రిలేషన్ షిప్ లో.. ప్రతి పురుషుడు ఏం కోరుకుంటాడో తెలుసా..?
తమపై ఒత్తిడి చేసి.. తమను మార్చుకోవాలని అనుకుంటే.. అబ్బాయిలకు నచ్చదట. తమ వైపు నుంచి ఆలోచించేవారు లభించాలని కోరుకుంటారట. అలా కాకుండా.. తమను మార్చాలి అనుకోవడం వీరికి అసలు నచ్చదట.
ఒక రిలేషన్ లో ప్రతి ఒక్కరికీ కొన్ని ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. తమ జీవితంలోకి వచ్చే వ్యక్తి ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అందులో ఎలాంటి తప్పులేదు. అయితే.. వారు కోరుకున్నట్లు వ్యక్తి దొరకనప్పుడు మాత్రమే.. చాలా మంది నిరాశకు గురౌతారు. అసలు.. ఓ రిలేషన్ లో అబ్బాయిలు ఓ అమ్మయి నుంచి ఓం కోరుకుంటారో ఇప్పుడు చూద్దాం..
1. చాలా మంది అమ్మాయిలు.. రిలేషన్ లోకి అడుగుపెట్టిన తర్వాత.. అబ్బాయిలను తమకు నచ్చినట్లుగా మార్చుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ.. తమపై ఒత్తిడి చేసి.. తమను మార్చుకోవాలని అనుకుంటే.. అబ్బాయిలకు నచ్చదట. తమ వైపు నుంచి ఆలోచించేవారు లభించాలని కోరుకుంటారట. అలా కాకుండా.. తమను మార్చాలి అనుకోవడం వీరికి అసలు నచ్చదట.
2.ప్రతి విషయంలో తమను తక్కువ చేసేవారంటే.. వీరికి నచ్చదట. కాబట్టి.. తమను ఇగోను, తమను తక్కువ చేయడం వారికి నచ్చదు. అలా తమను తక్కువ చేయనివారు.. తమ రిలేషన్ లోకి వస్తే బాగుండని కోరుకుంటారు.
couple
3.తమను అమ్మాయిలను పొగిడితే.. అబ్బాయిలకు చాలా ఇష్టమట. తాము చేసే పనులను గుర్తించి.. మంచిగా చేశారు అని గుర్తించేవారు కావాలని కోరుకుంటారట.
4.అబ్బాయిలు.. అమ్మాయితో తొందరగా కమిట్ అవ్వలేకపోతే.. మీతో ఉండలేను అని ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నట్లట. ఆ విషయాన్ని తాము నోటితో చెప్పక్కున్నా.. అమ్మాయిలు అర్థం చేసుకోవాలని అనుకుంటారట. లేదంటే.. తమకు నచ్చేలా ఉండాలని అనుకుంటూ ఉంటారట.
5.అందరూ.. అబ్బాయిలు ఏడవకూడదు అనే భ్రమలో ఉండిపోతూ ఉంటారు. అయితే.. తమ ఎమోషన్స్ ని అది బాధైనా, ఆనందమైనా బయటపెట్టే ఫ్రీడమ్ ఇవ్వాలని కోరుకుంటారట. అంతేకాకుండా.. తమకంటూ కొంత పర్సనల్ స్పేస్ కావాలని కోరుకుంటారట.
couple fight
6.ప్రతిసారి.. తాము ప్రేమ చూపించాలనే సిద్దాంతం అబ్బాయిలకు నచ్చదట. తమ పార్ట్ నర్ కూడా అప్పుడప్పుడు ప్రేమగా దగ్గరకు వచ్చి.. హగ్ చేసుకోవడం.. ముద్దు పెట్టుకోవడం.. ప్రేమ కురిపించడం లాంటివి చేయాలని అనుకుంటూ ఉంటారట.
7.తాము తప్పు చేసినప్పుడు.. ఏదైనా బాధలో ఉన్నప్పుడు.. తమ వెంట తమ పార్ట్ నర్ ఉండాలని అబ్బాయిలు కోరుకుంటారట. తప్పు చేశారు కదా అని వదిలేసి వెళ్లిపోయేవారు వీరికి నచ్చరట.
8.ఇప్పుడు.. సీరియస్ గా.. డల్ గా ఉండే అమ్మాయిలు.. అబ్బాయిలకు నచ్చరట. ఎప్పుడూ సరదాగా ఉంటూ.. అందరినీ నవ్విస్తూ.. నవ్వుతూ ఉండే అమ్మాయి తమ జీవితంలోకి రావాలని కోరుకుంటారట.
9.తమతో సమయం గడపడానికి ఇష్టపడే అమ్మాయి తమ జీవితంలోకి రావాలని కోరుకుంటారట. తమ ఇష్టాలు తెలుసుకొని.. వాటిని గౌరవించాలని భావిస్తారట.