MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Relationship
  • మీ భార్యతో ఇలా మాత్రం మాట్లాడకండి.. లేదంటే గొడవలొస్తాయ్

మీ భార్యతో ఇలా మాత్రం మాట్లాడకండి.. లేదంటే గొడవలొస్తాయ్

Relationship: వైవాహిక జీవితం సాఫీగా సాగాలని ప్రతి భార్యాభర్త కోరుకుంటారు. దీనికోసం ఇద్దరూ ప్రయత్నిస్తారు. అయితే భర్త భార్య ముందు కొన్ని విషయాలను మాట్లాడితే ఇద్దరి మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది. ఇది సంబంధాన్ని విడదీయొచ్చు కూడా.

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Oct 08 2025, 12:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
భార్యతో ఏం మాట్లాడకూడదు?
Image Credit : freepik

భార్యతో ఏం మాట్లాడకూడదు?

భార్యాభర్తలన్నాకా గొడవలు, కొట్లాటలు చాలా కామన్. అలాగని ఎప్పుడూ కొట్లాటలే కాకుండా.. అలకలు, ప్రేమ, కేరింగ్ అంటివి కూడా భార్యా భర్తల మధ్య ఖచ్చితంగా ఉంటాయి. వైవాహిక జీవితం ఆనందంగా ముందుకు సాగాలంటే ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ ఉండాలి. 

అలాగే భార్య లేదా భర్త ముందు ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదో కూడా తెలిసి ఉండాలి. అప్పుడే లైఫ్ ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకు సాగుతుంది. అయితే భార్య ముందు భర్త కొన్ని మాట్లాడకూడని విషయాలు ఉన్నాయి. అవి మాట్లాడితే ఇద్దరి మధ్య కొట్లాటలు జరిగి విడిపోయే ప్రమాదం ఉంది. కనుక భార్య ముందు భర్త ఏం మాట్లాడకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పోల్చడం
Image Credit : freepik

పోల్చడం

భర్త చేసే మొదటి తప్పు ఇదే. ఈ ఇలాంటి మాటను భార్యతో ఏ భర్తా అనకూడదు. భార్యను తల్లితో లేదా చెల్లి, అక్కతో పోల్చితే అగ్నికి ఆజ్యం పోసినట్టే అవుతుంది. ఎందుకంటే ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే విధంగా ఉండరో.. అలాగే ఒకే విధంగా ఆలోచించరు. ప్రతి వ్యక్తి ప్రత్యేకంగానే ఉంటాడు. కాబట్టి ఏ విషయంలో అయినా పోల్చకండి. తప్పు ఏదైనా ఉంటే నేరుగా వారితోనే చెప్పేయండి. ఇలా మీరు పోల్చడం వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు జరగడమే కాకుండా.. మీరు వారిపై కూడా ద్వేషం, కోపం కలుగుతాయి.

36
  నీకు అస్సలు అర్థం కాదు
Image Credit : chatgpt

నీకు అస్సలు అర్థం కాదు

‘నీకేమీ అర్థం కాదు, చెప్తే వినవు’ అనే మాటలు కూడా భార్యతో అనకండి. ఎందుకంటే ఇది వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు అవుతుంది. ఇలా అనేముందు మీరిద్దరూ భార్యాభర్తలు కాబట్టి ఒకే టీమ్ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. భార్యాభర్తలన్నాకా కలిసి పనిచేయాలి. ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలి. అలాగే తక్కువ చేసి మాట్లాడుకోకూడదు. దీనివల్ల మీ మధ్య గొడవలు జరుగుతాయి. దూరం పెరుగుతుంది. ప్రేమ తగ్గుతుంది.

46
ఏ భార్యా ఇంత ఖర్చు చేయదు
Image Credit : freepik

ఏ భార్యా ఇంత ఖర్చు చేయదు

‘ఇంత ఖర్చు చేశావ్, అంత ఖర్చు చేశావ్, ఏ భార్యా నీలా ఇంత ఖర్చు చేయదు’అనే మాటలు మీ భార్యతో అనే ప్రయత్నం చేయకండి. ఇలా మీరు ఖర్చుల గురించి మాట్లాడితే ఆమె తనను మీరు నమ్మడం లేదని అనిపిస్తుంది. డబ్బుల విషయంలో బహిరంగంగానే మాట్లాడటం చాలా ముఖ్యం.

 ప్రతి ఖర్చును లిమిట్ చేయడం మంచిది కాదు. ఖర్చును తగ్గించుకోమని ఫోర్స్ చేస్తే ఇబ్బందులు వస్తాయి. ఖర్చులు ఇద్దరం తగ్గించుకుందామని కూర్చొని మాట్లాడండి. మీరు ఖర్చు పెడితూ ఆమెకు ఆంక్షలు పట్టడం సరైంది కాదు. కలిసి బడ్జెట్ గురించి ఆలోచిస్తే డబ్బును ఆదా చేసిన వారు అవుతారు.

56
ఆ వ్యక్తి భార్య ఎంత ఫిట్ గా ఉందో చూడు
Image Credit : freepik

ఆ వ్యక్తి భార్య ఎంత ఫిట్ గా ఉందో చూడు

 మీ భార్యను వేరేవారితో  పోల్చడమంటే మీ సంబంధాన్ని మీ చేతులారా నాశనం చేసుకున్నట్టే అవుతుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తికి తనదైన శారీరక రూపం ఉంటుంది. అందరూ ఒకేలా ఉండరు. ఇలా మీరు అవమానిస్తే వారు మీకు దూరమవుతారు. మీ బంధం బాగుండాలంటే మాత్రం మీ భార్య ఎలా ఉందో అలాగే అంగీకరించండి. వేరే వారితో పోల్చే ప్రయత్నం చేయకండి.

66
నిన్ను పెళ్లిచేసుకోకముందే నేను సంతోషంగా ఉన్నాను
Image Credit : pinterest

నిన్ను పెళ్లిచేసుకోకముందే నేను సంతోషంగా ఉన్నాను

ఫ్రెండ్ షిప్ అయినా, పెళ్లి జీవితమైనా ఒకే ఒక్క రీజన్ తో క్షణకాలంలో ముగిసిపోతుంది. అందుకే కొన్ని మాటలను అస్సలు అనకూడదు. ఏ భర్త అయినా సరే భార్యతో ‘నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందే నేను హ్యాపీగా ఉన్నానని’ అస్సలు అనకండి. దీనివల్ల మీ భార్య ఎంతో బాధపడుతుంది.

 గతాన్ని వదిలేసి ప్రస్తుతం గురించి ఆలోచించండి. ఏదైనా సమస్య ఉంటే కలిసి పరిష్కరించుకోండి. అప్పుడే మీ జీవితంలో ఆనందం వస్తుంది. రిలేషన్ షిప్ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఒకరినొకరు గౌరవించుకోవాలి. ప్రేమించుకోవాలి. ఇద్దరి మధ్య అవగాహన ఉండాలి. ముఖ్యంగా అవతలి వ్యక్తిని బాధపెట్టే మాటలను అస్సలు మాట్లాడకూడదు. ఇది మీ సంబంధాన్ని నాశనం చేస్తుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
బంధుత్వం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Related Stories
Recommended image1
ఇందుకే రోజూ కప్పు పెరుగును తినాలంటారు
Recommended image2
Relationship Tips: చిన్న విషయానికే మీ భర్తతో గొడవా..? మీరు చేయాల్సింది ఇదే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved