Holi 2025: ఈసారి హోలి పండుగ ఎప్పుడు? అసలు హోలి ఎందుకు జరుపుకుంటారు?
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా హోలి పండుగ జరుపుకుంటారు. మరి ఈ ఏడాది హోలి పండుగ ఎప్పుడు వచ్చింది. హోలికా దహన్ ఏ టైంలో జరుపుకోవాలి ఇతర విషయాలు మీకోసం. చూసేయండి.

హోలి రంగుల పండుగ. హోలి రోజున చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రజలందరూ సరదాగా గడుపుతారు. సంతోషంగా రంగులు చల్లుకుంటారు. ఫాల్గుణ మాసం శుక్లపక్ష పౌర్ణమి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. మరి ఈ ఏడాది హోలి పండుగ ఎప్పుడు వచ్చింది? హోలికా దహన్ కి శుభ సమయం ఏంటి ఇతర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
హోలీకా దహన్ కి సమయం
హోలికా దహన్ ఒక పవిత్రమైన వేడుక. ఈ ఏడాది ఫాల్గుణ మాసం పౌర్ణమి తిథి మార్చి13 ఉదయం 10:30 గంటలకి ప్రారంభమై.. 14 మార్చ్ మధ్యాహ్నం 12 గంటలకు ముగుస్తుంది.
13 మార్చి రాత్రి 11:26 నుంచి 12:30 గంటల వరకు హోలికా దహన్ కి శుభ సమయంగా చెప్పుకోవచ్చు.
హోలీ పండుగ ఎప్పుడు?
ఈ ఏడాది హోలి పండుగ మార్చి 14 శుక్రవారం వచ్చింది. హోలికా దహనం తర్వాత రోజు ప్రజలు ఈ పండుగను జరుపుకుంటారు. హోలీ పండుగ నాడు దేశవ్యాప్తంగా ప్రజలందరూ సంతోషంగా రంగులు జల్లుకుంటారు. వారి జీవితం కూడా రంగులమయంగా మారాలని ఆ దేవున్ని ప్రార్థిస్తారు.
హోలీ పండుగను ఎందుకు జరుపుకుంటారు?
పురణాల ప్రకారం రాక్షస రాజు హిరణ్యకశపుని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తి భక్తుడు. హిరణ్యకశపుడుకి అది ఎంతమాత్రం ఇష్టంలేదు. అప్పుడు అతను తన కొడుకుని చంపాలనుకుంటాడు. చాలా ప్రయత్నాలు చేస్తాడు. అయితే ప్రతీసారి దేవుడు ప్రహ్లాదున్ని రక్షిస్తూ ఉంటాడు. ఇలా చెడుపై మంచి ఎప్పుడూ గెలుస్తుందని చాటిచెప్పేదే హోలి. మరోవైపు రాధా, కృష్ణుల ప్రేమకు గుర్తుగా కూడా ఈ పండుగను జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి.