Relationship: సంసారం సజావుగా సాగాలా.. అయితే బెడ్ రూమ్ లో ఈ వస్తువులు ఉంచకండి?
Relationship: సాధారణంగా బెడ్ రూమ్ అందంగా ఉంటుందని ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు ఉంచుతారు కానీ ఉంచకూడని వస్తువులు బెడ్ రూమ్ లో ఉంచితే అవి భార్యాభర్తల మధ్య కలహాలని సృష్టిస్థాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
హిందూ పురాణాల ప్రకారం పడకగదిలో కొన్ని వస్తువులు ఉండకూడదని చెప్పారు. బెడ్రూంలో ఇలాంటి వస్తువులు ఉంటే వాటి ప్రభావము ఉద్యోగము మనశ్శాంతి మన అభివృద్ధి మీద ప్రభావం చూపిస్తాయి. ముందుగా పడకగదిని ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోండి. మనసుకి హాయి గొలుపే పటాలని మాత్రమే గది గోడలకి ఉంచండి.
పడక గదిలో చెత్త అసలు ఉండకూడదు. పడక గదిలో చెత్త ఉన్నట్లయితే అది భార్యాభర్తల మధ్య గొడవలు జరగటానికి అవకాశం సృష్టిస్తుంది. అలాగే భార్యాభర్తలు పడుకునే మంచం మీద వేరే వ్యక్తులు కూర్చుంటే అది కూడా భార్య భర్తల మధ్య గొడవలకి కారణమవుతుంది.
అలాగే కొబ్బరి నూనె, మంచినీళ్లు ఇలాంటివి పడుకున్న వ్యక్తి యొక్క తల దగ్గర ఉండకుండా చూసుకోండి. అలాగే చనిపోయిన వ్యక్తుల యొక్క ఫోటోలు కూడా బెడ్రూంలో ఉండకూడదు. బెడ్ రూమ్ లో చీపురు కట్ట అసలు ఉండకూడదు.
అలాగే ఎండిపోయిన పువ్వులు కూడా బెడ్ రూమ్ లో ఉండకూడదు అవి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు సృష్టిస్తుంది. అలాగే గది గోడలు మనసుని ఉద్రేకపరిచే ముదురు రంగులు కాకుండా లేత రంగులు ఉండేలాగా చూసుకోండి.
అలాగే బెడ్ రూమ్ లో అద్దం కూడా ఉండకూడదు. అలాగే కోపంతో ఉండే దేముడి పటాలు కూడా బెడ్ రూమ్లో ఉంచకండి. అలాగే హింసని ప్రేరేపించే ఛాయాచిత్రాలు కూడా బెడ్రూంలో ఉంచకండి. ఇలా చేయడం వలన మీకు మీ భాగస్వామికి గొడవలు ప్రారంభమవుతాయి.
బెడ్ రూమ్ ని అనవసరమైన వస్తువులతో నింపేయకండి. బెడ్ రూమ్ ఎంత ప్రశాంతంగా ఉంటే భార్యాభర్తల మనసులు అంత ప్రశాంతంగా ఉంటాయి. పడక గదిలో అవసరం ఉన్న వస్తువులు మాత్రమే ఉంచండి. అవసరం లేని వస్తువులు బెడ్ రూమ్ లో ఉంచడం వల్ల అవి ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేస్తాయి.