అమ్మాయిల పళ్ల వరస ఇలా ఉంటే...కచ్చితంగా ధనవంతులు అవుతారు..!
అమ్మాయిల దంతాల వరస ఆధారంగా మన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. కొన్ని రకాల దంతాల వరస ఉన్న అమ్మాయిలకు డబ్బు కొరత ఎప్పటికీ రాదు.

Personality
జోతిష్యశాస్త్రం, న్యూమరాలజీ ప్రకారం.. మనం పుట్టిన తేదీ, సమయం ఆధారంగా మన భవిష్యత్తు ఎలా తెలుసుకోవచ్చో.. మన శరీర భాగాల ఆధారంగా కూడా మన వ్యక్తిత్వం తెలుసుకోవచ్చట. అదేవిధంగా సాముద్రిక శాస్త్రం ప్రకారం.. మన దంతాల నిర్మాణం గురించి కూడా చాలా విషయాలు తెలియజేస్తోంది. ముఖ్యంగా అమ్మాయిల దంతాల వరస ఆధారంగా మన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. కొన్ని రకాల దంతాల వరస ఉన్న అమ్మాయిలకు డబ్బు కొరత ఎప్పటికీ రాదు. వివాహం తర్వాత భర్త, అత్త మామలకు కూడా అష్ట ఐశ్వర్యాలు మోసుకొచ్చే అవకాశం ఉందట.మరి, దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా...
దంతాల మధ్యలో సందులు ఉంటే....
జోతిష్యశాస్త్రాన్ని నమ్మితే, దంతాల మధ్య సందులు ఉన్న అమ్మాయిలు పుట్టుకతోనే ధనవంతులు అవుతారట. వారి జీవితం ఎప్పుడూ సంపదతో నిండి ఉంటుంది. ఈ అమ్మాయిలు వివాహానికి ముందు, తరువాత సంపదకు తలుపులు తెరుస్తారు. వారి అత్తవారిల్లు కూడా ఎప్పుడూ డబ్బుతో నిండి ఉంటుంది.ఈ అమ్మాయిలు సంపద, ఆస్తి పరంగా ఎప్పుడూ అదృష్టవంతులే, ఎందుకంటే.. వీరిని పూర్వీకుల ఆస్తి కూడా వరిస్తుంది. దీని కారణంగా వారు తమ జీవితాన్ని సులభంగా గడుపుతారు. వారి జీవితంలో డబ్బుకు సంబంధించిన దాదాపు ఎటువంటి సమస్యలు రావు. చేతిలో ఎప్పుడూ డబ్బు ఎప్పుడూ ఉంటుంది కాబట్టి.. సహజంగానే ఎక్కువగా ఖర్చు చేస్తారు. కాబట్టి, వీరు కొన్నిసార్లు అవసరం కంటే ఎక్కువగా ఖర్చు చేస్తారు.
చదునైన దంతాలు ఉంటే...
సాముద్రిక శాస్త్రం ప్రకారం, చదునుగా, నిటారుగా దంతాలు ఉన్న అమ్మాయిలు కూడా ధనవంతులు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అమ్మాయిలు ఎల్లప్పుడూ ఇతరుల కన్నా భిన్నంగా ఏదైనా చేసే అలవాటు కలిగి ఉంటారు. విజయం సాధించాలనే కోరిక వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. వారికి డబ్బు కొరత ఎప్పుడూ రాదు. వీరు ప్రతి విషయంలోనూ తాము ముందు ఉండాలని కోరుకుంటారు. వారి అభిరుచులను నెరవేర్చుకోవాలని కోరుకుంటారు. ఎక్కువ డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తారు. వివాహం తర్వాత వీరి అదృష్టం మరింత పెరుగుతుంది. మంచి ధనవంతులైన జీవిత భాగస్వామి దొరికే అవకాశం ఎక్కువ. అత్తమామలు కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు. ఈ వ్యక్తులు ఉద్యోగం కంటే.. వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందుతారు.
వంకర దంతాలు ఉంటే...
దంతాలు వంకర టింకరగా ఉంటే చాలా మందికి నచ్చదు. కానీ.. ఆ దంతాలే వారికి అదృష్టాన్ని తీసుకువస్తాయి. ముఖ్యంగా వీరి ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ మెరుగ్గానే ఉంటుంది. వీరికి జీవితంలో ఎప్పుడూ డబ్బు కొరత అనేదే ఉండదు. ముఖ్యంగా వివాహం తర్వాత వీరి సంపద బాగా పెరుగుతుంది. అన్ని వైపుల నుంచి డబ్బు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇక పన్ను మీద పన్ను ఉంటే వారికి మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి జీవితంలో డబ్బు విషయంలో అసలు సమస్యలే రావు. వీరి వైవాహిక జీవితం చాలా ఆనందంగా సాగుతుంది.
నవ్వితే చిగుళ్లు కూడా కనపడితే...
నవ్వుతున్నప్పుడు దంతాలతో పాటు చిగుళ్ళు కనిపించే అమ్మాయిలలో మీరు ఒకరు అయితే, ఆ అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. వారి అదృష్టం కారణంగా, వారు ఎల్లప్పుడూ విజయం సాధిస్తారు. దీని కారణంగా, వారి జీవితంలో ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత వీరు ఆర్థికంగా ఎప్పుడూ సమస్యలు ఎదుర్కోరు.
చిన్న దంతాలు ఉంటే...
అమ్మాయిల దంతాలు ఉండాల్సిన వాటి కంటే చిన్నగా ఉంటే.. వారు జీవితంలో ఎప్పుడూ విజయాలు అందుకుంటారు. విజయం వారికి ఎల్లప్పుడూ మంచి ఆర్థిక స్థితిని కొనసాగించడంలో సహాయపడుతుంది. ఈ అమ్మాయిలు తమ జీవితంలో శ్రేయస్సును సృష్టించడానికి సహాయపడే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు.