ఈ 7 విషయాలు భార్యతో అస్సలు చెప్పకూడదు..
భార్యాభర్తల అనుబంధం మధురంగా ఉండాలంటే భార్యాభర్తలిద్దరూ ఒకరితో ఒకరు అన్ని విషయాలను షేర్ చేసుకోవాలంటారు. కానీ భర్తలు తమ భార్యలతో మాత్రం కొన్ని విషయాలను చెప్పకూడదు. అవేంటివి? ఎందుకు చెప్పకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పోలిక
ప్రతి ఒక్క భార్య తమ భర్తలు తమ వంటను మెచ్చుకోవాలని, పొగడాలని కోరుకుంటారు. ఇది చాలా చిన్న విషయమే అయినా ఇది వారిని ఎంతో సంతోషపెడుతుంది. అయితే చాలా మంది భర్తలు భార్యలు చేసిన వంటను వాళ్ల అమ్మ చేసిన వంటతో పోల్చుతుంటారు. కానీ ఇది వారిని అవమానించినట్టే అవుతుంది. దీనివల్ల మీ భార్య బాధపడి గొడవలు అయ్యే అవకాశం ఉంది. అందుకే ఇలా అస్సలు పోల్చకూడదు.
ఆమె కుటుంబం గరించి అగౌరవంగా
గొడవలు, కొట్లాటలు అయినప్పుడే కాకుండా కొంతమంది తరచుగా మీ కుటుంబం మంచిది కాదు, వీళ్లు అలా ఉంటారు, వాళ్లు ఇలా ఉంటారని భార్య కుటుంబం గురించి చెడుగా మాట్లాడుతుంటారు. కానీ ఇలా మీరు భార్యల కుటుంబం గురించి అగౌరవంగా మాట్లాడితే మీ మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది.
లావుగా, సన్నగా ఉన్నావని..
అమ్మాయిలు బరువు విషయంలో చాలా సున్నితంగా ఉంటారు. అంటే వారి బరువు గురించి మీరు మాట్లాడటం వారికి అస్సలు ఇష్టం ఉండదు. ఒకవేళ మీరు మీ భార్యను లావుగా లేదా సన్నగా ఉన్నావని అంటే మాత్రం వారు దానిగురించే ఎక్కువగా ఆలోచిస్తారు. ఇది వారి శరీరాన్ని అవమానించినట్టే అవుతుంది. అందుకే భార్యతో ఇలాంటి మాటలు మాట్లాడకండి.
అచ్చం అమ్మలాగే..
భర్తలు అనే కొన్ని మాటలు చెడు అర్థాన్ని కలిగిస్తాయి. అలాగే కుటుంబాన్ని అవమానించినట్టే ఉంటాయి. అయితే చాలా మంది భర్తలు తమ భార్యలను 'అచ్చం మీ అమ్మలానే ఉన్నావు' అని అంటుంటారు. కానీ ఇది వారి అమ్మగారిని అవమానించినట్టే అవుతుంది. అందుకే ఇలాంటి మాటలు అనకండి.
ఈ మాటలొద్దు
భార్యలు భర్తలతో మాట్లాడేటప్పుడు భర్తలు వారికి మాట్లాడే ఛాన్స్ అస్సలు ఇవ్వరు. ముఖ్యంగా భార్యలు మాట్లాడేటప్పుడు కాసేపు సైలెంట్ గా ఉంటావా, ఎక్కువ మాట్లాడకు లాంటి మాటలను ఎక్కువగా మాట్లాడుతుంటారు. కానీ ఇవి అస్సలు అనకూడదు.
సర్దుకోండి
కొత్తగా పెళ్లైన వారికి ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకే వీళ్లకు భర్తలు నా కుటుంబానికి సర్దుబాటు చేసుకోండి' లేదా 'పరిస్థితులకు అనుగుణంగా మారండి' అని ఎక్కువగా చెప్తుంటారు. కానీ భర్తలు భార్యలకు ఇలా అస్సలు చెప్పకూడదు.
ఇంతసేపు ఏం చేశారు
మీరు మీ భార్యకు ఏదైనా ఒక పనిని అప్పజెప్పినప్పుడు, ఆమె దాన్ని సరిగ్గా చేయనప్పుడు లేదా లేట్ గా చేసినప్పుడు ఇంత సేపు ఏం చేశావని అంటుంటారు. కానీ ఇలాంటి మాటలు అస్సలు అనకూడదు. ఇవి మీ ఇద్దరి మధ్య వివాధాలకు దారితీస్తాయి.