పిల్లలు తినడానికి మారం చేస్తున్నారా? తల్లిదండ్రులు ఇలా చేస్తే చాలు!
చాలా మంది పిల్లలు తినడానికి తల్లిదండ్రులను బాగా సతాయిస్తుంటారు. కొట్టినా తినరు.. తిట్టినా తినరు.. ఇలాంటప్పుడు తల్లిదండ్రులు ఒక పనిచేస్తే పిల్లలు మారం చేయకుండా తింటారు.
పిల్లల పెంపకం ప్రతి తల్లిదండ్రులకు పెద్ద సవాలే. కానీ తల్లిదండ్రుల పెంపకంపైనే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇకపోతే ప్రతి పేరెంట్స్ కు తమ పిల్లల్ని నిద్రలేపడం నుంచి తినిపించడం వరకు.. పిల్లలకు సంబంధించింది ప్రతిదీ చేయడానికి చాలా కష్టపడుతుంటారు. ముఖ్యంగా చాలా మంది తల్లిదండ్రులకు వారికి తినిపించడం పెద్ద టాస్క్ గా మారుతుంది. అయితే కొంతమంది తల్లులు అయితే పిల్లలతో మాట్లాడుతూ.. వారికి కథలు చెబుతూ తినిపిస్తుంటారు. కానీ ఇవి అన్ని సమయాల్లో పనిచేయవు. అలాగని పిల్లలు తినకుండా ఉంటే చూడలేం. కాబట్టి పిల్లలు పుష్కలంగా తినాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
Kids food
కలిసి తినడం నేర్చుకోండి
అవును ఈ ట్రిక్ ప్రతి తల్లిదండ్రులకు బాగా ఉపయోగపడుతుంది. మీ పిల్లలు తినడానికి బాగా సతాయిస్తున్నట్టైతే మీరు కూడా వారితో కలిసి తినండి. మీరు కూడా వారితో పాటు తింటే మీ పిల్లలు కడుపు నిండా తింటారు. ఇకపోతే తినేటప్పుడు పిల్లలకు.. ఏవి తినాలి? ఏవి తినకూడదు? ఏ కూరగాయలు ఆరోగ్యానికి మంచిచేస్తాయి? అనే ముచ్చటు చెప్పండి. ఇలా చెప్పడం వల్ల మీ పిల్లలు.. వారికి నచ్చని వాటిని కూడా తినడానికి ప్రయత్నిస్తారు.
kids foods
అలవాటు మార్చుకోవాలి
చాలా మంది పిల్లలు తినాలని వారి ముందు ఫోన్లు, టీవీలను ఆన్ చేస్తుంటారు. వీటిని చూస్తూ పిల్లలు బాగా తింటారు అని భావిస్తారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఈ విషయం చెప్తే పిల్లలకు అర్థం కాదు కాబట్టి.. వీటిని చూస్తూ తినడం వల్ల వచ్చే సమస్యల గురించి వారికి చెప్పండి. నిజానికి ఫోన్లు చూస్తే తింటే పిల్లలు మోతాదుకు మించి ఫుడ్ ను తింటారు. దీనివల్ల వారు ఊబకాయం బారిన పడతారు. కాబట్టి ఈ అలవాటును మానుకోమని సలహానివ్వండి.
ఇలా చేయండి
చాలా మంది పిల్లలు.. నేను ఈ కూరగాయ తినను. అది తినను అని ఆరోగ్యకరమైన కూరగాయలను తినకుండా ఉంటారు. కానీ పిల్లలకు పోషకాలు కూరగాయల నుంచే ఎక్కువగా అందుతాయి కాబట్టి తల్లిదండ్రులు ఆ కూరగాయలు ఇష్టం లేదన్నా.. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వండి పెట్టండి. లేదా ఆ కూరగాయలు కూరల్లో కనిపించకుండా చేయండి. లేదంటే మీ పిల్లల ఎదుగుదలకు, ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు అందవు.
ఆకు కూరలు
పిల్లలకు ఆకు కూరలు కూడా చాలా అవసరం. ముఖ్యంగా వీరికి పాలకూరను ఖచ్చితంగా తినిపించాలి. కానీ చాలా మంది పిల్లలు పాలకూరను అస్సలు తినరు. కాబట్టి తల్లుల్లుపాలకూర బొండా, పాలకూర వడ వంటివి చేసి పెట్టండి. బచ్చలికూరకు నో చెప్పిన పిల్లలు కూడా దాన్ని రుచి చూసి తింటారు. అలాగే మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికి వారి ఆహారంలో కూరగాయలను చేర్చాలనుకుంటే వెజ్ పిజ్జా, వెజ్ పులావ్ వంటివి చేసి పెట్టండి. ఈ అలవాటు పిల్లలకు కూరగాయలపై ఆసక్తిని పెంచుతుంది. వీటితో పాటుగా చేపలు, చికెన్, మటన్ వంటి మాంసాహారాన్ని కూడా వారానికి ఒక్కసారైనా వండి తినిపించండి. అయితే ఇది పిల్లలకు నచ్చేలా ఉండాలి.