ప్రెగ్నెన్సీ టైంలో దానిమ్మ పండును ఖచ్చితంగా తినాలని ఎందుకు చెప్తారో తెలుసా?
దానిమ్మ పండును తినడం వల్ల గర్భిణులు వాంతులు చేసుకునే అవకాశం తగ్గుతుంది. అలాగే రక్తహీనత సమస్య కూడా ఉండదు. దానిమ్మ పండు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి బరువును అదుపులో ఉంచుతుంది.
Image: Getty
ప్రెగ్నెన్సీ సమయంలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గర్భిణులు మంచి పోషకాహారం తీసుకోవాలి. ఎందుకంటే ఇవి తల్లీ, బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతాయి. ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తాయి. గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ముఖ్యమైన పండ్లలో దానిమ్మ పండు ఒకటి. ఈ పండులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ బి-6, సోడియం, పొటాషియం, డైటరీ ఫైబర్, కాల్షియం మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.
Image: Getty Images
దానిమ్మలోని పోషకాలు తల్లికి, బిడ్డకు ఒకేలా మేలు చేస్తాయి. దానిమ్మ పండును తినడం వల్ల గర్భిణుల్లో వాంతులు, రక్తహీనత సమస్యల నుంచి కొంత వరకు ఉపశమనం పొందొచ్చు. దానిమ్మ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. అలాగే శరీర బరువును అదుపులో ఉంచడానికి ఎంతో సహాయపడుతుంది.
Image: Getty Images
దానిమ్మ జ్యూస్ ను తాగడం వల్ల మావికి గాయమయ్యే ప్రమాదం తగ్గుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. గర్భధారణ సమయంలో శరీర నొప్పులు సర్వ సాధారణం. అయితే దీనికి దానిమ్మ మంచి పరిష్కారం. ఈ పండులోని పొటాషియం దీనికి సహాయపడుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో కాళ్ల నొప్పులు, వెన్నునొప్పిని తగ్గించడానికి ఈ పండు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా బీపీని నియంత్రించడానికి కూడా పొటాషియం బాగా పనిచేస్తుంది.
దానిమ్మ పీచు కడుపులోని శిశువు మెదడు ఎదుగుదలకు ఎంతో సహాయపడుతుంది. ఈ పండు శిశువు తెలివితేటలు, నరాల పెరుగుదల, నాడీ సంబంధిత రుగ్మతలకు మంచి ఔషధం. దానిమ్మ జ్యూస్ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. దానిమ్మ జ్యూస్ ను తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే హృదయ సంబంధ సమస్యలను తగ్గించడానికి కూడా ఈ జ్యూస్ సహాయపడుతుంది.
దానిమ్మ పండు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి కూడా సహాయపడుతుంది. ఈ పండులో ఉండే క్యాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు.