నిజంగా ప్రేమలో ఉన్నామో లేదో తెలుసుకోవడమెలా?
మీ మనసుకి మీరే నిజంగా ప్రేమింస్తున్నామా.. లేక అనుబంధం ఉందా అనే ప్రశ్నను వేసుకుంటే.. సమాధానం మీకే దొరుకుతుందట.
ఎవరైనా ఒక వ్యక్తి మనసుకు నచ్చినప్పుడు.. మనం నిజంగా ఆ వ్యక్తితో ప్రేమలో ఉన్నామో లేదో తెలుసుకోవడం చాలా కష్టం. కొందరు ఇష్టాన్ని కూడా ప్రేమ అనే అనుకుంటారు. కానీ.. ప్రేమించడానికీ.. ఇష్టపడటానికీ.. సదరు వ్యక్తితో.. కేవలం ఒక అనుబంధం ఏర్పరుచుకోవడానికి చాలా తేడా ఉంటుంది.
చాలా మంది రెండింటి మధ్య తేడాను గుర్తించలేరు, ఎందుకంటే వాటి మధ్య చాలా అస్పష్టమైన గీతలు ఉన్నాయి. కానీ.. మీ మనసుకి మీరే నిజంగా ప్రేమింస్తున్నామా.. లేక అనుబంధం ఉందా అనే ప్రశ్నను వేసుకుంటే.. సమాధానం మీకే దొరుకుతుందట.
మీరు ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు, మీరు అతని కోసం ఏదైనా చేస్తారు. మీరు వారి అవసరాలు, కోరికల గురించి ఆలోచిస్తారు. వాటిని సాధించడానికి పని చేస్తారు. కానీ మీరు ఎవరితోనైనా కేవలం అనుబంధం ఏర్పరుచుకున్నట్లయితే.. వారి అవసరాలకన్నా ముందు మీ అవసరాలే మీకు గుర్తుకు వస్తాయి. వారికన్నా ముందు మీకు మీరు గుర్తుకువస్తున్నారంటే.. వారితో మీరు ప్రేమలో లేనట్లే అర్థం.
మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నప్పుడు, మీరు స్వేచ్ఛగా ఉంటారు. వారి ముందు ఒకలా.. వెనక మరోలా నటించాలని అనుకోరు. మిమ్మల్ని మీలా చూపించాలని అనుకుంటారు. కానీ మీరు ఎవరితోనైనా ఎటాచ్మెంట్ ఏర్పరుచుకున్నట్లయితే.. మీ భావాలు మీ మొత్తం మనస్సు, శరీరాన్ని నియంత్రిస్తున్నాయని మీరు గమనించవచ్చు. కేవలం మీతో ఎవరో ఒక వ్యక్తి ఉంటే బాగుండని అందుకోసం వారితో సమయం గడపాలని చూస్తుంటారు.
మీరు ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు, అది జీవితకాలం లేదా చాలా కాలం పాటు కొనసాగే అనుభూతి. అలా కాకుండా.. ఆ ఫీలింగ్ చాలా కొద్దికాలం మాత్రమే మీతో ఉంది అంటే.. వారితో మీది ప్రేమ కాదని అర్థం
మీరు ,మీ భాగస్వామి ఒకరినొకరు ఎంతో ప్రేమించినప్పుడు, మీరిద్దరూ కలిసి పెరుగుతారు. ఒకరికొకరు విలువలను బోధించడమే కాకుండా, మీరిద్దరూ మంచి, చెడులకు కూడా మద్దతు ఇస్తారు. అలా కాకుండా.. ఒకరి స్వార్థం కోసం మరొకరు ప్రవర్తించడం లాంటివి చేస్తున్నారంటే.. మీకు ఒకరిపై ఒకరికి ప్రేమ లేదనే అర్థం. ఒకరి ఎదుగుదలకు మరొకరు మద్దతు ఇచ్చేవారే నిజమైన ప్రేమికులు. అలా కాకుండా.. తమ పార్ట్ నర్ నిత్యం రిస్క్ లో పడేసేవారు ప్రేమ ఉండదు.