ఫస్ట్ నైట్ రోజు పాలు ఎందుకు తాగాలి?
ఫస్ట్ నైట్ రోజు అమ్మాయి చేతికి పాల గ్లాసు ఇచ్చి పడకగదికి పంపే ఆచారం ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తోంది. అసలు ఆ రోజు పాలెందుకు తాగుతారో తెలుసా?
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఎంతో ప్రత్యేకమైంది. ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో.. పెళ్లికి ఎన్నో ఆచారాలను, సంప్రదాయాలను పాటిస్తారు. పెళ్లిలోనే కాదు.. పెళ్లి తర్వాత జరిగే ఫస్ట్ నైట్ కు కూడా కొన్ని ఆచారాలను పాటిస్తారు. వాటిలో ఒకటి ఫస్ట్ నైట్ పాల గ్లాసు.
మొదటి రాత్రి నాడు వధువును పాల గ్లాసుతో పడకగదిలోకి పంపుతారు. ఆ తర్వాత ఇద్దరు చెరో సగం తాగుతారు. దీన్ని ఎక్కువగా సినిమాల్లోనే చూస్తారు. నిజానికి నిజ జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంది. పెళ్లైన వారికి ఈ అనుభవం పక్కాగా ఉంటుంది. పెళ్లైన వారిని ఎవ్వరినైనా అడిగితే ఈ విషయం ఖచ్చితంగా చెప్తారు. అసలు ఈ రోజు పాలను ఎందుకు తాగుతారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కుంకుమపువ్వు పాలు
మొదటి రాత్రి భార్యాభర్తలు పంచుకునే పాలలో చిటికెడు కుంకుమపువ్వును కూడా వేస్తారు. చాలా మంది ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు. అయితే ఇది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు.. కుంకుమ పువ్వు పాలు ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి.
మంచి వైవాహిక జీవితం
మొదటి రాత్రి రెండు శరీరాల కలయిక ఇద్దరిని మరింత దగ్గర చేస్తుంది. ఇది ఇద్దరి మధ్య మంచి అనుబంధాన్ని ఏర్పరుస్తుంది. ఫస్ట్ నైట్ తో ఇద్దరి మధ్య బంధం మొదలవుతుంది. ఈ బంధాన్ని తీపిగా చేయడానికి కుంకుమపువ్వును పాలలో కలుపుతారు.
పాలు ఎందుకు?
ఫస్ట్ నైట్ రోజు పాలను పంచుకోవడం వల్ల వధూవరులు తమ తమ అనుభవాలు, ఆలోచనలు, అనుభూతులను ఒకరితో ఒకరు పంచుకుంటారని పెద్దలు చెబుతుంటారు. అంతేకాకుండా పాలను స్వచ్ఛమైన ఆహారంగా, చాలా పవిత్రంగా భావిస్తారు. పాలను హిందూ ఆచారాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అందుకే మొదటి రాత్రి కూడా పాలను కూడా ఇస్తారు. కుంకుమపువ్వును పాలలో కలిపితే పాలు మంచి రంగు, రుచి వస్తాయి.
కామసూత్ర
కామసూత్ర కూడా మొదటి రాత్రి ఖచ్చితంగా పాలను తాగాలని సూచిస్తుంది. తేనె, పంచదార, పసుపు, మిరియాల పొడి, కుంకుమపువ్వును పాలలో కలిపి తాగాలి. కుంకుమపువ్వుతో తాగడం వల్ల లిబిడో, ఎనర్జీ పెరుగుతుందని కామసూత్ర పేర్కొంది.