Wednesday Remedies: బుధవారం రోజున ఈ పనులు చేస్తే డబ్బుకు లోటు ఉండదు..!
Wednesday Remedies: మీరు మీ కెరీర్ లేదా ఆర్థికపరంగా సమస్యలను ఎదుర్కొంటుంటే, బుధవారం రోజున గణేశుడిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని పనులు కచ్చితంగా చేయాలి. ఆ పనులు చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు పరిష్కారమౌతాయి. మీ చేతికి డబ్బు కూడా అందుతుంది.

Lord Ganesh
హిందూమతంలో...ఒక్కో రోజుని ఒక్కో దేవతకు కేటాయించారు. శుక్రవారం లక్ష్మీదేవి, శనివారం వెంకటేశ్వర స్వామికి ఎలా అయితే పూజలు చేస్తారో... బుధవారం గణేశుడికి కేటాయించారు. గణపయ్యను పూజించడానికి బుధవారం అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున ఆయనకు పూజ చేయడం లేదా ఉపవాసం ఉండటం వల్ల కెరీర్ వృద్ధికి, డబ్బుకు సంబంధించిన సమస్యలను తగ్గించవచ్చు. అంతేకాదు... బుధవారం రోజున కొన్ని రకాల పనులు చేయడం వల్ల బుధ గ్రహం బలపడటమే కాకుండా.. జీవితంలో సానుకూల ఫలితాలు వస్తాయి. మరి, ఏ పనులు చేయాలో ఇప్పుడు చూద్దాం....
1.శంఖం ఊదడం...
ఏదైనా ముఖ్యమైన పని చేసే ముందు, బుధవారం ఉదయం శంఖాన్ని ఊదడం శుభప్రదంగా పరిగణిస్తారు. దీని వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీ విజయానికి మార్గం ఏర్పడుతుంది. ఆర్థిక సమస్యలు కూడా తగ్గిపోతాయి.
2.తులసి పూజ...
బుధవారం, తెల్లవారుజామున లేచి, స్నానం చేసి, మనల్ని మనం శుద్ధి చేసుకున్న తర్వాత పవిత్రమైన తులసి మొక్కను పూజించాలి. తులసి మొక్కకు నీరు అర్పించి, దాని దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. బుధవారం పవిత్రమైన తులసి మొక్కను పూజించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయని నమ్ముతారు.
వీటిని దానం చేయండి...
బుధవారం, గణేశుడి రోజున, పేదలు, నిస్సహాయులకు సహాయం చేయడానికి మనం మన వంతు కృషి చేయాలి. మనం బియ్యం, ఆకుపచ్చ దుస్తులు వారికి అవసరమైన వస్తువులను దానం చేయాలి. బుధవారం ఈ పనులు చేయడం ద్వారా, మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఆర్థిక సమస్యలు కూడా పరిష్కారమవుతాయని నమ్ముతారు.
వీటిని ఆవులకు ఇవ్వండి.
బుధవారం, మనం ఆవులకు తినడానికి ఆకుపచ్చ గడ్డి లేదా మేత ఇవ్వాలి. వీటిని ఆవులకు ఇవ్వడం చాలా శుభప్రదం. బుధవారం ఆవులకు సంబంధించిన ఈ పని చేయడం వల్ల ఆర్థిక అడ్డంకులు తొలగిపోతాయి, సంపద , శ్రేయస్సు పెరుగుతుంది.
గణేశుడిని పూజించండి...
బుధవారం నాడు మనం స్వచ్ఛమైన మనస్సుతో గణపతి పూజ చేయాలి. ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి, గణేశుడికి దూర్వా, పసుపు పువ్వు, మోదకం సమర్పించండి. బుధవారం నాడు ఈ పనులు చేస్తే, అన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీరు ఆర్థిక శ్రేయస్సు పొందుతారు.