Garuda Puranam: చనిపోయిన వాళ్ల బంగారం మనం వేసుకుంటే ఏమౌతుంది?
గరుడ పురాణంలో.. చనిపోయిన వారు ఉపయోగించిన బంగారం, వెండి వంటి విలువైన వస్తువుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే విషయాన్ని చాలా క్లియర్ గా పేర్కొన్నారు.

Garuda purana
భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు చనిపోతారన్నది జగమెరిగిన సత్యం. అయితే.. మన ఇంట్లో ఎవరైనా కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు.. వారి కి సంబంధించిన విలువైన వస్తువులను దాచుకుంటూ ఉంటాం. అదే ముఖ్యంగా బంగారం అయితే..కచ్చితంగా దాచుకుంటారు. కొందరు వాటిని గుర్తుకు దాచుకుంటే, మరి కొందరు.. వాటిని తాము ధరిస్తూ ఉంటారు. అయితే.. ఇలా చనిపోయిన వారి వస్తువులను వాడే విషయంలో చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. నిజంగా, చనిపోయిన వారి బంగారం మనం దాచుకోవడం, వేసుకోవడం మంచిదేనా? గరుడ పురాణం దీని గురించి ఏం చెబుతుందో తెలుసుకుందామా..
Gold
గరుడ పురాణం.. హిందూ పురాణాల్లో చాలా ప్రాధాన్యత ఉన్న శాస్త్రం. దీనిలో మానవ జీవితానికి సంబంధించిన చాలా విషయాలను ప్రస్తావించారు. ముఖ్యంగా మనిషి పుట్టుక, చావు, మరణం తర్వాత జీవితం ఇలా అన్ని విషయాలను అందులో ప్రస్తావించారు. ఇక, ఈ గరుడ పురాణంలో.. చనిపోయిన వారు ఉపయోగించిన బంగారం, వెండి వంటి విలువైన వస్తువుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే విషయాన్ని చాలా క్లియర్ గా పేర్కొన్నారు.
శుద్ధి చేయకుండా బంగారం ధరించడం..
బంగారం సూర్యుడికి సంబంధించి ఉన్న లోహం. సూర్యుడు మన ఆరోగ్యం, ప్రతిష్ట, అధికార స్థానం, ప్రభుత్వ అనుకూలతలకు కారణమవుతాడు. చనిపోయిన వ్యక్తి ధరించిన బంగారాన్ని మరొకరు శుద్ధి లేకుండా వాడితే, సూర్యుని శక్తి బలహీనపడే అవకాశముంటుంది. దీని ప్రభావం వ్యక్తిగత ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం, వ్యాపారంపై ప్రతికూలంగా కనిపించవచ్చు. ముఖ్యంగా జాతకంలో సూర్యుడి స్థానం ఇప్పటికే బలహీనంగా ఉంటే, ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది.
శుద్ధి చేయకుండా వాడితే..
పురాణాల ప్రకారం కూడా, మరణించిన వారు వాడిన వస్తువులను తిరిగి ఉపయోగించడం వల్ల వారి ఆత్మ శాంతి పొందకపోవచ్చు. గరుడ పురాణం ప్రకారం, వారు ఉపయోగించిన వస్తువులు వాడటం వల్ల ఆత్మ ఇంటి చుట్టూ తిరుగుతూ, మోక్షానికి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది పితృ దోషానికి దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది.అయితే, ఆ ఆభరణాలను వినియోగించాలనుకుంటే, శుద్ధి చేయడం తప్పనిసరి.
బంగారం ఎలా శుద్ధి చేయాలి?
బంగారాన్ని శుద్ధి చేసే విధానం : ఆ ఆభరణాన్ని గంగాజలంలో 24 గంటలు నానబెట్టి, తర్వాత పసుపుదారంతో కట్టి 21 రోజులు పక్కన ఉంచాలి. ఆ తరువాత మాత్రమే దానిని ధరించవచ్చు. లేదంటే, ఆ బంగారాన్ని కరిగించి కొత్త డిజైన్‌లో మార్చించుకుని వాడవచ్చు. ఇదే విధంగా వెండి వస్తువులకు కూడా ఇది వర్తిస్తుంది.
కాబట్టి, పెద్దలు వాడిన బంగారం లేదా ఇతర విలువైన వస్తువులను తిరిగి ఉపయోగించాలంటే జాగ్రత్తగా, శాస్త్రోక్తంగా శుద్ధి చేసి మాత్రమే వాడాలి. లేకపోతే, గుర్తుగా ఒకచోట భద్రంగా ఉంచుకోవడం ఉత్తమం.