దాంపత్య జీవితం బోర్ కొట్టకూడదంటే.. ఈ మార్పులు తప్పనిసరి..!
ఏ రిలేషన్ సరిగా ఉండాలన్నా కమ్యూనికేషన్ ముఖ్యమైన విషయం గుర్తించాలి. దంపతులకు ఇది చాలా అవసరం. విషయం ఏదైనా... దంపతులు మాట్లాడుకోవడం చాలా అవసరం. కమ్యూనికేషన్ లేకపోతే.. వారి బంధానికి చీలికలు వచ్చే అవకాశం ఉంది.
happy couple life
వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని అందరూ కోరుకుంటారు. అయితే.. వివాహానికి అపారమైన బలం, కృషి, అవగాహన, నమ్మకం చాలా అవసరం. ఇవి లేకుండా.. దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుందని చెప్పలేం. అయితే... దీని కోసం మనం కనీస ప్రయత్నం చేయాలి. చాలా మంది పెళ్లైన కొంత కాలానికే.. తమకు బోర్ కొట్టేసిందని చెబుతుంటారు. కానీ.. అలా బోర్ కొట్టకుండా ఉండేందుకు.. దంపతులు తమ వంతు ప్రయత్నం చేయాలి. అందుకోసం కొన్ని అలవాట్లను అలవరుచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి వివాహ బంధం సజావుగా సాగేందుకు దంపతులు ఏం చేయాలో... నిపుణులు ఏం చెబుతున్నారో ఓసారి చూద్దాం...
దాంపత్య బంధం సజావుగా సాగేందుకు దంపతుల మధ్య కమ్యూనికేష్ చాలా అవసరం. ఏ రిలేషన్ సరిగా ఉండాలన్నా కమ్యూనికేషన్ ముఖ్యమైన విషయం గుర్తించాలి. దంపతులకు ఇది చాలా అవసరం. విషయం ఏదైనా... దంపతులు మాట్లాడుకోవడం చాలా అవసరం. కమ్యూనికేషన్ లేకపోతే.. వారి బంధానికి చీలికలు వచ్చే అవకాశం ఉంది.
మీరు మీ జీవిత భాగస్వామితో సమయం గడుపుతున్నప్పుడు మీ అన్ని ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను వదిలివేయండి. మీ ఫోన్‌లు మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని వెచ్చిస్తున్నప్పుడు ఫోన్ లు ఆ సమయాన్ని తినేస్తాయి. కాబట్టి.. ముందు వాటికి దూరంగా ఉండాలి. దీనిని అలవాటు చేసుకోవడం వల్ల బంధం బలపడుతుంది.
రోజుకో ముద్దు దంపతుల మధ్య దూరాన్ని, ఒత్తిడిని దూరం చేస్తుంది. దాంపత్య జీవితంలో సాన్నిహిత్యం ఉండాలి అంటే.. కనీసం ఒక్కసారైనా దంపతులు ముద్దు పెట్టుకోవాలట. ఇది దాంపత్య బంధాన్ని బలంగా మారుస్తుంది.
దంపతులు.. ఒకరి అభిప్రాయాలకు మరొకరు గౌరవించాలి. వీలైనప్పుడల్లా మీ భాగస్వామి అభిప్రాయాన్ని అడగండి. ఇది వారికి విలువనిస్తుంది. మీరు వారి అభిప్రాయాన్ని పట్టించుకుంటున్నందుకు వారు కూడా సంతోషిస్తారు. ఇలా చేయడం వల్ల మీరిద్దరూ ఒకరి అభిప్రాయాల గురించి మరొకరు శ్రద్ధ వహిస్తారని నిర్ధారిస్తుంది-ఇది సంబంధానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన భాగాలలో ఒకటి.
బయట వారికి మాత్రమే థ్యాంక్స్ చెప్పాలనే రూల్ లేదు. మీరు మీ భాగస్వామి పట్ల కృతజ్ఞత తో ఉండాలి. ఇది దాంపత్య బంధాన్ని బలపరుస్తుంది. రోజుకి ఒక్కసారైనా ఐలవ్ యూ కూడా చెప్పడం అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా.. శృంగారానికి మధ్య ఎక్కువ గ్యాప్ రాకుండా చూసుకోవాలి.