Garuda Puranam: ఈ తప్పులు చేస్తే... వచ్చే జన్మలో ఎలా పుడతారో తెలుసా?
Garuda Puranam: ఈ జన్మలో మనం తెలీసీ, తెలియక చేసిన తప్పులకు మరణానంతరం ఎలాంటి శిక్షలు అనుభవించాల్సి ఉంటుందో గరుడ పురాణం చెబుతుంది. మంచి మార్గానికి ఎంచుకోవడానికి మనకు ఈ గరుడ పురాణం చాలా బాగా సహాయపడుతుంది.

గరుడ పురాణం...
హిందూ మతంలో గరుడ పురాణానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఈ గరుడ పురాణం ప్రకారం... మనం ఎలా జీవించాలో మాత్రమే కాదు... ఈ జన్మలో మనం తెలీసీ, తెలియక చేసిన తప్పులకు మరణానంతరం ఎలాంటి శిక్షలు అనుభవించాల్సి ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు. మంచి మార్గానికి ఎంచుకోవడానికి మనకు ఈ గరుడ పురాణం చాలా బాగా సహాయపడుతుంది. దీనిలో పేర్కొన్న దాని ప్రకారం.. మనం చేసే తప్పలు కారణంగా మన వచ్చే జన్మ ఆధారపడి ఉంటుందట. ఎలాంటి తప్పులు చేస్తే ఎలాంటి జంతువులా పుడతారో తెలుసుకుందాం...
గుడ్లగూబ...
గరుడ పురాణం ప్రకారం... ఇతరులను మోసం చేయడం మంచి పద్దతి. ఇతరులను మోసం చేయడానికి తన తెలివితేటలను ఉపయోగించే వారు.. వచ్చే జన్మలో గుడ్ల గూబ గా జన్మించే అవకాశం ఉంది. గుబ్ల గూబ జీవితం చీకటి, భ్రమ, అజ్ఞానికి సూచికగా పరిగణిస్తారు. అందుకే, అలా మోసం చేయకూడదని గరుడ పురాణం చెబుతోంది.
కుక్కగా జన్మించడం....
ధర్మాన్ని, వేదాలను, పురాణాలను లేదా దేవుళ్లను అగౌరవపరిచే వారు వారి తదుపరి జన్మలో కుక్కలుగా పునర్జన్మ పొందుతారని గరుడ పురాణం ప్రముఖంగా పేర్కొంది. ధర్మాన్ని , దేవతలను అవమానించే వ్యక్తి ఆత్మ వారి తదుపరి జన్మలో కుక్కగా పునర్జన్మ పొందుతారు. చాలా కష్టాలను ఎదుర్కుంటారు.
రాబందు...
గరుడ పురాణం ప్రకారం, నిజమైన స్నేహితుడిని మోసం చేసే వ్యక్తి తన తదుపరి జన్మలో రాబందుగా పునర్జన్మ పొందుతాడు. రాబందు జననం అంటే చనిపోయిన జీవుల మాంసాన్ని తినే జీవితం, ఇది మన తదుపరి జన్మలో ద్రోహం, దుష్ట కార్యాలకు పరమాత్మ మనకు ఇచ్చే కఠినమైన శిక్ష.
పాములు, బల్లులు..
గరుడ ప్రకారం స్త్రీలను చిన్నచూపు చూసే లేదా అవమానించే పురుషులు పాములు లేదా బల్లుల వలె సరీసృపాలుగా పునర్జన్మ పొందుతారు. నీచత్వం, కామంలో మునిగిపోయే వారికి ఇది శిక్ష. అందుకే.. ఇలాంటి తప్పులు చేయకూడదని గరుడ పురాణం చెబుతుంది.
మేక...
గరుడ ప్రకారం ప్రతి ఒక్కరూ తమ మాటలతో లేదా దుర్భాషను ఉపయోగించడం ద్వారా ఇతరులను బాధపెట్టకుండా ఉండాలి. ఇతరులను దుర్భాషలాడే లేదా అవమానించే వారు వారి తదుపరి జన్మలో మేకలుగా పునర్జన్మ పొందుతారు. దుర్భాషలాడే భాషను ఉపయోగించే వ్యక్తి .. తదుపరి జన్మలో మేకగా పుట్టే అవకాశం ఉంటుంది.