MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • ప్రతి తండ్రి తమ కొడుక్కి ఈ విషయాలు చెప్పాలి తెలుసా..?

ప్రతి తండ్రి తమ కొడుక్కి ఈ విషయాలు చెప్పాలి తెలుసా..?

ఆ ఒత్తిడి మీ కొడుకు మీద పడకుండా చూడాల్సిన బాధ్యత తండ్రి మీద మాత్రమే ఉంది. తమకు సంతోషాన్ని ఇచ్చే దానిపై కూడా ఎలా దృష్టి పెట్టాలి అనే విషయాన్ని తండ్రి కొడుక్కి చెప్పాలట. 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 24 2022, 12:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
father son

father son


పిల్లలు  ఎలా పెరుగుతున్నారనే విషయంలో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ముఖ్యంగా మగ పిల్లల విషయంలో.. తండ్రి పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. మగ పిల్లలకు ఖచ్చితంగా తండ్రి సూచనలు చాలా అవసరమట. ప్రతి కొడుకు.. తన తండ్రి దగ్గర నుంచి ఈ కింద విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలట. మరి అవేంటో ఓసారి చూద్దాం..

27

ఇతరుల కంటే మీ ఆనందానికి ప్రాధాన్యత ఇవ్వడం..

స్వీయ ప్రాధాన్యత ఇవ్వడం మంచిది కాదు కానీ చాలా అత్యవసరం అని మీ కొడుకు తెలుసుకోవడం ముఖ్యం. మన సమాజం పురుషాధిక్యత ఎక్కువగా కలిగి ఉందనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. పురుషులపై అధిక భారం ఉంటుంది. అబ్బాయిలు అంటే ఇలానే ఉండాలి.. ఇలానే చేయాలి అనే నమ్మకం అందరిలోనూ పాతుకుపోయింది. ఆ ఒత్తిడి మీ కొడుకు మీద పడకుండా చూడాల్సిన బాధ్యత తండ్రి మీద మాత్రమే ఉంది. తమకు సంతోషాన్ని ఇచ్చే దానిపై కూడా ఎలా దృష్టి పెట్టాలి అనే విషయాన్ని తండ్రి కొడుక్కి చెప్పాలట. 

37

మీరు ఆశించేది ఇవ్వండి
మీరు  ఎవరితో ఎలా ఉండాలి అనుకుంటున్నారో అలానే ఉండాలట. ఇది. జీవితంలోని అన్ని రంగాలలో ప్రతిచోటా పని చేసే మొదటి  ప్రధానమైన నియమం. ఇది పిల్లలలో సంఘం, విధేయత యొక్క ఆలోచనలను ప్రేరేపించడంలో కూడా సహాయపడుతుంది. 

47

ప్రపంచం మొత్తం గులాబీ బాటలా ఉంటుందని చాలా మంది పిల్లలు అనుకుంటూ ఉంటారు. ఏదైనా తప్పు జరిగితే.. అది తమ పొరపాటుగా భావిస్తూ ఉంటారు. ఆ సమయంలో.. అది వారి తప్పు వల్ల జరిగింది కాదనే విషయం తండ్రి కొడుక్కి చెప్పాలట. బయట ప్రపంచం ఎలా ఉంటుందనే విషయం కచ్చితంగా చెప్పాలట.

57

చాలా మంది పేరెంట్స్.. తమ పిల్లలకు తమ ప్రేమను తెలియజేయరు. ఎందుకంటే.. మా జెనరేషన్ వేరు.. అలా చెప్పరు అంటూ సాకులు చెబుతూ ఉంటారు. కానీ.. పిల్లలను మీరు ఎంత ప్రేమిస్తున్నారు అనే విషయాన్ని తెలియజేయాలట. వారికి ఐలవ్ యూ చెప్పడం... వారిని మీరు ఎంత అర్థం చేసుకుంటున్నారు అనే విషయాన్ని వారికి చెప్పాలట.

67

మనం ఎవరినైనా బాధపెడితే.. వారు తిరిగి మనల్ని బాధ పెడతారు. ఈ విషయాన్ని మనం పిల్లలకు కచ్చితంగా చెప్పాలట. ఈ విషయం కనుక పిల్లలకు తెలిస్తే.. ఎదుటివారిని ఇబ్బంది పెట్టి.. తర్వాత వారు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఈ విషయాన్ని కూడా తండ్రి కచ్చితంగా తమ కుమారుడికి నేర్పించాలట.

77

పిల్లలకు వారిలో మరింత ఎక్కువ సామర్థ్యం ఉందనే విషయాన్ని ప్రతిసారీ చెబుతూ ఉండాలట. పిల్లలు ఏం చేసినా.. ఇంకా చేయగలరని.. వారిలో ఇంకా ఎక్కువ టాలెంట్ ఉందని మీరు ప్రోత్సహించాలి. అప్పుడు వారు మరింత మెరుగ్గా తయారౌతారట.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Extra Marital affairs Psychology: అక్రమ సంబంధాలు పెట్టుకున్న స్త్రీల సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసా?
Recommended image2
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం భార్యా భర్తల మధ్య గొడవలకు అసలు కారణాలు ఇవే!
Recommended image3
Fictosexuality: క‌ల్పిత పాత్ర‌ల‌పై లైంగిక ఆక‌ర్ష‌ణ‌.. యువ‌త‌లో పెరుగుతోన్న ఫిక్టోసెక్కువాలిటీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved