MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • తండ్రి పిల్లలకు ఇవ్వాల్సిన బెస్ట్ గిఫ్ట్స్ ఇవే..!

తండ్రి పిల్లలకు ఇవ్వాల్సిన బెస్ట్ గిఫ్ట్స్ ఇవే..!

 తండ్రి అంటే చాక్లెట్స్, బొమ్మలు కనిపెట్టడం కాదు.. పిల్లలకు మానసిక, భావోద్వేగ మద్దతు ఇవ్వాలి.  ముఖ్యంగా.. పిల్లలకు తండ్రి ఇవ్వాల్సిన బహుమతులు కొన్ని ఉంటాయట. అవేంటో చూద్దాం.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jan 21 2025, 05:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
father son

father son

ప్రతి తండ్రి తన పిల్లల గురించి చాలా గొప్పగా ఆలోచిస్తాడు. తన పిల్లలకు అందరి కంటే బెస్ట్ ఇవ్వాలని అనుకుంటాడు. వారు అడిగిందల్లా కొనివ్వాలని అనుకుంటాడు. కానీ..  తండ్రి అంటే చాక్లెట్స్, బొమ్మలు కనిపెట్టడం కాదు.. పిల్లలకు మానసిక, భావోద్వేగ మద్దతు ఇవ్వాలి.  ముఖ్యంగా.. పిల్లలకు తండ్రి ఇవ్వాల్సిన బహుమతులు కొన్ని ఉంటాయట. అవేంటో చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
father and son

father and son


పిల్లలకు తండ్రి ఇవ్వాల్సినవేంటి..?

1.సమయం..
నేను సంపాదించేది నా పిల్లల కోసమే కదా...డబ్బు లేకపోతే వాళ్లకు ఏం ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. డబ్బు పిల్లలకు అవసరమే. కానీ.. దానికి మించినది వారికి ఇవ్వాలి. అదే సమయం.డబ్బు  పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు. కానీ.. గడిచిపోయిన సమయం మళ్లీ రాదు. అందుకే వారి కోసం సమయం కేటాయించాలి. వారికి తోడుగా నిలవాలి. చదువు, ఆటలు, మాటలు ఏది నేర్చుకుంటున్నప్పుడు అయినా మీరు పక్కనే ఉ:డాలి. తండ్రి పక్కన ఉండటం వల్ల వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తండ్రితో బంధం బలపడుతుంది.

34

2.అమితమైన ప్రేమ..
పిల్లలకు తండ్రి అమితమైన ప్రేమ, ఆప్యాయత, ముద్దులు అందించాలి. తండ్రి ప్రేమ, ముద్దులు పిల్లల మానసిక ఆరోగ్యాన్ని, భద్రతా భావాన్ని పెంచుతాయి. వారి ఆత్మగౌరవం పెరిగి, జీవితంలో సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధమవుతాయి.


3. జీవిత నైపుణ్యాలు నేర్పించడం (జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు కావలసిన నైపుణ్యాలు) 
పిల్లలకు పుస్తకాలకంటే, సిలబస్ కంటే నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. తండ్రి వారికి ఆత్మస్థైర్యం, సమస్య పరిష్కారం, కష్టపడి పనిచేయడం వంటి జీవిత నైపుణ్యాలు నేర్పించాలి. ఈ నైపుణ్యాలు వారి భవిష్యత్తుకు, వృద్ధికి తోడ్పడతాయి.
 

44

4. మార్కుల వెంట పరిగెత్తకండి
పిల్లల మార్కులే వారి విలువను నిర్ణయించవు. తల్లిదండ్రులు పిల్లలను మార్కుల ఆధారంగానే చూస్తారు. మంచి తండ్రి పిల్లల నిజమైన విజయం వారి కష్టంలో, ప్రవర్తనలో ఉందని గుర్తిస్తాడు. పిల్లల విలువ మార్కుల్లో కాదు, వారి ప్రయత్నంలో ఉందని నేర్పించాలి.

5. తండ్రి ఆదర్శంగా నిలవాలి 
తండ్రి పిల్లలకు మొదటి హీరో. తండ్రిని చూసి పిల్లలు పెద్ద కలలు కంటారు. తండ్రి ఎల్లప్పుడూ పిల్లలకు ఆదర్శంగా, ప్రేరణగా నిలవాలి. దీనివల్ల పిల్లలు తండ్రిలా ఉండాలని కలలుకంటారు, వారి ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది.

6. భావోద్వేగ స్థిరత్వం, భద్రత కల్పించడం (తండ్రులు భావోద్వేగ స్థిరత్వం, ప్రేమ, మద్దతు ఇస్తారు) 
తండ్రి పిల్లలకు భావోద్వేగ స్థిరత్వం, భద్రత కల్పిస్తాడు. తండ్రి తోడు, మద్దతు, ప్రేమ పిల్లలకు జీవిత సమస్యలు, భావోద్వేగాలు ఎదుర్కోవడానికి తోడ్పడతాయి. తండ్రి ప్రేమ, మద్దతుతో ఏ కష్టాన్నైనా ఎదుర్కోగలమని, కుటుంబం ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటుందని పిల్లలు నేర్చుకుంటారు.

​

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image3
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved