భార్యాభర్తల్లో ఎవరు ఎక్కువ మోసం చేస్తారంటే?
వైవాహిక జీవితంలో మోసపోతున్నవారు చాలా మందే ఉన్నారు. దీనివెనుక ఎన్నో కారణాలుంటాయి. కానీ ఈ మోసం ఇద్దరినీ విడిపోయేలా చేస్తుంది. గతంలో కంటే నేడు అక్రమ సంబంధాలు ఎక్కువయ్యాయని నిపుణులు చెబుతున్నారు.
Image: FreePik
వైవాహిక జీవితంలో భాగస్వామిని ఎక్కువగా మోసం చేసేది ఆడవాళ్లే అని కొందరంటే.. మరికొందరు కాదు మగవాళ్లేనంటుంటారు. భార్యాభర్తల్లో ఏ ఒక్కరూ మోసం చేసినా ఆ బంధానికి ముగింపు పడ్డట్టే. ఇది నమ్మకద్రోహం కిందికే వస్తుంది.
Image: FreePik
మోసం అంటే పెళ్లి చేసుకున్న భాగస్వామితో కాకుండా వేరొకరితో సెక్స్ లో పాల్గొనడం, లైంగిక సంబంధం పెట్టుకోవడం. కానీ ఇది మీ భాగస్వామిని నమ్మకద్రోహం చేసినట్టే. వైవాహిక సంబంధం కాకుండా ఒక వ్యక్తితో మానసికంగా, శారీరకంగా ఉండటం మోసం కిందికే వస్తుంది.
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం ఎక్కువ అయ్యింది. నిపుణుల ప్రకారం.. ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ల ద్వారే ఇలాంటి అక్రమ సంబంధాలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా గతంలో కంటే ప్రస్తుతం అక్రమ సంబంధాలు ఎక్కువైపోయాయని నిపుణులు అంటున్నారు.
అయితే ఏ లింగం భాగస్వామిని ఎక్కువగా మోసం చేస్తుందో ఖచ్చితంగా చెప్పడం, నిర్ణయించడం కష్టం. అయితే ఇన్స్టిట్యూట్ ఫర్ ఫ్యామిలీ (ఐఎఫ్ఎస్) అధ్యయనం ప్రకారం.. ఆడవారి కంటే మగవారే ఎక్కువగా మోసం చేస్తున్నారని వెల్లడైంది.
20% మంది పురుషులు, 13% మంది పెళ్లైన ఆడవారు వారి భాగస్వామితో కాకుండా మరొకరితో సన్నిహితంగా ఉన్నట్టు నివేదించారు. కానీ ఈ నిష్పత్తి లింగ వ్యత్యాసాన్ని బట్టి మారుతుంది. 18 నుంచి 29 సంవత్సరాల మధ్యనున్న మహిళలు పురుషుల కంటే ఎక్కువగా మోసం చేస్తున్నట్టు అంగీకరిస్తున్నారు.
వయసు పెరిగే కొద్దీ పురుషులు, మహిళలు ఇద్దరూ ఎక్కువగా మోసపోతున్నట్టు ఒప్పుకున్నారు. గణాంకాల ప్రకారం.. మోసం చేసే పురుషుల శాతం ఎక్కువగా ఉందని సూచిస్తున్నప్పటికీ.. వివాహిత మహిళలు కూడా పురుషుల మాదిరిగానే తరచుగా మోసం చేయొచ్చు. అయినప్పటికీ వివాహేతర సంబంధాలను వీళ్లే ఎక్కువగా దాస్తారట.
విడాకులు, ఆర్థిక సమస్యలు, సింగిల్ పేరెంటింగ్ వంటి ఒత్తిళ్లతో మహిళలు అక్రమసంబంధాలు పెట్టుకుంటారట. కానీ ఇలాంటి విషయాలు తెలియడం వల్ల మహిళలే ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. అలాగే ఆడవారు తమ భర్తల నుండి గృహ హింసను ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకే అక్రమ సంబంధాలను దాచిపెడుతున్నారని చెబుతున్నారు.