పిల్లలకు ఏ ఏజ్ లో ఫోన్ ఇవ్వచ్చు..!
తన పిల్లలకు స్క్రీన్ టైమ్ సెట్ చేసేవాడట. టైమ్ కి నిద్రపోయేలా ప్లాన్ చేసేవారట. హోమ్‌వర్క్, స్నేహితులతో టచ్‌లో ఉండడం వంటివి తమ పిల్లల జీవితంలో ఎక్కువగా భాగం చేసేవారట.
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని జీవితాన్ని ఎవరూ ఊహించలేరు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఫోన్ ఒక భాగం అయిపోయింది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఫోన్ లకు బానిసలుగా మారిపోయారు. ముఖ్యంగా పిల్లలు గేమ్స్, యూట్యూబ్ లో వీడియోలు అంటూ మరీ ఎక్కువగా వాటికి అతుక్కుపోతున్నారు.అయితే... నిజంగా పిల్లలు ఫోన్ వాడొచ్చా..? అసలు ఏ ఏజ్ పిల్లలు ఫోన్ చూడొచ్చో నిపుణులు ఏం చెబుతున్నారో ఓసారి చూద్దాం..
బిల్ గేట్స్ తన పిల్లలకు 14 ఏళ్లు వచ్చే వరకు మొబైల్ ఫోన్లు కలిగి ఉండనివ్వలేదు
ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన బిల్ గేట్స్ తన పిల్లలకు 14 ఏళ్లు వచ్చే వరకు మొబైల్ ఫోన్‌లు ఇవ్వలేదట. ఒక నివేదిక ప్రకారం అతను డిన్నర్ టేబుల్ వద్ద మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడాన్ని నిషేధించాడు. తన పిల్లలకు స్క్రీన్ టైమ్ సెట్ చేసేవాడట. టైమ్ కి నిద్రపోయేలా ప్లాన్ చేసేవారట. హోమ్‌వర్క్, స్నేహితులతో టచ్‌లో ఉండడం వంటివి తమ పిల్లల జీవితంలో ఎక్కువగా భాగం చేసేవారట.
మీ పిల్లలకు 10-12 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు మీరు మొదటి స్మార్ట్‌ఫోన్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. అది కూడా పిల్లలు తమ తల్లిదండ్రులతో మాట్లాడటానికి మాత్రమే ఇవ్వాలట. ముఖ్యంగా కమ్యూనికేషన్ కోసం మాత్రమే ఇవ్వాలట. పిల్లలు కమ్యూనికేషన్‌లను అర్థం చేసుకోవడం ప్రారంభించినప్పుడే వారికి కమ్యూనికేషన్ గాడ్జెట్‌ను పరిచయం చేయడానికి సరైన సమయం అని నిపుణులు చెప్పారు.
13 నుండి 17 సంవత్సరాల వయస్సు గల యువకులలో 95% మందికి స్మార్ట్‌ఫోన్ యాక్సెస్ ఇవ్వాలట. ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే ప్రకారం, 13- 17 సంవత్సరాల మధ్య వయస్సు గల 95% మంది పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉన్నారు. 2022 సర్వే డేటా 2014-2015 నివేదిక ప్రకారం 13 నుండి 14 సంవత్సరాల వయస్సు గల వారి కంటే 15 నుండి 17 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు స్మార్ట్‌ఫోన్‌లకు ఎక్కువ యాక్సెస్ కలిగి ఉన్నారట.
టీనేజ్‌లకు ఫోన్‌ల యాక్సెస్ పెరుగుతోంది
2014-2015లో చేసిన అధ్యయనంలో...గత 8 ఏళ్లలో టీనేజర్లలో స్మార్ట్‌ఫోన్‌ల యాక్సెస్ పెరిగిందని ప్యూ రీసెర్చ్ సర్వే కనుగొంది. మునుపటి అధ్యయనంలో, 73% మంది యుక్తవయస్కులు స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉన్నారు. డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ కంప్యూటర్‌లు లేదా గేమింగ్ కన్సోల్‌లు కూడా ఎక్కువగా వాడుతున్నట్లు గుర్తించారు. అంటే 2022లో 95% మంది పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉండగా, 2014 , 2022లో వరుసగా 87% ,90% డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్‌ను కలిగి ఉన్న టీనేజ్ పిల్లలలో స్మార్ట్‌ఫోన్ వినియోగం చాలా పెరిగింది.
కరోనా టైమ్ లో పిల్లలు చాలా ఎక్కువగా స్మార్ట్ ఫోన్ లకు అలవాటు పడిపోయారు. స్కూళ్లు, కాలేజీలు లేకపోవడంతో.. చదువులన్నీ ఫోన్ లలోనే సాగాయి. ఆ సమయంలో ఫోన్ లకు ఎక్కువగా బానిసలుగా మారారు.