MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Spiritual
  • Lord Shiva: పశుపతి లింగం మాయమైతే కలియుగం అంతమైనట్టేనా? ఆ లింగం ఎక్కడుందో తెలుసా?

Lord Shiva: పశుపతి లింగం మాయమైతే కలియుగం అంతమైనట్టేనా? ఆ లింగం ఎక్కడుందో తెలుసా?

Lord Shiva: కలియుగం అంతమైపోతుందని ఎప్పటి నుంచో ఎన్నో రకాల కథలు, వార్తలు ప్రచారంలో ఉన్నాయి కదా. అలాంటి ఓ ఆసక్తికర విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే పశుపతినాథ్ దేవాలయంలో శివలింగం నీట మునుగుతుందో కలియుగం అంతం అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ పశుపతినాథ్ ఆలయం గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా? 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Apr 01 2025, 06:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

భారతదేశంలోనే కాకుండా నేపాల్ లో కూడా శివుడిని విశేషంగా పూజిస్తారు. ఇండియాలో దేశవ్యాప్తంగా ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అంటే 12 చోట్లు శివుడి ఆత్మలింగం ఉద్భవించిందన్న మాట. మరి నేపాల్ లో శివుడికి సంబంధించిన విశేషాలు ఏమున్నాయో ఇప్పడు తెలుసుకుందాం. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

నేపాల్ రాజధాని కాఠ్మాండూలో పశుపతినాథ్ గుడి ఉంది. కలియుగం అంతానికి ఈ ఆలయానికి సంబంధం ఉందని స్థల పురాణాలు, స్థానికుల మాటల ద్వారా తెలుస్తుంది. పశుపతినాథ్ ఆలయంలో శివ లింగం కాకుండా శివుని ముఖ రూపాన్ని మనం చూడొచ్చు. 

శివుడి అనుగ్రహం పొందాలంటే కేదార్‌నాథ్ క్షేత్రాన్ని దర్శించాలని పండితులు చెబుతారు. అయితే కేదారనాథ్ తో పాటు పశుపతినాథ్ ఆలయాన్ని కూడా దర్శనం చేసుకోవాలని అంటారు. ఎందుకంటే పశుపతినాథ్ శివుని శక్తి కేంద్రం అని నేపాల్ వాసులు బాగా నమ్ముతారు. 

35

మరి కలియుగం అంతానికి, పశుపతినాథ్ ఆలయానికి ఉన్న సంబంధం ఏంటి? భూమి మీద హింస, దోపిడీ, అన్యాయం పెరిగిపోతోంది. ఇదంతా కలియుగం అంతానికి సూచన అని పండితులు చెబుతుంటారు. కలియుగం చివరి దశకు చేరుకున్నప్పుడు పశుపతినాథ్ గుడిలోని శివలింగం పక్కనే ఉన్న బాగమతి నదిలో మునుగుతుందట. ఇది జరిగితే యుగం మారిపోతుందని నేపాల్ వాసులు గట్టిగా నమ్ముతారు.


 

45

పశుపతినాథుని లింగాకారమే ఈ భూమికి రక్ష అని, ఆ లింగం బాగమతి నది నీటిలో మునిగిపోతే కలియుగం అంతమైనట్టేనని స్థల పురాణం చెబుతుంది. పశుపతినాథ్ గుడిలో శివుడు ఉన్నంతవరకు కలియుగపు చెడు శక్తులు భూమిని ఏమీ చేయలేవు. పశుపతినాథుడు అక్కడి నుంచి కదిలితే భూమికి అంతమేనని చెబుతారు. 

ఇది కూడా చదవండి మీ ఇంటి గుమ్మాలు ఇలా ఉంటే ఎంత అదృష్టమో.. దేనికీ తిరుగుండదు!

55

పశుపతినాథ్ లో శివుడు ఎలా వెలిశాడంటే..

పశుపతినాథ్ లో శివలింగం ఉద్భవించిన ఘటనపై ఎన్నో కథలు ఉన్నాయి. ఒకసారి శివుడు జింక రూపంలో బాగమతి నది ఒడ్డున విహరిస్తుండగా దేవతలు వచ్చి కైలాసానికి రావాలని పిలిచారట. ప్రార్థన చేసిన అనంతరం జింకను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తూ పొరపాటున దాని కొమ్ముని పట్టుకొన్నారు. దీంతో అది విరిగి అక్కడే శివలింగంగా మారిపోయిందట. శతాబ్ధాల తరువాత ఒకనాడు ఒక ఆవు ఇక్కడ శివలింగంపై పాలు కురిపిస్తుంటే పశువుల కాపరి చూసి ప్రజలకు ఈ విషయం చెప్పగా, ఆలయం కట్టి పూజలు చేయడం ప్రారంభించారు. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
భారత దేశం
ప్రపంచం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Recommended image2
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image3
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved