బాడీ షేమింగ్ ఎదురైతే ఏం చేయాలి..?
వారు అనేయడం.. మనం బాధపడటం చాలా కామన్ గా జరిగిపోతున్నాయి. కొందరైతే ఏకంగా ఏడ్చేస్తారు. కానీ.. అలా ఏడ్వాల్సిన పరిస్థితి లేదట. ఈ బాడీ షేమింగ్ ఎదురైనప్పుడు.. మనం ఎలా ప్రవర్తించాలి..? వారి కామెంట్లకు మనం ఎలా స్పందించాలో ఓసారి చూద్దాం..
మన సమాజంలో.. ఇతరులపై కామెంట్స్ చేయడానికి చాలా మందికి ముందుకు వస్తారు. బాగా లావుగా ఉన్నావని కొందరు.. పొట్టిగా ఉన్నావని కొందరు.. బరువు తగ్గు అంటూ కొందరు నల్లగా ఉన్నావంటూ కొందరు.. ఇలా పక్కవారిపై కామెంట్స్ చేస్తూనే ఉంటారు. మన దేశంలో వాక్ స్వాతంత్ర్యం ఉందన్న ఒకే ఒక్క కారణంతో.. వారికి తోచింది చెబుతూ.. బాడీ షేమింగ్ చేస్తూ ఉంటారు.
నిజానికి మనపై అలాంటి కామెంట్స్ చేసే హక్కు ఎవరికీ లేదు. కానీ.. వారు అనేయడం.. మనం బాధపడటం చాలా కామన్ గా జరిగిపోతున్నాయి. కొందరైతే ఏకంగా ఏడ్చేస్తారు. కానీ.. అలా ఏడ్వాల్సిన పరిస్థితి లేదట. ఈ బాడీ షేమింగ్ ఎదురైనప్పుడు.. మనం ఎలా ప్రవర్తించాలి..? వారి కామెంట్లకు మనం ఎలా స్పందించాలో ఓసారి చూద్దాం..
మీకు సంబంధం లేని వ్యక్తులు మీ శరీరంపై కామెంట్స్ చేస్తే.. పట్టించుకోకూడదు. వాళ్లు ఏదో అన్నారు కదా అని.. మీ శరీరంపై మీరు అయిష్టత పెంచుకోకూడదు. ముందుగా మీ స్వంత శరీరంపై నమ్మకంగా ఉండండి. వారి మాటలు పట్టించుకోవద్దు. ఒకవేళ.. కచ్చితంగా వారికి రిప్లై ఇవ్వాలి అనుకుంటే మాత్రం.. నాకు నచ్చినట్లుగా.. నా శరీరం ఉంది అనే సమాధానం మీరు ఇవ్వొచ్చు. ఇలాంటి సమాధానం ఇచ్చిన తర్వాత.. వారు మళ్లీ.. మీ జ ోలికి కారు. వారు చేసిన కామెంట్స్ పై ఆలోచించి.. మనసు మాత్రం పాడుచేసుకోకూడదు.
సరే.. బయటివారు కామెంట్స్ చేస్తే.. నిజంగానే పట్టించుకోం. కానీ.. కొందరికి ఇంట్లోనే విమర్శలు ఎదురౌతాయి. శత్రువులు ఎక్కడో ఉండరు.. మన ఇంట్లోనే ఉంటారు.. అన్నట్లుగా... మనవారే మనపై విమర్శలు చేస్తూ ఉంటారు. మీ అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లే.. అలా ఉన్నావ్.. ఇలా ఉన్నావ్ అంటూ కౌంటర్లు వేస్తూ ఉంటారు. అయితే.. మీ గురించి ఆందోళన పడాల్సిన అసవరం వారికి లేదు అనే విషయాన్ని చెప్పండి. లేదు.. వారు అర్థంచేసుకోగల వ్యక్తి అయితే.. బాడీ షేమింగ్ గురించి అవగాహన కల్పించాలి. చాలా మందికి అది తప్పు అని తెలీదు. తెలీక అలా అనేస్తూ ఉంటారు. కాబట్టి.. వారికి అర్థమయ్యేలా చేయాలి.
ఇక ఎక్కువ బాడీ షేమింగ్ ఎదుర్కొనే మరో ప్లేస్ ఇంటర్నెట్. మనం ఏవైనా ఫోటోలు షేర్ చేస్తే.. వాటిపై ఛెండాలమైన కామెంట్స్ చేస్తూ ఉంటారు. మనం ఎవరు..? మన గురించి వారికి ఏం తెలుసు అనే విషయాలు కూడా పట్టించుకోరు. నోటికి వచ్చినట్లు కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే.. వారి కామెంట్స్ ని స్పందించకపోవడే ఉత్తమమైన మార్గం. లేదు అంటే.. వారికి గట్టి కౌంటర్ ఇచ్చేలా.. వారి పేరు ట్యాగ్ చేసి మరీ.. మరోసారి అలాంటి కామెంట్ చేయకుండా రిప్లై ఇవ్వాలి.
మీ ఆరోగ్యం దెబ్బతిననంత కాలం అజ్ఞానమే పరమానందం అని గుర్తుంచుకోండి. మీరు బరువు తగ్గడం ముఖ్యం అని మీరు అనుకుంటే, మీరు దానిపై పని చేస్తున్నారని ఇతరులకు వివరించడం మానేయండి. మీ కోసం బరువు తగ్గించుకోండి, ఇతరులకు కాదు!