చాణక్య నీతి ప్రకారం... భార్య తన భర్తకు కూడా ఈ విషయాలు చెప్పకూడదట..!
ముఖ్యంగా భార్యభర్తల బంధం గురించి.. వారు ఎలా ఉండాలి అనే విషయాలను కూడా చెప్పాడు. ఆయన ప్రకారమే.. భార్య కొన్ని విషయాలను తన భర్తకు తెలీయకుండా దాచి పెట్టవచ్చట. మరి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం....
భార్యభర్తల బంధం చాలా పారదర్శకంగా ఉండాలని, ఎలాంటి దాపరికాలు ఉండకూడదు అని అందరూ చెబుతుంటారు. అది అక్షరాలా నిజం. కానీ.. కొన్ని విషయాలు మాత్రం భార్యభర్తలు పంచుకోకపోవడమే మేలు అని చాణక్యుడు అంటున్నాడు.
Chanakya Niti
ప్రముఖ తత్వవేత్త, ఆర్థిక శాస్త్ర నిపుణుడు చాణక్యుడు ఎప్పుడో చెప్పిన మాటలు, బోధనలు కాలామాన పరిస్థితులకు అనుగుణంగా ఇప్పటికీ వర్తిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా మనిషి ప్రవర్తనకు సంబంధించిన విషయాలు ప్రతి ఒక్కరి జీవితాలకు కచ్చితంగా ఉపయోగపడతాయి. ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి..? ఎలా ప్రవర్తించకూడదు అనే విషయాలపై చాణక్యుడు ఏ నాడో క్లారిటీ ఇచ్చేశాడు.
Chanakya Niti
ముఖ్యంగా భార్యభర్తల బంధం గురించి.. వారు ఎలా ఉండాలి అనే విషయాలను కూడా చెప్పాడు. ఆయన ప్రకారమే.. భార్య కొన్ని విషయాలను తన భర్తకు తెలీయకుండా దాచి పెట్టవచ్చట. మరి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం....
సీక్రెట్ క్రష్: ప్రతి స్త్రీకి సీక్రెట్ క్రష్ ఉంటుందని చాణక్యుడు చెప్పాడు. ఇది ఏ దశలోనైనా ఉండవచ్చు. కానీ ఆమె జీవితంలో మరొకరితో ప్రేమలో పడే సందర్భం ఉంటే.. దానిని ఏ భార్య తన భర్తతో చెప్పకూడదు. తన బెస్ట్ ఫ్రెండ్ కి సంబంధించిన విషయాన్ని తన భాగస్వామితో ప్రస్తావించే అవకాశం ఉన్నా.. ఆమె మాత్రం షేర్ చేయకూడదట.
Chanakya Niti
చాలా విషయాల్లో ఏకీభవిస్తుంది: చాలా విషయాల్లో ఆమె తన భర్తతో ఏకీభవిస్తుంది. కొన్నింటిని ఇష్టపడకపోయినా, ఆమె నో చెప్పదు. ఒక్కోసారి భర్త తీసుకునే నిర్ణయాలు నచ్చక మౌనంగా ఉంటోందట. అలా ఉండటంలో కూడా ఎలాంటి తప్పు లేదట.
సెక్స్ తర్వాత సంతృప్తి అనుభూతి: సెక్స్ తర్వాత ప్రతి భార్య తన భర్తకు అబద్ధం చెబుతుందని చాణక్యుడు అంటున్నాడు . సాధారణంగా పురుషుల కంటే స్త్రీలకు లైంగిక ఆసక్తి, కోరిక ,శక్తి ఎక్కువగా ఉంటాయట. కలయిక తర్వాత పూర్తిగా సంతృప్తి చెందకపోయినా, భాగస్వామి అడిగితే మాత్రం నిజం చెప్పదు. సంతోషంగా అనిపించిందని చెప్పింది. ఎందుకంటే ఆమె తన భర్తను నిరాశపరచడం ఇష్టం ఉండక అలా చెప్తుందట. అలా చెప్పడంలోనూ ఎలాంటి తప్పు లేదని ఆయన అన్నారు.
Chanakya Niti
రహస్య పొదుపులు: సంపాదించే భార్యలు లేదా గృహిణులు కావచ్చు, వంద శాతం మహిళలు తమ భర్తలకు తెలియకుండా పొదుపు చేస్తారు. అందుకే ఆమెను గృహాక్ష్మి అని పిలుస్తారు. సంక్షోభ సమయాల్లో ఆదుకునే బ్యాంకు ఇది. కుటుంబానికి అత్యవసరమైనప్పుడు ఈ డబ్బు ఉపయోగపడుతుంది.
వారి అనారోగ్యాన్ని చెప్పదు: ఆమె చాలా అలసిపోయినా లేదా అనారోగ్యంతో ఉన్నప్పటికీ, ఆమె తన భాగస్వామికి చెప్పడానికి ఇష్టపడదు. సర్దుకుపోయి కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటుంది. ఇది ఆమెకు మరింత హాని చేస్తుంది. అయినా ఆమె చెప్పదు.
మూడవ పక్షానికి చెప్పడం: చాలా మంది భార్యలు తమ జీవిత భాగస్వామితో కాకుండా మూడవ వ్యక్తితో విభేదాలను పంచుకుంటారు. వారు తమ భావాలను భర్త నుండి దాచిపెడతారు. తమ భర్తతో ఉన్న సమస్యను వేరే వారితో పంచుకొని.. భర్త ముందు మాత్రం సంతోషంగా ఉన్నట్లు నటిస్తారట.
అయితే.. ఈ రహస్యాలన్నీ.. ఎలాంటి ప్రమాదకరమైనవి కావు కాబట్టి.. వీటిని భర్త వద్ద దాచి పెట్టినా వచ్చిన నష్టం ఏమీ లేదని చాణ్యకుడు చెబుతున్నాడు.
చాణక్యుడు ప్రకారం, ఇటువంటి రహస్యాలు కుటుంబాన్ని రక్షిస్తాయి. భార్య తన క్రష్ గురించి చెబితే, భర్త దానిని స్వేచ్ఛగా అంగీకరించడు. కానీ అనారోగ్యం అనే విషయాన్ని గోప్యంగా ఉంచితే అది తీవ్ర సమస్యగా మారితే మాత్రం కష్టమే. ఇది మాత్రం ఎక్కువ రోజులు దాచకుండా చెప్పడమే ఉత్తమం.