MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • COMMUNICATION : ఇలా మాట్లాడితే.. లైఫ్ లో మీ సక్సెస్ ని ఆపేవారే ఉండరు..!

COMMUNICATION : ఇలా మాట్లాడితే.. లైఫ్ లో మీ సక్సెస్ ని ఆపేవారే ఉండరు..!

బలమైన సంబంధాలు, విశ్వసనీయత, విజయానికి కీలోకం కమ్యూనికేషన్. ఇది ఎలా మెరుగుపర్చుకోవచ్చో ఈ కథనంలో తెలుసుకోండి.

2 Min read
Author : Bhavana Thota
Published : Jun 23 2025, 05:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మాట్లాడటమే కాదు
Image Credit : our own

మాట్లాడటమే కాదు

సమాజంలో మనం ఎదగాలంటే లేదా వృత్తిపరంగా ముందుకు సాగాలంటే, అందరితో సబలమైన సంబంధాలు ఏర్పడాలంటే, కమ్యూనికేషన్ చాలా ముఖ్యమైన అంశం. ఇది కేవలం మాటలు మాట్లాడటమే కాదు, మన అభిప్రాయాన్ని సరైన రీతిలో ఇతరులకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎవరితోనైనా సంబంధం బలపడాలంటే, జట్టుగా పని చేయాలంటే, లేదా విశ్వసనీయత పెరగాలంటే కమ్యూనికేషన్ నైపుణ్యం అవసరం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కమ్యూనికేషన్ అంటే-వినడం కూడా
Image Credit : freepik

కమ్యూనికేషన్ అంటే-వినడం కూడా

చాలామంది కమ్యూనికేషన్ అంటే మాట్లాడటం మాత్రమే అనుకుంటారు. కానీ దానికి మరో ముఖం కూడా ఉంది - వినడం. మన ముందున్నవారి మాటలు పూర్తిగా వినడం, మధ్యలో విరామాలు లేకుండా శ్రద్ధగా ఉండటం, వారి భావాలను అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే నిజమైన సంభాషణ జరుగుతుంది. ‘హార్వర్డ్ బిజినెస్ రివ్యూ’ జరిపిన ఓ పరిశోధన ప్రకారం, చురుకైన వినడం వృత్తిపరంగా బంధాలను బలపరచడంలో సహాయపడుతుంది. అలాగే సహచరుడికి ఒక క్లిష్ట నిర్ణయం తీసుకునే సందర్భంలో, మనం శ్రద్ధగా వినడం అతనికి మద్దతు లాగా నిలుస్తుంది.

36
పవర్ ఆఫ్ పాజింగ్ ఇన్ కన్వర్సేషన్
Image Credit : frrepik

పవర్ ఆఫ్ పాజింగ్ ఇన్ కన్వర్సేషన్

మరొక ముఖ్యమైన విషయం, మాట్లాడే ముందు ఆలోచించడం. ఎమోషనల్ సబ్జెక్ట్‌పై మాట్లాడేటప్పుడు వెంటనే స్పందించకుండా, కొన్ని క్షణాలు ఆగి మాట్లాడితే భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. దీనివల్ల మన మాటలు స్పష్టంగా, సమర్థంగా ఉంటాయి. 2025లో ప్రచురితమైన "ది పవర్ ఆఫ్ పాజింగ్ ఇన్ కన్వర్సేషన్" అనే అధ్యయనం ప్రకారం, సంభాషణలో స్వల్ప విరామం తీసుకోవడం వల్ల ఇతరుల నుండి మంచి స్పందన వస్తుందని, స్పీకర్‌ను మరింత బలంగా భావించే అవకాశం పెరుగుతుందని తేలింది.

46
శరీర భాష కూడా
Image Credit : freepik

శరీర భాష కూడా

ముఖ్యంగా, మేము ఉపయోగించే భాష సాధారణంగా ఉండాలి. క్లిష్టమైన పదాలతో మాట్లాడితే లేదా రాస్తే, పాఠకులు లేదా శ్రోతలు అర్థం చేసుకోలేరు. మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు సరళమైన పదాలతో మాట్లాడితే, అది వారి సమయంలో విలువనిచ్చినట్టు అవుతుంది. ముఖ్యంగా మెసేజ్ స్పష్టంగా ఉండటం వల్ల అపార్థాలకు తావుండదు.శరీర భాష కూడా కమ్యూనికేషన్‌లో కీలకమైన పాత్ర పోషిస్తుంది. మన మాటలకు తోడు మన మొహంలో కనిపించే భావోద్వేగాలు, చేతుల సూచనలు, కళ్ళకు కలిగే కాంటాక్ట్, మన స్వరం... ఇవన్నీ కలిపి మన సందేశాన్ని మరింత బలంగా వ్యక్తపరుస్తాయి. UCLAలో ప్రొఫెసర్ ఆల్బర్ట్ మెహ్రాబియన్ చేసిన పరిశోధన ప్రకారం, ముఖాముఖి సంభాషణలలో 93 శాతం భావం నాన్-వెర్బల్ కమ్యూనికేషన్ ద్వారానే వ్యక్తమవుతుందని తేలింది.

56
ఎదుటివారి అభిప్రాయాన్ని
Image Credit : freepik

ఎదుటివారి అభిప్రాయాన్ని

ఇంతకంటే ముఖ్యమైన విషయం, సంభాషణలో మనం మన అభిప్రాయాన్ని చెప్పడమే కాదు, ఎదుటివారి అభిప్రాయాన్ని తెలుసుకోవడమూ అవసరం. అందుకే ప్రశ్నలు అడగడం ముఖ్యం. ప్రత్యేకంగా ఓపెన్-ఎండెడ్ ప్రశ్నలు అడగడం ద్వారా వారు వివరంగా చెప్పే అవకాశం కలుగుతుంది. అప్పుడు మాత్రమే సంభాషణ పరస్పరంగా, అర్థవంతంగా సాగుతుంది. ప్రశ్నలు అడగడం ద్వారా ఎదుటివారిలో ఆసక్తిని కలిగించవచ్చు, తమ మాటలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు భావించవచ్చు.

66
నాయకత్వ లక్షణాలను
Image Credit : freepik

నాయకత్వ లక్షణాలను

 ఒక జాబ్ ఇంటర్వ్యూలో మీరు ఎంత టాలెంట్ ఉన్నా, మీ ఆలోచనను సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోతే అది నష్టమే. అదే విధంగా, ఒక జట్టు నాయకుడిగా పని చేస్తుంటే, మీలోని నాయకత్వ లక్షణాలను చూపించాలంటే మీరు అందరితో బంధాన్ని ఏర్పరచగలగాలి. అప్పుడు మాత్రమే మీరు ఒక మంచి టీం లీడర్‌గా నిలుస్తారు.

ఇవన్నీ సాధించాలంటే రోజూ కొంచెం సమయం వెచ్చించి మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. ఉదాహరణకు రోజూ 5 నిమిషాలు మీరు మీ మాటల స్పష్టతపై దృష్టి పెట్టండి. మీ మాటలతో ఎదుటివారిపై కలిగే ప్రభావాన్ని పరిశీలించండి. ఏదైనా తప్పుగా అర్థమవుతోందా అన్నదాన్ని విశ్లేషించండి. ఇదంతా బలమైన కమ్యూనికేషన్‌ను అభివృద్ధి చేయడంలో ఒక భాగం.

About the Author

BT
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
బంధుత్వం
ఏషియానెట్ న్యూస్
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
భార్య ఏడాదిగా పుట్టింట్లో ఉంటే.. భ‌ర్త విడాకులు తీసుకోవ‌చ్చా? చ‌ట్టం ఏం చెబుతోంది
Recommended image2
Relationship: చిన్న విషయమే కదా అని వదిలేస్తున్నారా? 5 అలవాట్లు మార్చుకుంటే లైఫ్ అంతా హ్యాపీ
Recommended image3
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Related Stories
Recommended image1
Relationship: భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉంటే మంచిది..?
Recommended image2
Relationship: ఎవరికైనా ఇలాంటి బహుమతులు ఇస్తున్నారా? వారితో మీ రిలేషన్ ముగిసినట్లే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved