MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • పిల్లలు ఆడుకోకపోతే ఏమౌతుందో తెలుసా?

పిల్లలు ఆడుకోకపోతే ఏమౌతుందో తెలుసా?

ఒకప్పుడు పిల్లలు తోటి పిల్లలతో కలిసి ఆరుబయట పొద్దంతా ఏదో ఒక గేమ్ ఆడుతుండేవారు. కానీ ఇప్పుడు మొబైల్ ఫోన్లకు అలవాటు పడి ఇంట్లో ఓ మూలన కూర్చొని ఆన్లైన్ గేమ్స్ ను ఆడుతున్నారు. కానీ దీనివల్ల మీ పిల్లలు ఎలా తయారువుతారో తెలుసా? 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Apr 06 2024, 10:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కరోనాకు ముందు పిల్లలు ఇంటి చుట్టుపక్కల పిల్లలు, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లి ఆడుకునేవారు. ఆటలో పడి తినడం కూడా మర్చిపోయేవారు. కానీ ఇప్పుడు ఇంట్లో ఏదో ఒక మూలన కూర్చొని ఫోన్లకు అతుక్కుపోతున్నారు. పిల్లల్లో మారుతున్న ఈ అలవాటు వల్ల వారు సోమరులుగా మారిపోతున్నారు. అంతేకాదు ఫోన్ల వాడకం వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది. వారికి ఆనందం అనేది లేకుండా పోతోంది. చాలా మంది పిల్లలను టీవీ కాకుంటే ఫోన్, ఫోన్ కాకుంటే టీవీని చూస్తుంటారు. వీటివల్ల కూర్చున్న దగ్గర నుంచి పక్కకు కూడా జరగాల్సిన అవసరం ఉండదు. కానీ ఈ అలవాటు వల్ల పిల్లల ఆరోగ్యం ఏమౌతుందో ఒక్క సారి ఆలోచించారా? 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Children

Children

ఆటలు కూడా శారీరక శ్రమే అవుతుంది. బయట ఆడుకోని పిల్లలు పెద్దవారయ్యాక కూడా ఎలాంటి పనులు చేయడానికి ఇష్టపడరు. ఇది పిల్లల్ని సోమరులుగా మారుస్తుంది. ఇది మీ పిల్లలు పెద్దవారయ్యాక ఎన్నో సమస్యలను కలిగిస్తుంది. 
 

37

సోమరితనం లక్షణాలు

- ఓకేదగ్గర కూర్చోవడం, పనుల పట్ల ఇంట్రెస్ట్ లేకపోవడం
-ఉత్సాహంగా లేకపోవడం
-కష్టపడి పనిచేయడానికి ఇష్టపడకపోవడం

47

స్థూలకాయం

సోమరితనం వల్ల  పిల్లలు కూర్చున్న దగ్గర నుంచి పక్కకు కూడా వెళ్లరు. దీనివల్ల మీ పిల్లల శారీరక శ్రమ తగ్గుతుంది. యాక్టివిటీ తగ్గడం వల్ల పిల్లలు ఊబకాయం బారిన పడతారు. విపరీతంగా బరువు పెరుగుతారు. అంతేకాదు టైప్ 2 డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్ , అధిక రక్తపోటు వంటి జీవక్రియ సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. 
 

57

గుండె జబ్బులు

పిల్లలు ఆడుకోకపోవడం వల్ల గుండె జబ్బుల రిస్క్ కూడా బాగా పెరుగుతుంది. అవును వ్యాయామం చేయకపోవడం వల్ల వారి గుండె బలహీనపడుతుంది. ఇది రక్తపోటు, కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమవుతుంది. దీనివల్ల గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే పిల్లలు తమ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే చిన్నప్పటి నుంచే వ్యాయామం చేస్తుండాలి. 
 

67

కండరాల అస్థిపంజర సమస్యలు

శారీరక శ్రమ లేకపోవడం, ఎలక్ట్రానిక్ స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడపడం వల్ల పిల్లలు చిన్న వయస్సు నుంచే కండరాల సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ఈ సమస్యలలో ఒకటి కండరాల బలం తగ్గడం.

77

మీ పిల్లలు సోమరులుగా మారొద్దంటే వారికి ఫిట్ ఉండటం ఎలాగో నేర్పించండి. ఇందుకోసం చిన్న వయసు నుంచే బయటకు వచ్చి శారీరక శ్రమ చేసేలా ప్రోత్సహించాలి. కష్టపడి పనిచేయాలని బలవంతం చేయకుండా పిల్లలు ఫిట్ గా ఉండేలా చూసుకోండి. ఇది తల్లిదండ్రులుగా మీ బాధ్యత. రాత్రి భోజనం తర్వాత కొద్దిసేపు నడవమని చెప్పండి. పిల్లలు సోమరులుగా మారకుండా ఉండేందుకు ఫోన్ ను తక్కువ సేపు చూసేలా జాగ్రత్త తీసుకోండి. ఎక్కువ సమయం ఆడుకోమని చెప్పండి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image3
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved