ఏ గుడికి ఏ వేళలో వెళ్లి పూజ చేయాలో తెలుసా?
సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం తరచూ ఆలయాలకు వెళ్లి మనం స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల కాస్త మనశ్శాంతిగా ఉంటుందని భావించి ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం సమీప ఆలయానికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకొని వస్తాము. అయితే స్వామివారి దర్శనం చేసుకోవడానికి కూడా సరైన సమయం పాటించడం తప్పనిసరి అని తెలుస్తోంది.కొన్ని ఆలయాలకు కొన్ని సమయాలలో మాత్రమే వెళ్లి దర్శనం చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందవచ్చని పండితులు చెబుతున్నారు మరి ఏ గుడికి ఏ సమయంలో వెళ్ళి పూజ చేయాలో తెలుసుకుందాం...
ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో ఎంతోమంది భక్తులు భక్తిశ్రద్ధలతో శివకేశవుల ఆలయాలను సందర్శిస్తూ పూజలు చేస్తుంటారు. అయితే ఈ పరమ పవిత్రమైన కార్తీకమాసంలో శ్రీహరిని పరమేశ్వరుడిని దర్శించడానికి సరైన సమయం పాటించాలని తెలుస్తోంది. ముఖ్యంగా శ్రీహరిని పూజించడానికి అనువైన సమయం ఉదయం అని చెప్పాలి.ఉదయం శ్రీ మహావిష్ణువు ఆలయాన్ని సందర్శించి స్వామివారి దర్శనం చేసుకోవడం ఎంతో మంచిది.
శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు ఆయన ప్రతిరోజు మన జీవన పోరాటంలో వచ్చే ఆపదలను తొలగించి మన బుద్ధి ద్వారా ఆపదలను సమస్యలను తొలగించి మనం సుఖసంతోషాలతో ప్రశాంతమైన జీవితాన్ని గడిపేలా చేస్తారు.అందుకే శ్రీమహావిష్ణువుకి ఎప్పుడు వెళ్లిన ఉదయం వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకోవడం ఎంతో మంచిది. ఇక పరమేశ్వరుడి ఆలయాన్ని మాత్రం సంధ్య సమయంలో దర్శనం చేసుకోవడం శుభప్రదం.
పరమేశ్వరుడు లయకారకుడు ఈయనని సంధ్య సమయంలో పూజ చేసుకోవడం ఎంతో మంచిది.ఈ విధంగా రోజు పూర్తి అవుతున్న సమయంలో పరమేశ్వరుడిని పూజించుకోవడం వల్ల మనకు రెట్టింపు ఫలితాలు ఉంటాయని చెప్పాలి. అందుకే ఉదయం మహావిష్ణువు సాయంత్రం పరమేశ్వరుడిని దర్శించుకోవడం వల్ల శుభం కలుగుతుంది.ఇకపోతే మనం ఏ ఆలయానికి వెళ్ళిన తొందరగా స్వామివారి దర్శనం చేసుకోవాలనే నియమ నిబంధనలను అతిక్రమించి స్వామివారిని దర్శనం చేసుకోకూడదు.
ఎంతో ప్రశాంతమైన మనసుతో ఆలయంలోకి ప్రవేశించి మంచి పాజిటివ్ ఆలోచనలతో స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉండటమే కాకుండా మనం కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పాలి.ఇక ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో భక్తులందరూ పెద్ద ఎత్తున శివ కేశవులు ఆలయాలను సందర్శిస్తూ పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.