అవసరం లేకున్నా అబద్ధం చెబుతున్నారా..? కారణం ఇదే అయ్యిండచ్చు..!
కొందరు అవసరం లేకున్నా కూడా అబద్దాలు చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఏం అవసరం వచ్చిందని ఇలాంటి అబద్దం చెప్పారు అని ఎదుటివారికి అనిపింవచ్చు. అసలు అలా అవసరం లేకున్నా అబద్దాలు చెప్పడానికి కూడా కారణాలు ఉంటాయట. మరి ఆ కారాణాలేంటో ఓసారి చూద్దామా..
మనమందరం ఏదో ఒక సమయంలో.. ఏదో ఒక సందర్భంలో అబద్దాలు చెబుతూనే ఉంటాం. అయితే.. సందర్భానుసారం.. ఏదో అవసరం వచ్చినప్పుడు అబద్ధం చెప్పడం.. అప్పటికప్పుడు ప్రమాదం నంచి తప్పించుకోవడం చాలా సహజం. కానీ.. కొందరు అవసరం లేకున్నా కూడా అబద్దాలు చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఏం అవసరం వచ్చిందని ఇలాంటి అబద్దం చెప్పారు అని ఎదుటివారికి అనిపింవచ్చు. అసలు అలా అవసరం లేకున్నా అబద్దాలు చెప్పడానికి కూడా కారణాలు ఉంటాయట. మరి ఆ కారాణాలేంటో ఓసారి చూద్దామా..
ఇక కొందరు అవసరం ఉన్నా లేకున్నా తరచూ అబద్దాలు చెబుతూనే ఉంటారు. ఎందుకంటే.. వారికి ఎదుటివారిని నిరాశపరచడం ఇష్టం ఉండదు. నిజం వల్ల వారు బాధపడుతున్నారని అనిపించినా.. అబద్దం వల్ల ఆనందపడుతున్నారని అనిపించినా.. వారు అబద్దాలనే చెబుతూ ఉంటారు. అంతేకాకుండా.. తమపై ఎదుటివారు పెట్టుకున్న అంచనాలను తలకిందులు చేయడం వారికి నచ్చదు. అందుకోసమైనా వారు అబద్దం చెప్పేస్తుంటారు. తమను ఎదుటివారు చెడ్డగా, తక్కువగా అనుకోవడం ఇష్టంలేక అలాంటి అబద్దాలు చెబుతూ ఉంటారు.
ఇక మరో ముఖ్య కారణం ఏమిటంటే.. ఎవరైనా అబద్ధాలు చెబితే, వారికి అబద్ధం చెప్పడం ముఖ్యం. మనకు చూసేవారికి ఇంత చిన్నదానికి అబద్దం చెప్పడం అవసరమా అని అనిపించొచ్చు. కానీ.. వారికి అది అవసరమై ఉండొచ్చు. లేదంటే.. అతిగా ఆలోచించే వ్యక్తులు, ఒత్తిడితో బాధపడేవారు కూడా ఇలా అబద్దాలు చెబుతూ ఉంటారు.
అబద్ధాల విషయానికి వస్తే ఇది పూర్తిగా భిన్నమైన వర్గం. కొందరికి ఈ అలవాటు ఉంటుంది. వారు అబద్దాలు చెప్పకుండా ఉండలేరు. ఒక రకంగా చెప్పాలి అంటే.. వారికి ఇదొక వ్యాధి అనొచ్చు. అదొక అలవాటు అంతే.. చిన్న చిన్న వస్తువుల విషయంలో కూడా వారు అబద్దాలు చెప్పేస్తూ ఉంటారు. ఈ విషయంలో మనం వారిని అస్సలు తప్పు పట్టలేం.
ఇక కొందరు ఎదుటివారి కోసం అబద్దాలు చెబుతూ ఉంటారు. ఎవరైనా ఒత్తిడిలో లేదంటే.. ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు.. ఎదుటివారు అబద్దాలు చెబుతూ ఉంటారు. నిజానికి అవి అబద్దాలు కావు. వారిని మానసిక సమస్యల నుంచి బయటపడేయడానికి వారు అలా అబద్దాలు చెబుతూ ఉంటారు.దీనిలో మంచే తప్పా.. చెడు ఉద్దేశం ఏమీ ఉండదు.