Relationship Tips: మీ లైఫ్ పార్టనర్ కు ఈ ప్రామిస్ లు చేస్తే.. మీరెప్పటికీ విడిపోరు..
Relationship Tips: జీవిత భాగస్వామికి ప్రామిస్ లు చేయడం ఎంత సులభమో.. వాటికి విలువ ఇచ్చి.. ఇచ్చిన మాటను తప్పకుండా ఉన్నప్పుడే మీ బంధం కలకాలం ఉంటుంది. లేదంటే మీ బంధం మూనాళ్ల ముచ్చటగానే ఉంటుంది.
ప్రతి బంధంలో ప్రేమ ఎంత ముఖ్యమో.. నమ్మకం కూడా అంతే ముఖ్యం. ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం ఉంటేనే ఆ బంధం కలకాలం ఉంటుంంది. అయితే ప్రతి బంధంలో చిన్న చిన్న మన స్తాపాలు, కొట్లాటలు, గొడవలు జరగడం చాలా కామన్. వీటినే కారణాలుగా చూపించి కొందరు విడిపోతుంటారు. కానీ మీ పార్టనర్ పై నమ్మకం ఉంటే ఎన్ని కొట్లాటలు జరిగినా విడిపోరు. నమ్మకం ఉంటేనే ఎలాంటి పరిస్థితిలోనైనా మీ బంధం బలంగా ఉంటుంది.
మీ భాగస్వామికి ఈ వాగ్దానాలు చేయండి.. ఒక వ్యక్తితో బంధం ఏర్పడినప్పుడు.. ఆ బంధం ఎంతకాలం ఉంటుందో అంచనా వేయడం కష్టం. కానీ మీ భాగస్వామి లైఫ్ లాంగ్ మీతో ఉండాలంటే కొన్ని వాగ్దానాలను తప్పక చేయాలంటున్నారు కొందరు నిపుణులు. ఆ వాగ్దాలు మీ భాగస్వామికి మీపై నమ్మకాన్ని కలిగించేవిగా ఉండాలి. ముఖ్యంగా ఆ వాగ్దానాలను మీరు అస్సలు విస్మరించకూడదు. అప్పుడే మీ రిలేషన్ షిప్ స్ట్రాంగ్ గా ఉంటుంది.
మీ భాగస్వామి గురించి శ్రద్ధ అవసరం.. సింగిల్ లైఫ్ కు పార్టనర్ తో ఉన్న లైఫ్ కు చాలా తేడా ఉంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీరు మీ గురించే ఆలోచించినా పర్లేదు కానీ.. మీ భాగస్వామితో ఉన్నపుడు మాత్రం వారి గురించి కూడా ఆలోచించాలి. ముఖ్యంగా వారిని సంతోషపెట్టడానికి, ప్రత్యేకంగా భావించే ఏ అవకాశాన్ని కూడా వదులుకోకూడదు. అలాగే మీ భాగస్వామికి నచ్చని అలవాట్లను మానుకుంటానని వారికి ప్రామిస్ చేయండి.
ఆనందమైనా.. దు:ఖమైనా పంచుకోండి.. మీ లైఫ్ లోకి భాగస్వామి వచ్చాకా.. ప్రతి మూమెంట్ ను ఒంటరిగా కాకుండా ఇద్దరూ ఉండేట్టు చూసుకోండి. ఆనందమైనా.. దు:ఖమైనా సరే.. తోడుగా ఉండండి. ఏ బంధంలోనైనా సరే దాని అసలు స్వరూపం కష్ట సమయాల్లోనే బయటపడుతుంది అంటారు. కాబట్టి మీ పార్టనర్ బాధలో ఉన్నప్పుడు ఒంటరిగా వదిలేయకుండా వారి భావోద్వేగాలను పంచుకుంటానని వాగ్దానం చేయండి. భావోద్వేగాలను పంచుకున్నప్పుడే మీ బంధం మరింత బలపడుతుందని కొందరు చెబుతుంటారు.
నిజాయితీ వాగ్దానం.. మీ తల్లిద్రండులు, తోబుట్టువులు, స్నేహితులతో ఎలా అయితే నిజాయితీగా ఉంటారో మీ ప్రేమ పట్ల కూడా అలాగే ఉంటానని మీ ప్రేయసికి ప్రామిస్ చేయండి. నిజాయితీ లేకపోతే ఆ బంధం ఎక్కువ రోజులు నిలువలేదు. ఒక రిలేషన్ షిప్ లో నిజాయితీ లేకపోతే అది వారు విడిపోయే దాకా వెళుతుంది.
ప్రతి పరిస్థితిలో కలిసే ఉండండి.. జీవితంలో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అలాంటి పరిస్థితుల్లో బంధాలు సులువుగా బ్రేకప్ అయ్యే అవకాశం ఉంది. అందుకే పరిస్థితి ఎలాంటిదైనా మీ భాగస్వామిని ఒంటరిగా వదిలేయనని మీ భాగస్వామికి ప్రామిస్ చేయండి. దీంతో వారి మీపై నమ్మకం పెరుగుతుంది. మీ బంధం కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది.