- Home
- Life
- Pregnancy & Parenting
- Soft Toys: పిల్లలకు ఇలాంటి బొమ్మలు కొనిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
Soft Toys: పిల్లలకు ఇలాంటి బొమ్మలు కొనిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
Soft Toys: మీ పిల్లలు అడుగుతున్నారని, ఏడుస్తున్నారని వాళ్లు అడిగిన బొమ్మలు కొనిస్తున్నారా? కానీ, కొన్ని రకాల బొమ్మలు పిల్లల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయని మీకు తెలుసా? మరీ ముఖ్యంగా సాఫ్ట్ టాయ్స్ పిల్లల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అని మీకు తెలుసా?

ఇలాంటి బొమ్మలతో పిల్లలు ఆడుకుంటున్నారా?
ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు అంటే... కచ్చితంగా బొమ్మలు కూడా ఉంటాయి. పిల్లల వయసు తగినట్లు పేరెంట్స్ కూడా బొమ్మలు కొంటూ ఉంటారు. మార్కెట్లో చాలా రకాల టాయ్స్ ఉంటాయి. చాలా మంది పేరెంట్స్.. షార్ప్ గా ఉండే బొమ్మలను పిల్లలకు కొనివ్వరు, వాటితో ఆడుకోనివ్వరు. వాటికి బదులు సాఫ్ట్ టాయ్స్ ఇస్తూ ఉంటారు.
వివిధ రకాల జంతువుల ఆకారాల్లో, మెత్తగా ఉండే సాఫ్ట్ టాయ్స్ ని పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. వాటిని కౌగిలించుకొని... వాటి పక్కనే పడుకుంటూ ఉంటారు. కానీ... ఇవి చాలా ప్రమాదకరమైనవని మీకు తెలుసా? నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. ఇలాంటి బొమ్మల వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
ఇటీవలి కాలంలో జరిగిన పరిశోధనల ప్రకారం, సాఫ్ట్ టాయ్స్ లో బ్యాక్టీరియా, స్మూక్ష్మ క్రిములు, అలెర్జీకి కారణం అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్ మెంటల్ రీసెర్జ్ అండ్ పబ్లిక్ హెల్త్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం ఈ సాఫ్ట్ టాయ్స్ లో Staphylococcus aureus వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు ఉన్నట్లు గుర్తించారు. ఇవి చిన్న పిల్లల రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపి, జలుబు, దగ్గు, స్కిన్ అలెర్జీ, జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది.
ఈ బొమ్మల్లో బ్యాక్టీరియా ఎలా పెరుగుతుంది?
పిల్లలు ఈ సాఫ్ట్ టాయ్స్ ని ఎక్కువగా తమ చేతుల్లోనే ఉంచుకుంటారు. ఆడుకొనేటప్పుడు, నిద్రపోతున్నప్పుడు , బయటకు వెళ్తున్నప్పుడు కూడా వాటిని తమ వెంటే ఉంచుకుంటారు. ఆ సమయంలో బొమ్మను ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వల్ల దానిపై బ్యాక్టీరియా ఎక్కువగా చేరే అవకాశం ఉంటుంది. అంతేకాదు, వేడి, తేమతో కూడిన వాతావరణం కూడా బ్యాక్టీరియా పెరగడానికి కారణం కావచ్చు. దాని వల్ల ఆ బొమ్మలు పిల్లల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.
సాఫ్ట్ టాయ్స్ ని శుభ్రం చేస్తున్నారా?
సాఫ్ట్ టాయ్స్ ని రెగ్యులర్ గా శుభ్రం చేస్తూ ఉండాలి. అలా శుభ్రం చేసిన తర్వాతే పిల్లలకు వాటిని ఇస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల.. ఆ బొమ్మలపై పేరుకుపోయిన బాక్టీరియా, వైరస్ లు తొలగిపోతాయి. క్రమం తప్పకుండా శుభ్రం చేయడం వల్ల ఆ బొమ్మలు ఎక్కువ కాలం రంగు కోల్పోకుండా ఉంటాయి. వీటితో పాటు... పిల్లలు బొమ్మలతో ఆడుకునే ప్రదేశాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచాలి.
సాఫ్ట్ టాయ్స్ ని శుభ్రం చేసే విధానం...
బొమ్మను దిండు కవర్ లేదా లాండ్రీ బ్యాగ్‌లో ఉంచి, చల్లటి నీటితో , తేలికపాటి డిటర్జెంట్‌తో వాషింగ్ మెషిన్ లో ఉతకవచ్చు. లేదంటే.. గోరువెచ్చని నీటిలో కొద్దిగా సబ్బు కలిపి.. ఆ నీటిలో ఈ సాఫ్ట్ టాయ్స్ ని ఉంచాలి. కాసేపటి తర్వాత నీడలో వీటిని ఆరపెడితే సరిపోతుంది.