Navaratri 2025: నవరాత్రుల్లో ఉల్లి, వెల్లుల్లి తింటే పాపమా? వాటిని ఎందుకు తినకూడదు?
నవరాత్రుల్లో (Navaratri) ఉల్లి, వెల్లుల్లి తినకూడదని అని ఎంతోమంది భావన. ఈ సమయంలో ఉల్లి వెల్లుల్లి ఎందుకు తినకూడదు? వాటిని తినడం పాపమా? ఈ సందేహాలకు ప్రేమానంద్ మహారాజ్ ఏమి సమాధానమిచ్చారో తెలుసుకోండి.

ఉల్లి వెల్లుల్లి తినకూడదా?
నవరాత్రుల కోసం హిందూ భక్తులంతా ఎదురుచూస్తూ ఉంటారు. ఆ తొమ్మిది రోజులు భక్తులు ఉపవాసం ఉంటారు. మాంసం, మద్యం వంటివి ముట్టుకోరు. కొందరు ఉల్లి, వెల్లుల్లిని కూడా తినరు. నవరాత్రుల్లో ఉల్లి, వెల్లుల్లి తినడం పాపంగా భావిస్తారు. అది దుర్గాదేవి పూజకు ఆటంకం కలిగిస్తుందా? అని చాలా మందికి సందేహం ఉంది. ఆ సందేహానికి సమాధానాలు తెలుసుకోండి.
ప్రేమానంద్ మహారాజ్ ఏమి చెప్పారు?
ప్రేమానంద్ మహారాజ్ చెబుతున్న ప్రకారం, ఋషులు, సాధువులు ఉల్లి, వెల్లుల్లి తినకూడదు. ఎందుకంటే అవి జపం, తపస్సు, ఆధ్యాత్మిక సాధనకు ఆటంకం కలిగిస్తాయి. ఇది పాపం కాకపోయినా, సాధకులు వీటిని తినకపోవడమే మంచిది.
ఉల్లి వెల్లుల్లి ఎందుకు తినకూడదు
భక్తి, ఉపవాసం ముఖ్య ఉద్దేశం మానసిక శాంతిని కలిగించడం, ఆధ్యాత్మికత, ఆ దుర్గా దేవి ఆశీస్సులు పొందడం వంటివి. ఉల్లి, వెల్లుల్లిని ఆధ్యాత్మిక సాధనకు ఆటంకాలుగా భావిస్తారు. ఎందుకంటే అవి సోమరితనం, ప్రతికూల శక్తిని పెంచుతాయి. ఇది జపం, తపస్సు, ధ్యానం సమయంలో ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. అందుకే సాధకులు వీటిని తినకూడదని అంటారు.
పాపం కాదు కానీ...
ఉల్లి, వెల్లుల్లి తినడం పాపం కాదు. అవి కూడా ఇతర కూరగాయల్లాంటివే. కానీ ఆధ్యాత్మిక సాధన, ఉపవాస సమయంలో వాటిని తినకపోవడమే మంచిది. ఇది భక్తులు తమ పూజ, భజన, ధ్యానం, ఉపవాసాన్ని పూర్తి శుద్ధితో, ఏకాగ్రతతో చేయడానికి వీలు కల్పిస్తుంది. దీనివల్ల దుర్గాదేవి ఆశీస్సులు ఎక్కువగా పొందవచ్చు.