MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Spiritual
  • వినాయక మండపం పెట్టాలంటే ఏం రూల్స్ పాటించాలి? పోలీసు అనుమతి కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

వినాయక మండపం పెట్టాలంటే ఏం రూల్స్ పాటించాలి? పోలీసు అనుమతి కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

వినాయక చవితి మండపం ఏర్పాటు చేసి సందడిగా పండుగ చేయాలనుకున్న కమిటీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇప్పటి వరకు వినాయక చవితి మండపం ఏర్పాటు చేయాలంటే చాాలా డిపార్ట్ మెంట్ అధికారుల నుంచి పర్మీషన్ తీసుకోవాల్సి వచ్చేది. ఒక అధికారి అందుబాటులో ఉంటే, మరో డిపార్ట్ మెంట్ అధికారి దొరికేవారు కాదు. వారి చుట్టూ తిరిగి అందరి అనుమతులు పొందడం ఎంతో కష్టంగా ఉండేది. అలాంటి ఇబ్బందులు తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగల్ విండో సిస్టమ్ ను తీసుకొచ్చింది. అందులో ఎలాంటి సదుపాయాలు కల్పించారో ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Naga Surya Phani Kumar
| Updated : Sep 01 2024, 02:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సింగిల్ విండో క్లియరెన్స్ ఇలా..
వినాయక మండపం ఏర్పాటు చేసే ప్రజల కోసం ప్రత్యేకంగా ఒక సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఇంతకు ముందు వినాయక మండపం ఏర్పాటు చేయాలంటే అగ్నిమాపక శాఖ, పురపాలక శాఖ, విద్యుత్ శాఖ, పోలీసు శాఖల నుంచి నిరభ్యంతర (NOC) సర్టిఫికేట్ తీసుకోవాల్సి వచ్చేది. దీనికోసం ప్రజలు ఆయా శాఖల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఆ ఇబ్బందులు తొలగిస్తూ ప్రజల వెసులుబాటు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సింగిల్ విండో క్లియరెన్స్ విధానం తీసుకొచ్చింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

వాట్సాప్ లోనే వివరాలన్నీ..
వినాయక మండపం ఏర్పాటు చేయాలనుకుంటే ప్రజలు 79950 95800 మొబైల్ నంబర్ కు Hi  అని WhatsApp చేస్తే చాలు. నిరభ్యంతర పత్రం (NOC) పొందడానికి ఏమేం చేయాలో ఆ ప్రక్రియ మొత్తం WhatsApp ద్వారా మొబైల్ ఫోన్ కు వస్తుంది. మన వాట్సాప్‌కు వచ్చిన https://ganeshutsav.net/ లింక్‌ను క్లిక్ చేయాలి. 

36

ఆన్ లైన్ లోనే NOC సర్టిఫికేట్..
https://ganeshutsav.net/ లింక్‌ను క్లిక్ చేశాక... ganeshutsav అనే వెబ్‌ సైట్‌ ఓపెన్‌ అవుతుంది.

అక్కడ New Application (న్యూ అప్లికేషన్‌)పై క్లిక్‌ చేయాలి.

NOC కోసం దరఖాస్తు చేస్తున్న అప్లికెంట్‌ ఫోన్‌ నంబర్‌ నమోదు చేయాలి.

ఆ నంబరుకు ఓటీపీ వస్తుంది.

దాన్ని ఎంటర్‌ చేసిన తర్వాత గణేష్ మండపం ఏర్పాటు చేయదలచిన కమిటీ సభ్యుల వివరాలు నమోదు చేయాలి.

అంతేకాకుండా మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, ఏ పోలీసు స్టేషన్ పరిధి లోకి వస్తుంది అనే వివరాలు ఇవ్వాలి.

తరువాత విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు, విగ్రహ ప్రతిష్ఠ ఏ రోజు జరుగుతుంది? నిమజ్జనం ఎక్కడ చేస్తారు? ఏ సమయంలో చేస్తారు? ఏ వాహనం ద్వారా నిమజ్జనం చేస్తారు..? వంటి వివరాలను నమోదు చేసి ఆన్‌లైన్‌ లోనే దరఖాస్తు చేసుకోవాలి.

46

SHO పోలీసే కీలకం..
ఇలా ఆన్‌లైన్‌ లోనే చేసిన దరఖాస్తు సంబంధిత పోలీసు స్టేషన్ ఎస్. హెచ్.ఓ(SHO) వద్దకు వెళ్తుంది. అనంతరం ఎస్.హెచ్.ఓ (SHO) ఆధ్వర్యంలో పురపాలక శాఖ, అగ్ని మాపక శాఖ, విద్యుత్ శాఖలకు చెందిన సిబ్బంది ఒక బృందంగా ఏర్పడి మండపం ఏర్పాటు చేసే ప్రదేశాన్ని చూడటానికి వస్తారు. అన్ని విషయాలు పరిశీలించి సానుకూలంగా ఉంటే QR కోడ్ తో కూడిన నిరభ్యంతర పత్రం జారీ చేస్తారు. అనుమతి పొందడానికి అవసరం అయిన రుసుము వివరాలు తెలియచేస్తారు. కమిటీ సభ్యులు వారికి దగ్గరలో ఉన్న మీసేవ కేంద్రంలో ఆ డబ్బు చెల్లించి రసీదు తీసుకోవాలి. ఆ రసీదును మళ్లీ వెబ్ సైట్‌లో అప్లోడ్ చేయాలి. అప్పడు ఎస్. హెచ్.ఓ (SHO) వాటిని పరిశీలించి వెంటనే నిరభ్యంతర(NOC) పత్రాన్ని జారీ చేస్తారు.
 

56

మండపం నిర్వహణలో నిబంధనలు..
రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి కార్యక్రమాలూ నిర్వహించకూడదని పోలీసు శాఖాధికారులు తెలిపారు. హుండీలు, విలువైన వస్తువులు ఉన్న చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బలవంతంగా చందాలు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గణపతి మండపాల దగ్గర ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే సౌండ్ బాక్సులు ఉపయోగించాలన్నారు. గణపతి విగ్రహాలను రహదారులపై ఏర్పాటు చేయకూడదని కచ్చితంగా చెప్పారు. ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగేలా బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టకూడదని సూచించారు.
 

66

తరచూ పోలీసుల చెకింగ్..
ఈ నిరభ్యంతర పత్రాన్ని ప్రింట్ తీసి గణేష్ మండపంలో ఉంచాలి. కొందరు మండపాల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు చేస్తుంటారు. అలాంటివి జరగకుండా పోలీసులు తనిఖీలు చేస్తుంటారు. అలాంటి సమయంలో ఈ పత్రాన్ని చూపించాల్సి ఉంటుంది. పోలీసులు NOCపై ఉన్న QR కోడ్ ని స్కాన్ చేసి తనిఖీ చేస్తారు.
 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved