మీ ఫ్రెండ్ షిప్ కాస్త.. లవ్ గా మారితే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రేమ ఎప్పుడు, ఎవరిపై కలుగుతుందో చెప్పలేం. కానీ కొన్నిసార్లు స్నేహితుడితో కూడా ప్రేమలో పడొచ్చు. మంచి స్నేహితుడిని భాగస్వామిగా చేసుకోవడమంత మంచి విషయం మరొకటి ఉండదంటారు కొందరు. మీ స్నేహం కాస్త ప్రేమగా మారితే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
love
లవ్.. ఫ్రెండ్ షిప్ తోనే మొదలవుతుందని చాలా మంది చెప్తుంటారు. నిజమే చాలా జంటల విషయంలో ఇలాగే జరుగుతుంది. కొన్నికొన్ని సార్లు మీ ఫ్రెండ్ ను స్నేహితుడికి భిన్నంగా భావిస్తారు. వారిని చూసిన వెంటనే మీకు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. అలాగే మునపటిలా వారితో మసలలేరు. అసలు ఫ్రెండ్ పై లవ్ పుడితే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇతర స్నేహితుల పట్ల అసూయ
స్నేహితులు ఎవ్వరైనా కానీయండి.. అంటే ఆడైనా, మగైనా స్నేహితుల పట్ల అస్సలు అసూయ ఉండదు. కానీ మీరు అసూయ పడితే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే. మీకు ఇష్టమైన స్నేహితుడు, మీ ఫ్రెండ్ తో ఎక్కువ సేపు మీకు ఇష్టం ఉండదు. అలాగే వారితో ఎక్కువ సేపు మాట్లాడితే మీకు అసూయ కలుగుతుంది. ఇది మీ ఫ్రెండ్ తో మీరు ప్రేమలో పడిపోయారని సూచిస్తుంది.
love
చెప్పేవన్నీ గుర్తుంచుకోవడం
ఇష్టమైన వారు చెప్పిన విషయాలను అస్సలు మర్చిపోరు. ఎందుకంటే వారంటే మీకు ఎంతో ఇష్టం కాబట్టి. ఇష్టమైన మాటలను మర్చిపోయే ఛాన్సే ఉండదు. అయితే మీరు ప్రేమలో పడ్డ మీ ఫ్రెండ్ చెప్పేదంతా మీకు గుర్తుంటే లేదా మీరు చెప్పేదంతా వారు గుర్తుంచుకుంటే.. మీరు ప్రేమలో పడ్డారని అర్థం వస్తుంది. అంటే వారు మీ మాటను బాగా వింటారు. మీ పట్ల ఎంతో శ్రద్ధ చూపుతారు.
వాళ్ల గురించే ఆలోచన
స్నేహితుల గురించి ఆలోచిస్తాం. అలా అని ఎప్పుడూ వారిగురించే ఆలోచించుకుంటూ కూర్చోరు. కానీ మీరు మీ స్నేహితుడి గురించే ఎప్పుడూ ఆలోచిస్తుంటే.. మీ సంబంధం స్నేహాన్ని మించిపోయిందని అర్థం చేసుకోవాలి. మీ స్నేహితుడి గురించే కలలు కనడం, ఏపని చేస్తున్నా వారి గురించి ఆలోచించడం, మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోనంతగా వారి గురించి ఆలోచించడం ప్రేమకు సంకేతమే మరి.
కలుసుకోవడం గురించి ఆలోచించడం
ఎప్పుడూ మీ ఫ్రెండ్ తోనే ఉండాలనుకోవడం, లేదా వారిని తరచుగా కలవాలనిపించడం కూడా మీరు వారితో ప్రేమలో ఉన్నారని సంకేతం ఇస్తుంది. ఈ భావన కూడా మీరు ప్రేమలో ఉన్నారని సూచిస్తుంది. వారిని కలిసి వెళ్లిపోతుంటే ఒంటరిగా అనిపించడం, ఆందోళన చెందడం కూడా మీరు వారితో ప్రేమలో పడ్డారని సంకేతం ఇస్తుంది.