- Home
- Life
- Relationship
- Relationship Tips: భార్యాభర్తలు మూడో వ్యక్తికి ఈ విషయాలు మాత్రం చెప్పకూడదు, చెబితే జరిగేది ఇదే..!
Relationship Tips: భార్యాభర్తలు మూడో వ్యక్తికి ఈ విషయాలు మాత్రం చెప్పకూడదు, చెబితే జరిగేది ఇదే..!
Relationship Tips: ఒకప్పుడు.. భార్యభర్తలు తమకు సంబంధించిన విషయాలను తొందరగా ఎవరితోనూ పంచుకునేవారు కాదు. కానీ... ఈ జనరేషన్ వారు అలా కాదు. తమ దాంపత్య జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని బహిరంగం చేస్తున్నారు.

Relationship
పెళ్లి ఎందుకు చేసుకుంటారు..? జీవితాంతం ఒకరితో మరొకరు కలిసి జీవించాలని, ఒకరికి మరొకరు తోడుగా నిలవాలి అనుకునే ఈ బంధంలోకి అడుగుపెడతారు. కానీ.. ఈ రోజుల్లో చాలా మంది ఎక్కువ కాలం కలిసి ఉండటం లేదు. పెళ్లైన సంవత్సరం, రెండు సంవత్సరాలకే విడాకుల బాట పడుతున్నారు. ఇలా విడాకులు తీసుకోవడానికి ఈ కాలం అబ్బాయి, అమ్మయిల ఆలోచనలు మారడమే. ఒకప్పుడు.. భార్యభర్తలు తమకు సంబంధించిన విషయాలను తొందరగా ఎవరితోనూ పంచుకునేవారు కాదు. కానీ... ఈ జనరేషన్ వారు అలా కాదు. తమ దాంపత్య జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని బహిరంగం చేస్తున్నారు. ఏ విషయంలోనూ గోప్యత ఉంచడం లేదు. తమకు సంబంధించిన చిన్న, పెద్ద ప్రతి విషయాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులకు షేర్ చేసుకుంటూనే ఉన్నారు. దీని వల్ల తమ భార్యభర్తల మధ్య సమస్యలు వస్తాయి అనే చిన్న మ్యాటర్ కూడా తెలుసుకోలేకపోతున్నారు. అందుకే... వారి బంధం సరిగా ఉండాలి అంటే.. కొన్ని విషయాలను చాలా సీక్రెట్ గా ఉంచాలి. కేవలం తల్లిదండ్రులతో కూడా షేర్ చేసుకోకూడని విషయాలు కొన్ని ఉన్నాయి. మరి, అవేంటో చూద్దాం....
గొడవలు, వ్యక్తిగత విభేదాలు...
భార్యభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, వాదనలు, విభేదాలు రావడం చాలా సహజం. ఆ సమస్యలను మీకు మీరే పరిష్కరించుకోవాలి. మీ విషయాలను పేరెంట్స్, స్నేహితులు, పక్కింటి వారితో చెప్పడం మంచిది కాదు. ఎందుకంటే.. వారు ఇచ్చే సలహాలు మీకు ఉపయోగపడతాయి అనే గ్యారెంటీ లేదు. పైగా మీ మధ్య గొడవలు మరింత పెరగడానికి కారణం కావచ్చు. అందుకే... ఇతరులతో అస్సలు పంచుకోకూడదు.
ప్రైవేట్ విషయాలు...
భార్యభర్తల సాన్నిహిత్యానికి సంబంధించిన విషయాలను చాలా మంది పబ్లిక్ గా చెప్పేస్తూ ఉంటారు. కానీ.. అవి మీ ప్రైవేట్ విషయాలు అని తెలుసుకోవాలి. వాటిని మీ భాగస్వామితో మాత్రమే చర్చించాలి. ఇతరులతో పంచుకోవడం కరెక్ట్ కాదు. ఏదైనా సమస్య ఉన్నా.. మీరే స్వయంగా మీ పార్ట్నర్ తో చర్చించాలి.
మీ జీవిత భాగస్వామి లో లోపాలు, అలవాట్లు...
ప్రతి ఒక్కరికీ కొన్ని లోపాలు ఉంటాయి. కానీ మీరు మీ భాగస్వామి లోపాలను స్నేహితులు లేదా బంధువులకు పదే పదే ఎత్తి చూపితే, అది మీ సంబంధం ప్రతిష్టను దెబ్బతీస్తుంది. ఇది మీ భాగస్వామిని దెబ్బతీస్తుంది. సంబంధంలో చీలిక వచ్చే అవకాశాలను పెంచుతుంది.
మీ భాగస్వామి కుటుంబానికి సంబంధించిన విషయాలు...
ఒకరి కుటుంబానికి, మరొకరు గౌరవం ఇస్తూ, సపోర్ట్ గా నిలిచినప్పుడే.. వారి బంధం బలపడుతుంది. మీ భాగస్వామి కుటుంబం గురించి వ్యక్తిగత వివరాలు లేదా లోపాలను పంచుకోవడం మీ సంబంధాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది.
ఆర్థిక పరిస్థితి, డబ్బు విషయాలు
డబ్బు విషయాలు చాలా వ్యక్తిగతమైనవి. మీ జీతం, పొదుపులు లేదా రుణాలు వంటి సమాచారాన్ని మీ ఇద్దరి మధ్యే ఉంచుకోవాలి. వాటిని ఇతరులతో పంచుకోవడం తీర్పుకు దారితీస్తుంది. మీ సంబంధంపై అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి డబ్బు విషయాలను వీలైనంత ప్రైవేట్‌గా ఉంచండి.
దాంపత్య జీవితాన్ని బలంగా మార్చుకోవాలంటే ఏం చేయాలి?
సమస్యలను ఇతరులతో కాకుండా మీ భాగస్వామితో నేరుగా చర్చించండి.
సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలను పంచుకోవడం మానుకోండి.
గోప్యత, నమ్మకం , అవగాహన కాపాడుకుంటేనే సంబంధం విజయవంతం అవుతుంది. కాబట్టి, మీ సంబంధానికి సంబంధించిన వివరాలను ఎప్పుడూ అందరితో పంచుకోకండి. లేకపోతే, చిన్న సమస్యలు కూడా పెద్ద చీలికకు కారణమవుతాయి.