MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • Spiritual: ఆడవాళ్లు శుక్రవారం ఈ పనులు చేస్తే.. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే కొలువై ఉంటుంది!

Spiritual: ఆడవాళ్లు శుక్రవారం ఈ పనులు చేస్తే.. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే కొలువై ఉంటుంది!

 Spiritual: శుక్రవారం రోజు ఆడవాళ్లు చేసే కొన్ని పనులు మహాలక్ష్మి అనుగ్రహానికి కారణం అవుతాయి మహాలక్ష్మి సంతృప్తి చెందితే ఆ ఇల్లు సౌభాగ్యాలతో కళకళలాడుతుంది అయితే ఇంటి ఇల్లాలు శుక్రవారం పూట ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.
 

Navya G | Updated : Oct 02 2023, 11:27 AM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

ఇంటి ఇల్లాలు పొద్దున్నే లేచి పాచిగుమ్మాలని తుడిచి ఇంటిని సుచిగా చేసుకోవాలి. తర్వాత అమ్మవారికి తప్పనిసరిగా పాయసం గాని  పరమాన్నం గానీ నైవేద్యంగా సమర్పించాలి. మహావిష్ణువు పాదాల దగ్గర కూర్చొని ఉండే లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
 

25
Asianet Image

 అలాగే అశోక పత్రాలని తోరణంగా చేసి ఇంటి ముఖద్వారానికి కట్టడం వలన దుష్టశక్తుల ప్రభావం, ప్రతికూలతలు తొలగిపోతాయి. ఎర్రని పట్టు వస్త్రంలో చుట్టి లాకర్లో భద్రపరిస్తే భవిష్యత్తులో డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉండవట. గులాబీ సువాసన కలిగిన అగరవత్తులు మహాలక్ష్మికి మహా ప్రీతి.
 

35
Asianet Image

కాబట్టి దేవుడి గదిని ఆ సువాసనలతో ఉండేలా చూసుకోండి. అలాగే లక్ష్మీదేవికి మల్లెపూలతో పూజించటం శ్రేష్టం. అలాగే శుక్రవారం రోజు తామర పువ్వులతో లక్ష్మీదేవిని పూజించడం వలన ధన కటాక్షం లభిస్తుంది. లక్ష్మీదేవికి సువాసనలతో కూడిన పూజలు ఇష్టపడుతుంది అందుకే మంచి గంధాన్ని పూజలో ఎక్కువగా ఉపయోగించండి.

45
Asianet Image

అలాగే అష్ట  రకాల నూనెతో కర్పూరంతో దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజించటం వలన అమ్మవారి మనసు చల్లబడి  ఆమె పూర్తి అనుగ్రహాం మనకి అందిస్తుంది. అలాగే శుక్రవారం నాడు ఇంట్లో ఐశ్వర్యం కలగాలంటే లక్ష్మీదేవిని రెండు మొహాల నెయ్యి దీపం వెలిగించి పూజించాలి ఇలా చేయడం వలన డబ్బు ఆదా అవుతుంది.
 

55
Asianet Image

అలాగే శుక్రవారం నాడు ఆ ఇంటి ఇల్లాలు ఏడవటం, జుత్తు విరబూచుకొని తిరగటం అలాగే అప్పు చేయటం కానీ అప్పు ఇవ్వటం కానీ  చేయకూడదు. అలాగే ఆరోజు లలితా సహస్రం, విష్ణు సహస్రం వంటి పారాయణలు చేయటం వలన అమ్మవారి కరుణకు పాత్రులు అవుతారు.

Navya G
About the Author
Navya G
ఆధ్యాత్మిక విషయాలు
 
Recommended Stories
Top Stories