Pitru paksha: పితృపక్షంలో ఎవరైనా మరణిస్తే ఏమౌతుంది?
పితృపక్షంలో పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధం, తర్పణం, దానధర్మాలు చేయాలని చెబుతారు.

పితృపక్షం
హిందూ ధర్మంలో పితృపక్షం (శ్రాద్ధ పక్షం) చాలా ముఖ్యమైనది. ఈ సంవత్సరం పితృపక్షం సెప్టెంబర్ 7, 2025 నుండి సెప్టెంబర్ 21 వరకు ఉంటుంది. ఈ సమయంలో పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధం, తర్పణం, దానధర్మాలు చేయాలని చెబుతారు. అయితే చాలా మందికి ఉన్న సందేహం ఏంటి అంటే.. ఈ పితృ పక్ష కాలంలో ఎవరైనా చనిపోతే ఏం జరుగుతుంది?
రహస్యాలు నమ్మకాలు
పితృపక్ష కాలంలో చనిపోవడానికి.. సాధారణ మరణానికి భిన్నంగా చూస్తారు. దీని వెనుక ఒక లోతైన రహస్యం ఉంది. పితృపక్షంలో ఎవరైనా చనిపోతే ఆ ఆత్మకు ప్రత్యేక ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. మరి శాస్త్రాలలో చెప్పిన రహస్యాలు, నమ్మకాల గురించి తెలుసుకుందాం.
పితృపక్షం ప్రాముఖ్యత
హిందూ క్యాలెండర్ ప్రకారం, పితృపక్షం (శ్రాద్ధ పక్షం)ని ప్రతి సంవత్సరం భాద్రపద పౌర్ణమి నుండి అశ్విని అమావాస్య వరకు జరుపుకుంటారు. ఈ పదిహేను రోజుల్లో తర్పణం, పిండదానం, శ్రాద్ధం చేయడం ద్వారా పూర్వీకుల ఆత్మకు శాంతి, ఆశీర్వాదం పొందుతారు. పూర్వీకులతో సంబంధం ఏర్పరచుకోవడానికి ఇది ప్రత్యేక సమయం.
పూర్వీకులతో సంబంధం
పితృపక్షంలో మరణించిన తర్వాత, ఆత్మ నేరుగా పితృలోకానికి చేరుకుని పూర్వీకులతో కలిసిపోతుందని నమ్ముతారు. వారికి మోక్షం కూడా చాలా తొందరగా వస్తుందని, పూర్వీకుల ఆశీర్వాదం లభించినట్లుగా భావిస్తారు.
పునర్జన్మలో శుభఫలితాలు
శాస్త్రాల ప్రకారం, పితృపక్షంలో చనిపోయిన వ్యక్తి తన తదుపరి జన్మలో పుణ్యం, శుభ ఫలితాలు పొందుతారని నమ్ముతారు.
గరుడ పురాణంలో ఏముంది?
పితృపక్షంలో ఎవరైనా చనిపోతే, యమలోకంలో తక్కువ కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గరుడ పురాణం, ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి. విష్ణు ధర్మసూత్రం ప్రకారం, పితృపక్షంలో చనిపోయిన వారి ఆత్మ పూర్వీకులతో కలిసి కుటుంబాన్ని రక్షిస్తుంది. అలాంటి ఆత్మలను కుటుంబానికి పితృదేవతలుగా పూజిస్తారనేది నమ్మకం.