Chanakya niti: చాణక్య నీతి ప్రకారం ఈ 3 చేస్తే డబ్బు, గౌరవం పోతుంది..!
చాణక్య నీతి ప్రకారం ఈ 3 తప్పులు అస్సలు చేయకూడదు. వాటి వల్ల డబ్బు, గౌరవం రెండూ పోతాయి. ఆ మూడు తప్పులేంటో ఇక్కడ చూద్దాం.

చాణక్య నీతి జీవితం గురించి చాలా విషయాలు చెబుతుంది. ఏం చేయకూడదు? ఏం చేయాలి లాంటి విషయాలు బోధిస్తుంది. చాలామంది ఇప్పటికీ వీటిని ఫాలో అవుతుంటారు. చాణక్య నీతి ప్రకారం ఈ మూడు తప్పులు అస్సలు చేయకూడదు.
పొరపాటున కూడా చేయకూడని పనులు
సంతోషంగా జీవించడానికి చాణక్య నీతి ఉపయోగపడుతుంది. చాణక్యుడి ప్రకారం పొరపాటున కూడా చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. అవి చేస్తే గౌరవంతో పాటు డబ్బు కూడా పోతుంది.
అప్పు చేయడం
పదే పదే అప్పు చేయడం మిమ్మల్ని పేదవాడిగా చేస్తుంది. అందుకే అప్పు చేయకుండా ఉండాలి. అప్పు మీ పేరు ప్రతిష్టలకు భంగం కలిగిస్తుంది.
పెద్దలను అవమానించడం
తల్లిదండ్రులను, పెద్దలను అవమానించేవాళ్లు డబ్బుతో పాటు గౌరవం కూడా కోల్పోతారు. తల్లిదండ్రులు దేవుడితో సమానం. వాళ్లని అవమానిస్తే మనకు మనుగడే ఉండదు.
అహంకారం
డబ్బు సంపాదించాక అహంకారం పెంచుకోవడం కూడా మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తుంది. అహంకారం పెరిగితే ఏదో ఒకరోజు గౌరవం పోగొట్టుకుని వీధిన పడాల్సి వస్తుందని చాణక్యుడి బోధనల్లో పేర్కొనబడింది.