మీరు టాక్సిక్ రిలేషన్ షిప్ లో ఉన్నారా? ఇలా తెలుసుకోండి.
ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మానిప్యూలేట్ చేస్తూ.. మీ నిర్ణయం మార్చే ప్రయత్నం చేస్తున్నారంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే.
1. ఎవరి జీవితానికి సంబంధించి నిర్ణయాలు వారు తీసుకోవాలి. అలా కాకుండా... మీకు సంబంధించిన ప్రతి విషయంలో నిర్ణయం మీ పార్ట్ నర్ తీసుకుంటూ... మీ ఇష్టానికి విలువ ఇవ్వడం ఇవ్వకపోవడం.. కనీసం మీకు ఏం కావాలో తెలుసుకోవాలని కూడా అనుకోవడం లేకపోవడం, మిమ్మల్ని ప్రతి నిమిషం కంట్రోల్ చేయాలని చూడటం, ఆఖరికి మీరు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో కూడా వారే డిసైడ్ చేస్తున్నారంటే.. మీరు టాక్సిక్ రిలేషన్ లో ఉన్నారని అర్థం.
2.మనిషి జీవితంలో ఏదైనా సాధించాలన్నా...దానికి వయసుతో సంబంధం లేదు. సాధించాలనే కృషి, పట్టుదల సరిపోతుంది. మీలో ఆ కృషి ఉన్నా.. మీ భాగస్వామి మీకు ప్రతి విషయంలో అడ్డుగా నిలుస్తున్నారు అంటే... మీరు టాక్సిక్ రిలేషన్ లో ఉన్నారని.. మీ ఎదుగుదలకు మీ పార్ట్ నర్ కారణమౌతున్నారని అర్థం.
3.మనం తీసుకునే నిర్ణయాలను.. మన పార్ట్ నర్ మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది చాలా కామన్ గా జరిగే విషయమే. కానీ.... అలా కాకుండా... ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మానిప్యూలేట్ చేస్తూ.. మీ నిర్ణయం మార్చే ప్రయత్నం చేస్తున్నారంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే.
4.శృంగార జీవితం సరిగా లేకపోయినా ఆలోచించాల్సిందే. వారికి కావాలనిపించినప్పుడు ఒకలా.... మీరు కోరుకున్నప్పుడు మరోలా ప్రవర్తించడం చేస్తున్నారంటే కూడా మీ బంధం సరిగాలేదనే అర్థం.
ఏ బంధం సరిగా ఉండాలన్నా.... వారి మధ్య గౌరవం ఉండాలి. ఒకరికి మరొకరు గౌరవం ఇస్తేనే ఆ బంధం నిలపడుతుంది. అలా కాకుండా... మీకు అందరి ముందూ గౌరవం ఇవ్వకపోవడం, మీ నిర్ణయాలను పట్టించుకోకపోవడం లాంటివి చేస్తున్నారంటే... ఆ బంధం గురించి కూడా ఆలోచించాల్సిందే.
6. మీ పార్ట్ నర్ మిమ్మల్ని తరచూ దూషించడం, అందరి ముందు కించపరచడం, మిమ్మల్ని బానిసలా చూస్తున్నారంటే కూడా.. మీ బంధం సరిగా లేదని అర్థం చేసుకోవాలి.
7.దంపతులు అన్నాక.. ఏదో విషయంలో కాంప్రమైజ్ అవ్వడం చాలా కామన్. కానీ అలా కాకుండా... ప్రతి విషయంలోనూ మీరే కాంప్రమైజ్ అవ్వాల్సి రావడం, వారు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కావడం లేదుంటే కూడా మీరు టాక్సిక్ రిలేషన్ లో ఉన్నారని అర్థం.
8.మీ మనసులోని విషయాన్ని మీ భాగస్వామితో చెప్పుకోగల ఫ్రీడమ్ ఉండాలి. అలా కాకుండా... వారితో మాట్లాడాలన్నా... ఏదైనా విషయం చెప్పాలన్నా భయపడుతున్నారు అంటే... మీ బంధం సరిగా లేదని అర్థం చేసుకోవాలి.