MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • చిన్న పిల్లల్ని ఏసీ రూం లో పడుకోబెట్టొచ్చా?

చిన్న పిల్లల్ని ఏసీ రూం లో పడుకోబెట్టొచ్చా?

మండుతున్న ఎండలకు పెద్దలే తట్టుకోలేరు. ఇక పిల్లలేం తట్టుకుంటారు. అందుకే చిన్న పిల్లలున్న ఇంట్లో ఎప్పుడూ ఫ్యాన్లు ఆన్ లోనే ఉంటాయి. అయితే కొంతమంది చిన్న పిల్లల్ని ఏసీ రూముల్లో పడుకోబెడుతుంటారు. అసలు పిల్లల్ని ఏసీ రూముల్లో పడుకోబెట్టొచ్చా?   

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Apr 07 2024, 01:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


ఏప్రిల్ నెల ప్రారంభం నుంచి ఎండలు మండిపోతున్నాయి. దీంతో చాలా మంది పొద్దంతా ఏసీలను ఆన్ లోనే ఉంచుతుంటారు. అయితే కొంతమంది చిన్న పిల్లలు ఉక్కపోతలకు తట్టుకోలేరని ఏసీ రూముల్లోనే పడుకోబెడుతుంటారు. దీనివల్ల చిన్నారికి వేడిమి కాదని. కానీ ఏసీ చిన్న పిల్లలకు మంచి కంటే చెడే ఎక్కువ చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..  ఏసీ రూముల్లో చిన్న పిల్లల్ని రోజూ పడుకోబెట్టడం వల్ల వారి శారీరక ఎదుగుదల, ఇమ్యూనిటీ పవర్ పై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఎందుకంటే పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. పిల్లలకు చల్లని గాలి, పొడి గాలి ఎప్పుడూ తగలడం వల్ల పిల్లల చర్మం పొడిబారుతుంది. అలాగే దురద కూడా పెడుతుంది. ఏసీ గాలి పిల్లల ముక్కు, గొంతుపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. దీనివల్ల మీ పిల్లలకు శ్వాస సమస్యలు వస్తాయి. 

36

ఏసీ పిల్లలను ఎలా ప్రభావితం చేస్తుంది?

సాధారణంగా ఏసీ ఇంట్లోని గాలిని శుద్ధి చేస్తుంది. కానీ ఇది గాలిలో తేమను తగ్గిస్తుంది.దీని నుంచి వచ్చే పొడిగాలి శ్వాసకోశ వ్యవస్థపై చెడు ప్రభావం చూపెడుతుంది. ఇప్పటికే మీ పిల్లలకు ఉబ్బసం లేదా శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఉంటే ఏసీలో మాత్రం పడుకోబెట్టకండి. ఒకవేళ పడుకోబెడితే పిల్లల నాసికా మార్గాలను ఎండిపోతాయి. దీనివల్ల పిల్లల శరీరంలోకి దుమ్ము, బ్యాక్టీరియా వెళ్లి రోగాలొచ్చేలా చేస్తాయి. 
 

46
kids

kids

మీకు తెలుసో.. లేదో.. చిన్న పిల్లలకు చల్ల గాలి అవసరం లేదు. పిల్లల పెరుగుదలకు సమతుల్య ఉష్ణోగ్రత మాత్రమే అవసరం. పిల్లలు చాలా చల్లని వాతావరణంలో ఉంటే వారి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే సామర్థ్యం బలహీనపడుతుంది. అందుకే వాతావరణంలో కొద్దిపాటి మార్పు వచ్చినా జలుబు తొందరగా వస్తుంటుంది. అంతేకాకుండా చల్లని వాతావరణంలో చిన్నపిల్లల శరీర కార్యకలాపాలు క్రమంగా తగ్గుతాయి. దీనివల్ల వారి శారీరక ఎదుగుదల దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. 

56

ఏసీని ఎలా ఉపయోగించాలి?

ఏసీ వల్ల ఇన్ని అనర్థాలు ఉన్నాయి కాబట్టి ఏసీని ఉపయోగించకూడదేమో అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ దీని అర్థం ఏసీని అస్సలు ఉపయోగించకూడదని కాదు. ఎండాకాలంలో మీ అవసరాన్ని బట్టి మాత్రమే ఏసీని వాడాలి. అలాగే ఏసీ ఉష్ణోగ్రతను 24 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచాలి. ముఖ్యంగా గది ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోకుండా ఉండాలి. అలాగే గదిలో తగినంత మొత్తంలో హ్యూమిడిఫైయర్ ఉపయోగించడం వల్ల గాలిలో తేమను ఉంటుంది. 
 

66

సహజ గాలి పిల్లలకు చేసే మేలు 

చిన్న పిల్లలకు సహజ గాలే ఎంతో మేలు చేస్తుంది. అందుదే మీ గది కిటికీలను వీలైనంత వరకు తెరిచి ఉంచండి.  అలాగే మీ పిల్లలకు రెగ్యులర్ గా ఉదయం సూర్యరశ్మిని చూపించండి. ఇది వారిని ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ డిని అందిస్తుంది. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మీ పిల్లలకు ఈ అలవాటు ఉందా?
Recommended image2
Tamannaah: తల్లిగా తన కోరికని బయట పెట్టిన తమన్నా.. అమ్మలా అస్సలు ఉండనంటూ బోల్డ్ స్టేట్ మెంట్
Recommended image3
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved