్తారు. కాబట్టి ఎక్కువగా మహిళలు ఎరుపురంగును బొట్టుగా పెట్టుకోవడానికి ఇష్టపడతారు.
 

77

ఆరోగ్యానికి కూడా మంచిది: ఎదుటి పెట్టుకున్న కుంకుమ బొట్టుపై సూర్యకాంతి (Sunlight) ప్రసరించి శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. కనుబొమ్మల మధ్య ఉండే సూక్ష్మమైన స్థానము విద్యుదయస్కాంత తరంగ రూపాలలో శక్తిని వెలువరిస్తుంది. నుదుటన పెట్టుకున్న బొట్టు వేడిని తగ్గించి చల్లదనాన్ని అందిస్తుంది. శక్తిని (Energy) కోల్పోకుండా మనల్ని కాపాడుతుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved