ఇలాంటి అబ్బాయిలే అమ్మాయిలకు ఇష్టం..!
ప్రతి అమ్మాయికి కొన్ని కోరికలు ఉంటాయి. కాబోయే వాడు ఇలా ఉండాలి, అలా ఉండాలని ఎన్నో అనుకుంటారు. అలాంటి అబ్బాయి గనకు కనిపిస్తే వెంటనే వారితో లవ్ లో పడిపోతారు. అసలు అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలను ఇష్టపడతారో తెలుసా?
అమ్మాయిలు తనకు కాబోయే భర్త తమకు నచ్చినట్టుగా ఉండాలని కోరుకుంటారు. మీకు తెలుసా? ప్రతి అమ్మాయి పెళ్లి చేసుకోబోయే వాడిలో కొన్ని లక్షణాలు ఖచ్చితంగా ఉండాలనుకుంటుంది. వారు కోరుకున్నట్టుగా భాగస్వామి దొరికితే మాత్రం వారి ఆనందానికి అవదులు ఉండవేమో. ప్రేమించే అబ్బాయి అయినా.. పెళ్లి చేసుకునే అబ్బాయి అయినా.. వారిలో కొన్ని క్వాలిటీస్ ఖచ్చితంగా ఉండాలంటారు అమ్మాయిలు. అసలు అమ్మాయిలు ఎలాంటి లక్షణాలున్న అబ్బాయిలను ఇష్టపడతారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ధైర్యంగా మాట్లాడటం
మనసులోని మాటను ధైర్యంగా చెప్పే అబ్బాయిలనే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు. మాట్లాడటానికి సంకోచించని వారికి మనసులో ఒకటి పెట్టుకుని, బయటికి ఒకటి మాట్లాడరని నమ్ముతారు. భార్యాభర్తలిద్దరికీ ఒకరిపట్ల మరొకరికి చెడు ఉద్దేశాలు లేకపోతే వారి బంధం బలంగా ఉంటుంది.
అర్థం చేసుకోవడం
ఆడవాళ్లు తమ మనసులో ఉండే మాటలను చెప్పకుండానే అర్థం చేసుకునే భర్త దొరకాలని కోరకుంటారు. ఇలాంటి భాగస్వామి గనుక దొరికితే అమ్మాయిలు అస్సలు వదులుకోరు. సంతోషకరమైన సంబంధానికి ఇది చాలా ముఖ్యం. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవడం ముఖ్యం. ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య గ్యాప్ ఉండదు. లేదా మీ మనస్సులోకి చెడు ఆలోచనలు రావు.
తమను తాము మార్చుకోవడం
ఆడవాళ్లు తమ భాగస్వామి తమను ఎలా చూడాలనుకుంటున్నారనేది బాగా గమనిస్తారు. తరచుగా తమను తాము మార్చుకునే మగవారిని ఆడవాళ్లు ఎప్పటికీ ఇష్టపడరు. కొంతమంది ఆడవారు ఎవరి కోసమో తమను తాము మార్చుకోవడానికి ఇష్టపడరు. అందుకే నువ్వు ఇలా మారాలి? అలా మారాలి అని కండీషన్స్ పెట్టే మగవారంటే ఆడవాళ్లకు ఇష్టం ఉండదు.
ఒకరినొకరు గౌరవించుకోవడం
ఆడవాళ్లు రెస్పెక్ట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కారు. తమ ఆత్మగౌరవానికి భంగం కలిగితే మాత్రం ప్రేమను వదులుకోవడానికి కూడా వెనుకాడరు. అందుకే పొరపాటున కూడా ఆడవాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకండి.
నమ్మకం
ఆడవాళ్లు తమ భర్తలను మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు. ఎంతో నమ్మకం పెట్టుకుంటారు. స్వచ్ఛమైన హృదయంతో ప్రేమిస్తారనే ఆశ తప్ప వారికి ఇంకేమీ ఉండదు. రిలేషన్ షిప్ లో ఎలాంటి నమ్మక ద్రోహాన్ని కూడా వారు సహించలేరు. అందుకే వారి నమ్మకాన్ని నిలబెట్టుకోండి.