పిల్లల్ని ఏ వయసులో స్కూల్ కు పంపాలో తెలుసా?
పిల్లలకు కొంచెం వయసు రాగానే ప్లే స్కూల్ కు పంపిస్తుంటారు. కానీ వారి వయసును మాత్రం పట్టించుకోరు. కానీ తల్లిదండ్రులు పిల్లల్ని ఏ వయసులో ప్లే స్కూల్ కు పంపాలో తెలుసా?
చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని ప్లే స్కూల్ కు పంపిస్తుంటారు. నిపుణుల ప్రకారం.. పిల్లలకు ఒక నిర్ణీత వయసు వచ్చినాకనే ప్లే స్కూల్ కు పంపాలి. ఈ ప్లే స్కూల్ పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది వారికి సరికొత్త వాతావరణాన్ని పరిచయం చేస్తుంది. కానీ చిన్న పిల్లలను ప్లే స్కూల్ కు పంపడానికి సరైన వయసు ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
పిల్లలను ప్లే స్కూల్ కు పంపడానికి సరైన వయస్సు ఏది?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పిల్లలు ప్లే స్కూల్ కు వెళ్లడానికి సరైన వయస్సు సాధారణంగా 2 నుంచి 3 సంవత్సరాల మధ్యగా పరిగణించబడుతుంది. ఈ వయసు పిల్లలు బయటి విషయాలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. దీన్ని నిర్ణయించడానికి ఎన్నో విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా 2 నుంచి 3 ఏండ్ల వయసులోనే పిల్లల్లో సామాజిక, భావోద్వేగ, అభిజ్ఞా నైపుణ్యాలు పెంపొందుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ వయసులో పిల్లలు ప్లే స్కూల్ కు వెళ్లి అక్కడ ఏదో ఒకటి నేర్చుకునేందుకు సిద్దంగా ఉంటారు.
ఈ వయస్సులో పిల్లలు తమ తోటి పిల్లలతో మాట్లాడటానికి ఆసక్తి చూపుతారు. ఇది వారి సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది. అందుకే పిల్లల్ని 2 నుంచి 3 ఏండ్ల వయసులో ప్లే స్కూల్ కు పంపాలని నిపుణులు చెప్తారు.
పిల్లలు భాష నేర్చుకున్నప్పుడు..
పిల్లలు ఎక్కువగా 3 సంవత్సరాల వయస్సులో భాషా పరిజ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఈ వయసులో పిల్లల్లో ఎప్పుడు మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? వంటి విషయాలు అభివృద్ధి చెందుతాయి. ఇలాంటి పరిస్థితిలో పిల్లల్ని ప్లే స్కూల్స్ పంపడం వల్ల వారి పదజాలం, కమ్యూనికేషన్ సామర్థ్యాలు మరింత పెరుగుతాయి.
పిల్లలను ప్లే స్కూల్ కు పంపడం వల్ల కలిగే ప్రయోజనాలు
ప్లే స్కూల్ వల్ల పిల్లలు మంచి దినచర్యను ప్రారంభిస్తారు. ఇది వారిని పాఠశాల విద్యకు సిద్దం చేస్తుంది. దీంతో ఆ తర్వాత వారిని బడికి పంపితే మానసికంగా కూడా సన్నద్ధమవుతారు. ఏదేమైనా వ్యక్తిగత పిల్లల అభివృద్ధి, కుటుంబం నిర్దిష్ట పరిస్థితులను బట్టి సరైన వయస్సు మారుతుంది. అందుకే ప్లే స్కూల్ కు పంపే ముందు తల్లిదండ్రులు తమ పిల్లల షెడ్యూల్, వారి పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలి.