విడాకులు తీసుకునే సమయంలో... ఈ విషయాలు ఆలోచించండి..!
విడాకులు తీసుకునే ముందు.. ఆ సమయంలో.. దంపతులు కచ్చితంగా కొన్ని విషయాలు ఆలోచించాలట. మరి ఆ విషయాలేంటో ఓసారి చూద్దాం..
ఈ మధ్యకాలంలో చాలా మంది దంపతులు చిన్న చిన్న మనస్పర్థలు రాగానే... వెంటనే విడాకుల బాట పడుతున్నారు. అయితే.. విడాకులు తీసుకునే ముందు.. ఆ సమయంలో.. దంపతులు కచ్చితంగా కొన్ని విషయాలు ఆలోచించాలట. మరి ఆ విషయాలేంటో ఓసారి చూద్దాం..
1.మీరు, మీ జీవిత భాగస్వామి కలిసి ఉన్నప్పుడు... ఏదైనా ప్రాపర్టీ కొన్నట్లయితే... విడాకుల తర్వాత.. దానిని ఎలా సమానంగా పంచుకోవాలి అనే విషయం గురించి ముందుగానే ఆలోచించుకోవాలి. అది అమ్మేయడమా.. లేదంటే.. ఒకరు తీసుకోవడమా..? ఆ ప్రాపర్టీని ఏం చేయాలి అనే విషయాన్ని ముందుగానే నిర్ణయం తీసుకోవాలి. విడాకుల తర్వాత ఎవరి జీవితాలు వారివి అయిపోతాయి కాబట్టి.. ఆ తర్వాత.. ఉమ్మడి ఆస్తి ఉండటం మంచిది కాదు.
2.చాలా మంది దంపతులు.. జాయింట్ బ్యాంక్ అకౌంట్స్ తీసుకుంటూ ఉంటారు. అలాంటివారు.. విడిపోయే సమయంలో.. ముందుగా.. తమ బ్యాంక్ ఎకౌంట్ ని సెపరేట్ చేసుకోవాలి. లేదంటే.. తర్వాత ఇబ్బందులు వస్తాయి. ఎవరి అకౌంట్లను వారు సపరేట్ చేసుకోవాలి.
3.అన్నింటిని కన్నా ముఖ్యమైనది ఇది. విడిపోయే దంపతులకు పిల్లలు లేకపోతే పర్వాలేదు. కానీ... పిల్లలు ఉన్నవారు మాత్రం విడాకులు తీసుకునే ముందు చాలా విషయాలు ఆలోచించుకోవాలి. పిల్లలను ఎవరి కస్టడీకి ఇవ్వాలి.. ముఖ్యంగా 12ఏళ్ల లోపు పిల్లలను ఎవరి దగ్గర ఉంచాలి అనే విషయాన్ని బాగా ఆలోచించుకోవాలి.
divorce
4.ఇక... చాలా మంది విడిపోయిన తర్వాత భర్తల దగ్గర నుంచి భరణం ఆశిస్తూ ఉంటారు. ఈ విషయంలో కూడా దంపతులు ముందుగా నే మాట్లాడుకోవాలి. ఎంత భరణం ఇవ్వాలి..? విడిపోయిన తర్వాత బాధ్యతలు ఎవరు పంచుకోవాలి అనే విషయం గురించి ఆలోచించిన తర్వాతే... ముందుకు అడుగు వేయాలి.
5.ఇక చాలా మంది కలిసి ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిల్లో జాయింట్ ఇన్వెస్ట్ మెంట్స్ చేస్తూ ఉంటారు. ఇవి కూడా విడాకులకు ముందు... ఎకౌంట్స్ సెపరేట్ చేసుకోవాలి.
6.విడాకుల తర్వాత... ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ముందుగా ఓ లీగల్ ప్రోసీడింగ్స్ కోసం మంచి లాయర్ ని కలవడం ఉత్తమం. మ్యూచువల్ గా మాట్లాడుకొని విడాకులు తీసుకోవాలి.
7.విడాకుల తర్వాత.. మీ ప్రాముఖ్యతలు ఏంటో ముందుగా ఆలోచించుకోవాలి. పిల్లలు, తల్లిదండ్రులు.. ఈ విడాకులు తీసుకోవడం వల్ల.. పిల్లలు ఎలా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అనే విషయాలను ఆలోచించుకోవాలి.