పార్ట్ నర్ మోసం చేయడం పై వారి భర్తలు ఏమంటున్నారో తెలుసా?
తమ భాగస్వామి మోసం చేయడాన్ని కొందరు జీర్ణించుకోలేరు. వారిపై పగ తీర్చుకోవాలని అనుకుంటూ ఉంటారు. కాగా... కొందరు పురుషులు... తమ భాగస్వాములు మోసం చేయడాన్ని వారు ఎలా తట్టుకుంటారో... వారి మాటల్లోనే విందాం....
What did the cheating husband say on the first night
వివాహం అయినా... లివ్ ఇన్ రిలేషన్ అయినా... కొందరు తమ భాగస్వాములను మోసం చేస్తూ ఉంటారు. ఇది చాలా మందికి ఎదురైన అనుభవం కావచ్చు. తమ భాగస్వామి మోసం చేయడాన్ని కొందరు జీర్ణించుకోలేరు. వారిపై పగ తీర్చుకోవాలని అనుకుంటూ ఉంటారు. కాగా... కొందరు పురుషులు... తమ భాగస్వాములు మోసం చేయడాన్ని వారు ఎలా తట్టుకుంటారో... వారి మాటల్లోనే విందాం....
‘నేను, నా భార్య ఆరు సంవత్సరాలుగా రిలేషన్ లో ఉన్నాం. నాలుగేళ్ల తర్వాత.... అంటే.. రెండేళ్ల క్రితం తాను మరో వ్యక్తితో రిలేషన్ లో కి అడుగుపెట్టింది. ఆమె మరో వ్యక్తితో సంబంధం పెట్టుకున్న విషయం నాకు తెలిసిపోయింది. నేను ఆఫీసుకు వెళ్లిన సమయంలో.... ఆమె.. మా ఇంట్లోనే మరో వ్యక్తితో మా సోఫాలోనే గడిపింది.. విచిత్రం ఏమిటంటే, నాకు ఎలాంటి కోపం రాలేదు. ఆ వంకతో ఆమెకు దూరమయ్యాను’ అంటూ ఓ వ్యక్తి చెప్పాడు.
‘మా 8 సంవత్సరాల వైవాహిక జీవితంలో...నా భార్య మోసం చేస్తుందని నేను ఊహించలేకపోయాను. అయితే.... నా భార్య.. అందంగా కనిపించే తన సహోద్యోగితో రిలేషన్ పెట్టుకుంది. ఆ విషయం నన్ను ఎంతో బాధపెట్టింది. ఆ విషయం నాకు తెలిసింది అని.... ఆమెకు తెలిసిన తర్వాత... క్షమించమని ఓ మాట చెప్పేసి వెళ్లిపోయింది. నాతో గడిపిన క్షణాలను ఆమె మర్చిపోయింది. నేనే గజిబిజీగా మారిపోయిను’ అని మరో వ్యక్తి పేర్కొన్నాడు.
‘మా సంబంధం ఒక సంవత్సరం గడిచిన తర్వాత... తన పార్ట్ నర్ తన దగ్గరకు వచ్చి... తనకు మరో వ్యక్తి నచ్చాడని.. అతనితో గడపాలని అనుకుంటున్నట్లు నాకు చెప్పింది. అందుకోసం తాము విడిపోవాలని కోరింది. ఆ మాట వినగానే విపరీతమైన కోపం వచ్చింది. కానీ... తర్వాత.. నిజాయితీగా తాను నాకు నిజం చెప్పినందుకు సంతోషించాను. నిజం దాచి మోసం చేయనకు సంతోషం వేసింది. అంతే... ఆమెకు బెస్ట్ విషెస్ చెప్పాను’ అంటూ మరో యువకుడు చెప్పాడు.
‘మేము కొన్ని నెలలుగా డేటింగ్ చేస్తున్నాము. కలిసి ఇంట్లో పార్టీకి వెళ్ళాము. నేను డ్రింక్ తీసుకోవడానికి మెట్లపైకి వెళ్లాను. ఆమె ఒక సోఫాలో హార్డ్‌కోర్‌లో ఓ వ్యక్తితో కలిసి ఉంది. నేను కూడా ఏమీ అనలేదు, వెళ్ళిపోయాను. మళ్ళీ ఆమెతో మాట్లాడలేదు. అక్కడితో మా రిలేషన్ ముగిసింది.’ అని మరో వ్యక్తి చెప్పడం గమనార్హం.