MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Spiritual
  • Chanakya Niti: భార్యాభర్తల మధ్య ఈ లక్షణాలు కనిపిస్తే.. విడాకులకు దగ్గర పడినట్లే..!

Chanakya Niti: భార్యాభర్తల మధ్య ఈ లక్షణాలు కనిపిస్తే.. విడాకులకు దగ్గర పడినట్లే..!

Chanakya Niti: చాణక్యుడు మానవ జీవితం గురించి చాలా గొప్పగా వివరించారు. ముఖ్యంగా భార్యాభర్తల బంధం ఎలా ఉండాలి? ఎలా ఉండకపోతే సమస్యలు వస్తాయో కూడా వివరించారు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 23 2026, 02:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Chanakya Niti
Image Credit : AI Meta

Chanakya Niti

ప్రస్తుతం అందరిదీ ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది. భార్యాభర్తలు ఒకరితో మరొకరు సమయం గడపడం కూడా కష్టంగా మారుతోంది. దీని కారణంగా.. వారి బంధం రోజు రోజుకీ బలహీనపడుతోంది. పని ఒత్తిడి, సోషల్ మీడియా వ్యామోహం వల్ల దంపతుల మధ్య దూరం పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చాణక్యుడు చెప్పిన కొన్ని సూత్రాలు ఫాలో అయితే మన జీవితాన్నే మార్చుకోవచ్చు. దంపతుల మధ్య ఎలాంటి లక్షణాలు కనిపిస్తే, వారు తమను తాము మార్చుకోవాలి? ఎలాంటి లక్షణాలు ఒకరినొకరు దూరం కావడానికి కారణం అవుతున్నాయి? వేటిని కచ్చితంగా మార్చుకోవాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
1.మాటలు తగ్గి.. మౌనం పెరగడం..
Image Credit : Getty

1.మాటలు తగ్గి.. మౌనం పెరగడం..

భార్యాభర్తల మధ్య సంభాషణే ఆ బంధానికి ప్రాణం. ఎప్పుడైతే ఇద్దరి మధ్య మనసు విప్పి మాట్లాడుకోవడం తగ్గిపోతుందో, అక్కడ అపార్థాలు పెరగడం మొదలౌతాయి. మొదట చిన్న విషయాలు దాచడం మొదలై, ఆ తర్వాత అది పెద్ద విషయాలదాకా వెళ్తుంది. చివరకు ఎమోషనల్ గా ఒకరికొకరు పూర్తిగా దూరమౌతారు. ఒక ఇంట్లో అపరిచిత వ్యక్తులుగా మిగిలిపోతారు.

2.అకారణంగా కోపం.. చిన్న విషయాలకే పెద్ద గొడవలు..

కారణం లేకుండానే ఇద్దరి మధ్య వివాదాలు రావడం, సరదాగా నవ్వుకొని వదిలేసే విషయాలకే ఇద్దరూ వాదించుకోవడం లేదా.. కోపంతో ఒకరితో మరొకరు మాట్లాడకుండా ఉండటం లాంటివి జరుగుతున్నాయా? అంటే మీ మధ్య ప్రేమ, సహనం తగ్గిపోయిందని అర్థం. ఒకరిపై మరొకరికి అసహనం పెరిగినప్పుడు, ప్రేమ స్థానంలో కోపం వచ్చి చేరుతుంది.

34
3. గౌరవం లేని చోట ప్రేమ నిలవదు..
Image Credit : Getty

3. గౌరవం లేని చోట ప్రేమ నిలవదు..

చాణక్యుడి ప్రకారం.. ప్రేమ లేకపోయినా బంధం నిలపడుతుంది. కానీ, గౌరవం లేని చోట దాంపత్యం నిలవదు. ఒకరిని మరొకరు కించపరుచుకోవడం, ఇతరుల ముందు తక్కువ చేసి మాట్లాడటం బంధాన్ని కూల్చేస్తుంది.

4. క్వాలిటీ టైమ్ లేకపోవడం

ఎంత బిజీగా ఉన్నా భాగస్వామి కోసం కొంత సమయం కేటాయించాలి. కలిసి కూర్చొని కష్టసుఖాలు పంచుకోకపోతే, ఇద్దరి మధ్య 'ఎమోషనల్ డిస్‌కనెక్ట్' ఏర్పడుతుంది. ఇది క్రమంగా మూడో వ్యక్తి ప్రవేశానికి లేదా ఒంటరితనానికి దారితీస్తుంది.

44
  5. అనుమానం పెనుభూతం
Image Credit : Getty

5. అనుమానం పెనుభూతం

నమ్మకం అనేది పునాది వంటిది. అనుమానాలు మొదలయ్యాయంటే ఆ పునాది కదులుతున్నట్టే. పారదర్శకత లోపించడం, విషయాలను దాచడం వల్ల నమ్మకం దెబ్బతింటుంది. ఒక్కసారి పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించడం అసాధ్యం.

ఈ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి..?

చాణక్యుడి సూచన ప్రకారం, సమస్యను గుర్తించిన వెంటనే దానిపై చర్చించాలి. సహనం, గౌరవం, పారదర్శకత అనే మూడు సూత్రాలను పాటిస్తే ఎలాంటి విచ్ఛిన్నమైన బంధాన్నైనా మళ్ళీ అతికించవచ్చు. చిన్న మార్పులు మీ జీవితంలో పెద్ద సంతోషాన్ని నింపుతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆధ్యాత్మిక విషయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Recommended image2
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image3
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Related Stories
Recommended image1
Vastu Tips: ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఏ దిక్కున పెట్టాలో తెలుసా? ఏ దిక్కున పెడితే లక్ష్మీ కటాక్షం..?
Recommended image2
Vastu Tips: ఇంటి మెయిన్ డోర్ వద్ద ఇవి ఉంటే.. లక్ష్మీదేవి ఇంట్లోకి నడుచుకుంటూ వస్తుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved